Team India T20 World Cup jersey : 'చెత్తలా ఉంది'- టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీపై ఫ్యాన్స్!
Team India T20 World Cup 2024 jersey : టీమిండియా కొత్త జెర్సీ లీక్ అయ్యింది. రానున్న టీ20 వరల్డ్ కప్‌లో ఈ జెర్సీని ఉపయోగిస్తారు. అయితే.. చాలా మందికి ఈ టీమిండియా కొత్త జెర్సీ నచ్చలేదు!
Team India T20 World Cup : టీమిండియా టీ20 వరల్డ్ కప్ జట్టు వివరాలు కొన్ని రోజుల క్రితం బయటకు వచ్చాయి. ఇక ఇప్పుడు.. టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ..ఆన్లైన్లో లీక్ అయ్యింది. కొత్త జెర్సీకి సంబంధించిన కొన్ని ఫొటోలు.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ..
వైరల్‌గా మారిన ఫొటోల ప్రకారం.. టీమిండియా జెర్సీలో.. వీ షేప్ నెక్కి ట్రై కలర్ స్ట్రిప్స్ ఉన్నాయి. పూర్తి బ్లూ రంగు కాకుండా.. ఈసారి జెర్సీలో బ్లూతో పాటు కాషాయం రంగు కూడా ఉంది. అడిడాస్‌కి చెందిన లోగో.. జెర్సీ కుడివైపు ఉంది. బీసీసీఐ లోగో ఎడమవైపు ఉంది.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన టీమిండియా జెర్సీ ఫొటోను ఇక్కడ చూడండి :
అయితే.. ఈ కొత్త జెర్సీకి మిశ్రమ స్పందన లభిస్తోంది. కొందరు.. టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ బాగుంది అని అంటుంటే.. ఇంకొందరు బాలేదంటున్నారు.
"ఇది చెత్తలా ఉంది," అని ఓ నెటిజెన్ కామెంట్ చేశారు.
T20 worldcup latest news : "మూడ్ అంతా పాడైపోయింది. ఈ టీమిండియా జెర్సీని ఎవరు డిజైన్ చేశారు?" అని మరో వ్యక్తి రాసుకొచ్చారు.
"వావ్. లవ్లీ జెర్సీ. వీ-షేప్ నెక్ బాగా నచ్చింది," అని మరో వ్యక్తి పొగిడారు.
"నైస్" అని ఒకరంటే.. "దారుణంగా ఉంది" అని ఇంకొకరు అన్నారు.
మరి ఈ టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ మీకెలా అనిపించింది?
టీమిండియా టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్..
Team India T20 World Cup squad : ప్రస్తుతం ఐపీఎల్ 2024 జోష్‌లో ఉన్న క్రికెట్ అభిమానులకు.. ఆ తర్వాత కూడా టీ20 జోరు కొనసాగుతుంది. జూన్ మొదటి వారంలో 2024 టీ20 వరల్డ్ కప్ మొదలవ్వనుంది. వెస్టిండీస్- అమెరికాలు ఈ టోర్నీని నిర్వహిస్తున్నాయి.
ఇక ఈ వరల్డ్ కప్ కోసం.. టీమిండియా జట్టును ఇటీవలే ప్రకటించింది బీసీసీఐ. కేఎల్ రాహుల్, శ్రేయస్ ఐయ్యర్, శుభ్‌మాన్ గిల్‌కు ఈ 15 సభ్యుల జట్టులో చోటు దక్కలేదు.
టీమిండియా టీ20 వరల్డ్ కప్ జట్టు- రోహిత్ శర్మ (కెప్టెన్), హర్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వీ జైశ్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, సంజూ సామ్సన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేందర్ చాహల్, ఆర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్.
రిజర్వ్ ఆటగాళ్లు:- శుభ్‌మాన్ గిల్, రింకు సింగ్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్
సంబంధిత కథనం