Rohit Sharma home: ముంబైలోని తన ఇంటిని అద్దెకు ఇచ్చిన రోహిత్ శర్మ.. నెలకు రెంట్ ఎంత వస్తుందో తెలుసా?-team india captain rohit sharma rented out his home in mumbai ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rohit Sharma Home: ముంబైలోని తన ఇంటిని అద్దెకు ఇచ్చిన రోహిత్ శర్మ.. నెలకు రెంట్ ఎంత వస్తుందో తెలుసా?

Rohit Sharma home: ముంబైలోని తన ఇంటిని అద్దెకు ఇచ్చిన రోహిత్ శర్మ.. నెలకు రెంట్ ఎంత వస్తుందో తెలుసా?

Hari Prasad S HT Telugu

Rohit Sharma home: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముంబైలో ఉన్న తన ఇంటిని అద్దెకు ఇచ్చాడు. దీని ద్వారా అతడు నెలకు లక్షల్లో సంపాదిస్తుండటం విశేషం. ప్రస్తుతం రోహిత్ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం దుబాయ్ లో ఉన్న విషయం తెలిసిందే.

ముంబైలోని తన ఇంటిని అద్దెకు ఇచ్చిన రోహిత్ శర్మ.. నెలకు రెంట్ ఎంత వస్తుందో తెలుసా? (PTI)

Rohit Sharma home: ముంబైలో ఉన్న క్రికెట్, సినిమా సెలబ్రిటీలు తమ లగ్జరీ ఇళ్లు, అపార్ట్‌మెంట్లను అద్దెకు ఇవ్వడం సాధారణమే. తాజాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ముంబైలోని లోయర్ పరేల్ ఉన్న తన ప్రాపర్టీని అద్దెకు ఇచ్చాడు. ఈ విషయాన్ని స్క్వేర్ యార్డ్స్ వెల్లడించింది.

రోహిత్ శర్మ ఇల్లు అద్దెకు..

క్రికెట్, సినిమాల ద్వారా కోట్లు సంపాదించే సెలబ్రిటీలు.. తమ ఇళ్లను అద్దెకు ఇవ్వడం ద్వారా కూడా బాగానే వెనుకేసుకోవడం ఈమధ్య అలవాటైపోయింది. బాలీవుడ్ సెలబ్రిటీలు ఇలా ఒకటికి మించి ఉన్న తమ ప్రాపర్టీలను అద్దెకు ఇస్తుంటారు.

తాజాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా లోయర్ పరేల్ లో ఉన్న అపార్ట్‌మెంట్ ను రెంట్ కు ఇచ్చాడు. దీనివల్ల అతనికి నెలకు రూ.2.6 లక్షల రెంట్ వస్తుందని స్క్వేర్ యార్డ్స్ గురువారం (ఫిబ్రవరి 27) వెల్లడించింది. ఈ అపార్ట్‌మెంట్ రిజిస్ట్రేషన్ పత్రాలు రోహిత్ పేరిటే ఉన్నట్లు తెలిపింది.

12 ఏళ్ల కిందటే..

రోహిత్ శర్మకు చెందిన ఈ అపార్ట్‌మెంట్ లోధా మార్కైస్ లో ఉంది. ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ మొత్తం ఏరియాలో రోహిత్ శర్మ అపార్ట్‌మెంట్ 1298 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా, రెండు పార్కింగ్ స్పేస్ లతో వచ్చింది.

రోహిత్, అతని తండ్రి గురునాథ్ శర్మ కలిసి 2013లో ఈ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేయడం విశేషం. అప్పట్లో దీని ధర రూ.5.46 కోట్లు. ఇప్పుడు దానిని నెలకు రూ.2.6 లక్షల రెంట్ కు ఇచ్చారు. ఇదే బిల్డింగ్ లో రోహిత్, అతని తండ్రికి మరో అపార్ట్‌మెంట్ కూడా ఉంది. దానిని గతేడాది రూ.2.65 లక్షలకు అద్దెకు ఇచ్చారు.

ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ శర్మ

రోహిత్ శర్మ ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ కోసం దుబాయ్ లో ఉన్న విషయం తెలిసిందే. అతని కెప్టెన్సీలోని టీమిండియా లీగ్ స్టేజ్ లో ఇప్పటికే వరుసగా రెండు విజయాలతో సెమీస్ చేరింది. రోహిత్ బ్యాట్ తో ఇప్పటి వరకూ పెద్ద ఇన్నింగ్స్ మాత్రం ఆడలేదు. అయితే తొలి మ్యాచ్ లో శుభ్‌మన్ గిల్, రెండో మ్యాచ్ లో విరాట్ కోహ్లి సెంచరీలతో టీమ్ విజయాలు సాధించింది.

ఇండియన్ టీమ్ తమ తర్వాతి మ్యాచ్ ను న్యూజిలాండ్ తో మార్చి 2న ఆడుతుంది. ఈ మ్యాచ్ తో గ్రూప్ ఎలో టాప్ ప్లేస్ ఎవరిదన్నది తేలిపోతుంది. గ్రూప్ బిలో సెమీస్ బెర్తులు ఖరారయ్యాక టీమిండియా ప్రత్యర్థి ఎవరన్నది తెలుస్తుంది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

టాపిక్