Mayank Agarwal: ఇంకా హాస్పిటల్‌లోనే మయాంక్ అగర్వాల్ - ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన క్రికెటర్!
Mayank Agarwal: విమానంలో హానికారక ద్రావణాన్ని తాగి తీవ్ర అస్వస్థతకు గురైన టీమిండియా క్రికెటర్ మయాంక్ అగర్వాల్ ప్రస్తుతం కోలుకుంటున్నట్లు తెలిసింది. ఈఘటనపై మేనేజర్ ద్వారా మయాంక్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
Mayank Agarwal: మయాంక్ అగర్వాల్ ఘటన క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. రంజీ ట్రోఫీ మ్యాచ్ కోసం రాజ్‌కోట్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీ బయలుదేరిన మయాంక్ అగర్వాల్ విమానంలో మంచి నీళ్లు అనుకొని హానికర ద్రావణాన్ని తాగడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దాంతో విమాన సిబ్భందితో పాటు కర్ణాటక క్రికెట్ వర్గాలు అతడిని హుటాహుటినా హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం మయాంక్ అగర్వాల్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
పౌచ్‌లో ఉన్న ద్రావణం...
ఢిల్లీ బయలుదేరడానికి విమానం ఎక్కిన మయాంక్ అగర్వాల్...తన సీట్ ముందు ఉన్న పౌచ్‌లోని హానికారక ద్రావణాన్ని మంచి నీళ్లు అనుకొని పొరపడి తాగాడు. వెంటనే అతడి గొంతు వాచిపోయింది. నోటిలో బొబ్బలు వచ్చాయి. మయాంక్ అస్వస్థత గురికావడంతో విమానాన్ని నిలిపివేసి మయాంక్‌ను ఆసుపత్రికి తరలించారు. ఎమర్జెన్సీ కేసుగా మయాంక్‌ను ఆసుపత్రి వర్గాలు అడ్మిట్ చేసుకున్నట్లు తెలిసింది.
మయాంక్ పెద్ద ప్రమాదం నుంచి బయటపడినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం ఐసీయూలోనే ఉంచి అతడికి ట్రీట్‌మెంట్ అందిస్తున్నామని, అతడు కోలుకుంటున్నట్లు తెలిపారు. గొంతులో కాస్తంత ఇబ్బంది ఉందని, అలాగే పెదవుల వాపు కూడా తగ్గలేదని తెలిసింది. బెటర్ ట్రీట్‌మెంట్ కోసం మయాంక్ బుధవారం రాత్రి లేదా గురువారం ఉదయం బెంగళూరు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోన్నట్లు తెలిసింది.
పోలీసులకు ఫిర్యాదు...
ఈ ఘటనపై తన మేనేజర్ ద్వారా మయాంక్ అగర్వాల్ పోలీసులకు ఫిర్యాదుచేసినట్లు తెలిసింది. హానికారక ద్రావణాన్ని మయాంక్‌కు దగ్గరగా ఎవరు ఉంచారు? అసలు ఏం జరిగింది అనే కోణంలో పోలీసులు విచారణ సాగిస్తోన్నట్లు తెలిసింది. పెదవుల వాపు కారణంగా మయాంక్ అగర్వాల్ మాట్లాడలేకపోతున్నాడని, మరో రెండు రోజుల తర్వాతే అతడు పెదవి విప్పే అవకాశం ఉందని తెలిసింది. మయాంక్ మాట్లాడితేనే ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.మరో రెండు మూడు రోజుల్లో ఈ ఘటనపై పూర్థిస్థాయిలో నిజానిజాలేమిటో వెలికితీయబోతున్నట్లు సమాచారం.
నిఖిన్ జోస్...
ప్రస్తుతం కర్ణాటక రంజీ టీమ్‌కు మయాంక్ అగర్వాల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అనారోగ్యం కారణంగా రైల్వేస్‌తో జరుగనున్న నెక్స్ట్ మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉండటం లేదని కర్ణాటక క్రికెట్ అసోషియేషన్ ప్రకటించింది. మయాంక్ స్థానంలో నిఖిన్ జోస్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. మయాంక్ అగర్వాల్ టీమిండియా తరఫున 21 టెస్ట్‌లు, ఐదు వన్డేలు ఆడాడు.
టెస్టుల్లో ఒక డబుల్ సెంచరీతో 1488 రన్స్ చేశాడు. చివరగా 2022 మార్చి శ్రీలంకతో చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు మయాంక్ అగర్వాల్. ఆస్ట్రేలియాపై చివరి వన్డే మ్యాచ్ ఆడాడు. అతడు టీమిండియా తరఫున ఆడి రెండేళ్లు దాటిపోయింది. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ టీమ్‌కు మయాంక్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
టాపిక్