Team India Schedule: ఇండియన్ క్రికెట్ టీమ్ ఈ ఏడాది బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనుంది. ఐపీఎల్, ఇంగ్లండ్ టూర్ ముగిసిన తర్వాత బంగ్లాదేశ్ లో వన్డే, టీ20 సిరీస్ ఆడటానికి టీమిండియా వెళ్లనున్నట్లు బీసీసీఐ తాజాగా రిలీజ్ చేసిన షెడ్యూల్ చూస్తే స్పష్టమవుతోంది. ఆగస్టులో ఈ టూర్ జరగనుంది.
టీమిండియా ఈ ఏడాది ఆగస్టులో బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనున్నట్లు బీసీసీఐ మంగళవారం (ఏప్రిల్ 15) అనౌన్స్ చేసింది. ఇందులో భాగంగా మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ ఆడుతుంది. ఆగస్ట్ 17న ఈ టూర్ మొదలవుతుంది. మొదట మూడు వన్డేల సిరీస్ జరుగుతుంది. ఆ తర్వాత మూడు టీ20ల సిరీస్ ఆడతారు.
ఆగస్ట్ 17న మిర్పూర్ లోని షేరే బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియంలో తొలి వన్డే జరుగుతుంది. ఆ తర్వాత ఆగస్ట్ 20న అక్కడే రెండో వన్డే ఆడతారు. ఆగస్ట్ 23న చట్టోగ్రామ్ లో మూడో వన్డే జరుగుతుంది.
ఇక ఆగస్ట్ 26 నుంచి మూడు టీ20ల సిరీస్ ప్రారంభమవుతుంది. చట్టోగ్రామ్ లోనే తొలి టీ20 జరగనుంది. ఆ తర్వాత ఆగస్ట్ 29న మిర్పూర్ లో రెండో టీ20, ఆగస్ట్ 31న అక్కడే మూడో టీ20 జరుగుతాయి. ఈ షెడ్యూల్ ను బీసీసీఐ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.
మొదటి వన్డే: ఆగస్టు 17 (ఆదివారం) – ఎస్‌బీఎన్‌సీఎస్, మిర్పూర్
రెండో వన్డే: ఆగస్టు 20 (బుధవారం) – ఎస్‌బీఎన్‌సీఎస్, మిర్పూర్
మూడో వన్డే: ఆగస్టు 23 (శనివారం) – బీఎస్‌ఎస్‌ఎఫ్‌ఎల్‌ఎంఆర్‌సీ, చట్టోగ్రామ్
మొదటి టీ20: ఆగస్టు 26 (మంగళవారం) – బీఎస్‌ఎస్‌ఎఫ్‌ఎల్‌ఎంఆర్‌సీ, చట్టోగ్రామ్
రెండో టీ20: ఆగస్టు 29 (శుక్రవారం) – ఎస్‌బీఎన్‌సీఎస్, మిర్పూర్
మూడో టీ20: ఆగస్టు 31 (ఆదివారం) – ఎస్‌బీఎన్‌సీఎస్, మిర్పూర్
ఈ ఏడాది టీమిండియా బిజీబిజీగా గడపనుంది. ఈ ఏడాది మొదట్లో ఇంగ్లండ్ తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడింది. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో తలపడింది. అది ముగిసిన కొన్ని రోజులకే ఐపీఎల్ ప్రారంభమైంది. ఈ మెగా లీగ్ ముగిసిన తర్వాత ఐదు టెస్టుల సిరీస్ కోసం ఇండియన్ టీమ్ ఇంగ్లండ్ కు వెళ్లనుంది.
ఈ టూర్ జూన్ నుంచి ఆగస్ట్ వరకు సాగనుంది. అక్కడి నుంచి వచ్చిన వెంటనే బంగ్లాదేశ్ టూర్ కు వెళ్తుంది. సెప్టెంబర్ లో ఆసియా కప్ ఆడాల్సి ఉంది. అక్టోబర్ లో వెస్టిండీస్ టీమ్ ఇండియాకు వస్తుంది. ఆ వెంటనే సౌతాఫ్రికా సిరీస్ ఉంటుంది. ఆ తర్వాత ఇండియన్ టీమ్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తుంది. అక్కడ పరిమిత ఓవర్ల సిరీస్ ఆడాల్సి ఉంది.
సంబంధిత కథనం