"టీ20 వరల్డ్ కప్ 2024లో ఎన్నడూ లేని విధంగా 20 జట్లు పాల్గొంటున్న విషయం తెలిసిందే. వాటిలో టీమిండియా సహా డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, న్యూజిలాండ్, వెస్టిండీస్, యూఎస్ఏ, కెనడా, స్కాట్లాండ్, ఐర్లాండ్, నమీబియా, ఉగాండా, పపువా న్యూగినియా, నేపాల్, ఒమన్, నెదర్లాండ్స్ పాల్గొంటున్నాయి.
ఇప్పటికే అన్ని టీమ్స్ ఈ మెగా టోర్నీ కోసం తమ జట్లను ప్రకటించాయి. అందరి కంటే ముందే న్యూజిలాండ్ టీ20 వరల్డ్ కప్ కోసం తమ జట్టును అనౌన్స్ చేసింది. తర్వాత సౌతాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, ఇండియా.. ఇలా వరుసగా ఒక్కో టీమ్ అనౌన్స్ చేస్తూ వెళ్లాయి.
ఏప్రిల్ 30న టీమిండియా కూడా వరల్డ్ కప్ కోసం తమ జట్టును అనౌన్స్ చేసింది. మొత్తం 15 మందితో కూడిన జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉండగా.. హార్దిక్ పాండ్యాను వైస్ కెప్టెన్ చేశారు. మరో సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా జట్టులో ఉన్నాడు. కేఎల్ రాహుల్, రింకు సింగ్ లాంటి వాళ్లకు జట్టులో స్థానం దక్కలేదు. రిషబ్ పంత్, సంజూ శాంసన్ వికెట్ కీపర్లుగా ఉన్నారు.
ఇక జడేజా, చాహల్, కుల్దీప్, అక్షర్ పటేల్ రూపంలో నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేశారు. బుమ్రా, సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా పేస్ బౌలింగ్ భారాన్ని మోయనున్నారు. రోహిత్, విరాట్, యశస్వి, సూర్యకుమార్, శివమ్ దూబె బ్యాటర్లుగా ఉంటారు.
టీ20 వరల్డ్ కోసం టీమిండియా ఇదే: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శివం దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్
రిజర్వ్ ప్లేయర్లు: శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్
ఆస్ట్రేలియా టీ20 వరల్డ్ కప్ జట్టు
మిచెల్ మార్ష్ (కెప్టెన్), ఆష్టన్ అగార్, ప్యాట్ కమిన్స్, టిమ డేవిడ్, నేథన్ ఎలిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టాయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా
యూఎస్ఏ టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్..
మోనిక్ పటేల్ (కెప్టెన్, వికెట్ కీపర్), ఆరోన్ జోన్స్ (వైస్ కెప్టెన్), ఆండ్రిస్ గౌస్, కోరి ఆండర్సన్, అలీ ఖాన్, హర్మీత్ సింగ్, జెస్సి సింగ్, మిలింద్ కుమార్, నిసర్గ్ పటేల్, నితీశ్ కుమార్, నోషుతోష్ కెంజిగి, సౌరభ్ నేత్రవాల్కర్, షాడ్లీ వాన్, స్టీవెన్ టేలర్, షయన్ జహంగీర్.
సౌతాఫ్రికా టీమ్ ఇదే
ఏడెన్ మార్క్రమ్, ఓట్నీల్ బార్ట్‌మాన్, గెరాల్డ్ కొట్జియా, డికాక్, బోర్న్ ఫార్చుయిన్, రీజా హెండ్రిక్స్, మార్కో యాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, డేవిడ్ మిల్లర్, ఎన్రిచ్ నోక్యా, కగిసో రబాడా, రియాన్ రికెల్టన్, షంసి, ట్రిస్టన్ స్టబ్స్
ఇంగ్లండ్ టీమ్ ఇదే
జోస్ బట్లర్ (కెప్టెన్), మొయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్, బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కరన్, బెన్ డకెట్, టామ్ హార్ట్లీ, విల్ జాక్స్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, రీస్ టోప్లీ, మార్క్ వుడ్
టీ20 వరల్డ్ కప్ 2024కు న్యూజిలాండ్ టీమ్
కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, ట్రెంట్ బౌల్ట్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్మాన్, డెవోన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌథీ"