Rishabh Pant: సమంతకు ప్రత్యర్థిగా టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ - ఫ్రాంచైజ్ ఓనర్‌గా కొత్త అవతారం
Rishabh Pant: వరల్డ్ పికెల్ బాల్ లీగ్‌లోకి టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ ఎంట్రీ ఇస్తోన్నారు. ముంబై జట్టుకు ఓనర్‌గా వ్యవహరించబోతున్నాడు. ఈ లీగ్‌లో చెన్నై జట్టును హీరోయిన్ సమంత కొనుగోలు చేసింది. ఈ పికెల్ బాల్ లీగ్ జనవరి 24 నుంచి మొదలుకాబోతుంది.
Rishabh Pant: టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ కొత్త లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. వరల్డ్ పికెల్ బాల్ టోర్నీలో భాగం కాబోతున్నాడు. ముంబై జట్టుకు ఓనర్‌గా మారనున్నాడు. వరల్డ్ పికెల్ బాల్ లీగ్ జనవరి 24 నుంచి మొదలుకానుంది. ఇందులో మొత్తం ఆరు టీమ్‌లో పాల్గొనబోతున్నాయి.
ఢిల్లీ దిల్‌వాలే, పూణే యునైటెడ్, ముంబై పికిల్ పవర్, బెంగళూరు జవాన్స్, చెన్నై సూపర్ ఛాంప్ప్‌తో పాటు హైదరాబాద్ సూపర్ స్టార్స్ జట్లు ఈ లీగ్‌లో తలపడనున్నాయి. మొత్తం ఆరు రోజుల పాటు ఈ లీగ్ జరుగనుంది. ఇందులో 14 దేశాలకు చెందిన 48 మంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా పాల్గొనబోతున్నారు.
ముంబై టీమ్‌కు...
వరల్డ్ పికెల్ బాల్ లీగ్‌లో ముంబై జట్టుకు రిషబ్ పంత్ ఓనర్‌గా మారనున్నాడు. స్విగ్గీ సీఈవో రోహిత్ కపూర్‌తో కలిసి ముంబై పికిల్ బాల్ టీమ్‌ను రిషబ్ పంత్ కొనుగోలు చేయబోతున్నాడు.
ఈ విషయాన్ని రిషబ్ పంత్ స్వయంగా ప్రకటించాడు. వ్యక్తిగతంగా తనకు క్రీడలంటే చాలా ఇష్టమని, పికిల్ బాల్ గేమ్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాలనే ఆలోచనతోనే ముంబై జట్టులో పెట్టుబడి పెట్టబోతున్నట్లు రిషబ్ పంత్ ప్రకటించాడు. రిషబ్ పంత్ క్రేజ్ పికెల్ బాల్ గేమ్‌కు ఆదరణ పెరగడానికి దోహపడుతుందని రోహిత్ కపూర్ అన్నాడు.
సమంత కూడా...
వరల్డ్ పికెల్ బాల్ లీగ్‌లో చెన్నై సూపర్ ఛాంప్స్ జట్టుకు హీరోయిన్ సమంత యజమానిగా వ్యవహరిస్తోంది. ఇటీవలే చెన్నై టీమ్‌ను సమంత కొనుగోలు చేసింది. ఈ లీగ్‌లో జనవరి\ 28న ముంబై, చెన్నై మధ్య మ్యాచ్ జరుగనుంది. సమంత టీమ్‌తో రిషబ్ పంత్ జట్టు తలపడనుంది. సమంతకు ప్రత్యర్థిగా రిషబ్ పంత్ బరిలోకి దిగడం ఆసక్తికరంగా మారింది.
రంజీలో ఒక్క పరుగు...
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బ్యాట్‌తో రాణించిన రిషబ్ పంత్ ప్రస్తుతం దేశవాళీ క్రికెట్ ఆడుతోన్నాడు. రంజీ ట్రోఫీలో ఢిల్లీ తరఫున బరిలో దిగాడు. సౌరాష్ట్రతో గురువారం ఆరంభమైన మ్యాచ్‌లో రిషబ్ పంత్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి నిరాశపరిచాడు. జడేజా బౌలింగ్‌లో ఔటయ్యాడు.
టాపిక్