Harry Singh: తండ్రి టీమిండియా క్రికెటర్ - కొడుకు ఇంగ్లండ్ క్రికెటర్ - ఇంగ్లండ్ టీమ్‌లో హ్యారీసింగ్
Harry Singh: టీమిండియా మాజీ పేసర్ ఆర్‌పీ సింగ్ కొడుకు హ్యారీ సింగ్ ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ తరఫున బరిలో దిగాడు. శ్రీలంకతో జరుగుతోన్న టెస్ట్‌లో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా హ్యారీ సింగ్ కొద్ది ఫీల్డింగ్ చేశాడు. అతడు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
Harry Singh: ఆర్‌పీ సింగ్ టీమిండియా తరఫున 58 వన్డేలు, 14 టెస్టులు ఆడాడు. 2007 టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. ఇండియన్ టీమ్‌కు ఆరేళ్ల పాటు ఆడిన ఆర్‌పీసింగ్ తన పేస్ బౌలింగ్ ప్రదర్శనతో అనేక సార్లు అదరగొట్టాడు. అయితే ఆర్‌పీ సింగ్ తనయుడు హ్యారీ సింగ్ మాత్రం ఇండియన్ టీమ్ తరఫున కాకుండా ఇంగ్లండ్ టీమ్ నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.
ఇంగ్లండ్ తరఫున ఫీల్డింగ్...
మంచెస్టర్ వేదికగా శ్రీలంక, ఇంగ్లండ్ మధ్య టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఈ మొదటి టెస్ట్‌లో ఐదు వికెట్ల తేడాతో శ్రీలంకను ఇంగ్లండ్ ఓడించింది. కాగా ఈ టెస్ట్ మ్యాచ్‌లో మొదటిరోజు హ్యారీ బ్రూక్ స్థానంలో హ్యారీ సింగ్ సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా మైదానంలోకి దిగాడు. కొద్ది సేపు ఫీల్డింగ్ చేశాడు. అతడి ఫొటోలు, వీడియోలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్నాయి.
లంక్‌షైర్ టీమ్...
యంగ్ క్రికెటర్లతో పోటీ కారణంగా టీమిండియాలో చోటు కోల్పోయిన ఆర్‌పీ సింగ్ ఆ తర్వాత కౌంటీ క్రికెట్‌కు ప్రాధాన్యతమిచ్చాడు. యూకేలో సెటిలయ్యాడు. హ్యారీ సింగ్ అక్కడే జన్మించాడు. తండ్రి బాటలోనే క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నహ్యారీసింగ్ నాలుగేళ్ల వయసు నుంచే లంక్‌షైర్ క్రికెట్ క్లబ్‌లో శిక్షణ తీసుకున్నాడు. లంక్‌షైర్ టీమ్ తరఫున పలు వన్డే, టీ20 మ్యాచ్‌లు ఆడాడు. కౌంటీల్లో బ్యాటర్, బౌలర్‌గా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. త్వరలోనే ఆఫీషియల్‌గా హ్యారీ సింగ్‌కు ఇంగ్లండ్ జట్టులో స్థానం దక్కడం ఖాయమని మాజీ క్రికెటర్లు చెబుతోన్నారు.
ఐపీఎల్‌లో...
2005లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ ద్వారా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు ఆర్‌పీసింగ్. ఆరేళ్ల కెరీర్‌లో 58 వన్డేలు ఆడిన ఆర్‌పీ సింగ్ 69 వికెట్లు తీసుకున్నాడు. 14 టెస్టుల్లో నలభై వికెట్లు తీశాడు. పది టీ20ల్లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన ఆర్‌పీ సింగ్ 15 వికెట్లు దక్కించుకున్నాడు. ఐపీఎల్‌లో దక్కన్ ఛార్జర్స్, ముంబై ఇండియన్స్, కొచ్చి టస్కర్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌ల తరఫున ఆడాడు. శనివారం ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన శిఖర్ ధావన్‌తో కలిసి ఆండర్ 19 వరల్డ్ కప్‌లో ఆర్‌పీ సింగ్ ఆడటం గమనార్హం.
టాపిక్