T20 World Cup 2024 Squad: టీ20 వరల్డ్ కప్‌కు ఈ పది మంది ప్లేయర్స్ పక్కా.. వికెట్ కీపర్లపై కొనసాగుతున్న సస్పెన్స్-t20 world cup 2024 squad bcci source says 10 players picked already including rohit sharma virat kohli hardik pandya ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  T20 World Cup 2024 Squad: టీ20 వరల్డ్ కప్‌కు ఈ పది మంది ప్లేయర్స్ పక్కా.. వికెట్ కీపర్లపై కొనసాగుతున్న సస్పెన్స్

T20 World Cup 2024 Squad: టీ20 వరల్డ్ కప్‌కు ఈ పది మంది ప్లేయర్స్ పక్కా.. వికెట్ కీపర్లపై కొనసాగుతున్న సస్పెన్స్

Hari Prasad S HT Telugu
Apr 18, 2024 02:10 PM IST

T20 World Cup 2024 Squad: టీ20 వరల్డ్ కప్ 2024 కోసం టీమిండియాకు ఆడబోయే 10 మంది ఇప్పటికే కన్ఫమ్ అయినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. మరో ఐదు స్థానాలు తేలాల్చి ఉంది.

టీ20 వరల్డ్ కప్‌కు ఈ పది మంది ప్లేయర్స్ పక్కా.. వికెట్ కీపర్లపై కొనసాగుతున్న సస్పెన్స్
టీ20 వరల్డ్ కప్‌కు ఈ పది మంది ప్లేయర్స్ పక్కా.. వికెట్ కీపర్లపై కొనసాగుతున్న సస్పెన్స్ (PTI)

T20 World Cup 2024 Squad: టీ20 వరల్డ్ కప్ కోసం ఇండియన్ టీమ్ లోని 15 స్థానాల్లో 10 ఇప్పటికే ఖాయమైనట్లు బీసీసీఐ వర్గాలు చెప్పాయని పీటీఐ రిపోర్టు వెల్లడించింది. రెండో వికెట్ కీపర్, ఓపెనింగ్ స్థానాల విషయంలోనే ఇంకా స్పష్టత రావాల్సి ఉందని ఆ రిపోర్టు చెప్పడం గమనార్హం.

ప్రస్తుత ఐపీఎల్ ఫామ్, వరల్డ్ కప్ జరగబోయే అమెరికా, కరీబియన్ దీవుల కండిషన్స్ తో సంబంధం లేకుండా 10 మంది ప్లేయర్స్ మాత్రం ఖాయమని స్పష్టమవుతోంది.

హార్దిక్ పాండ్యా కూడా వచ్చేసినట్లే..

ఇన్నాళ్లూ ఆల్ రౌండర్ల విషయంలో కాస్త గందరగోళం ఉండేది. ఈ మధ్యే హార్దిక్ విషయంలో కెప్టెన్ రోహిత్, కోచ్ ద్రవిడ్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చర్చించారనీ వార్తలు వచ్చాయి. ఐపీఎల్లో కాస్త ఎక్కువగా బౌలింగ్ చేయాలని వాళ్లు హార్దిక్ కు సూచించినట్లూ తెలుస్తోంది. దీంతో ఆ పది మందిలో హార్దిక్ పేరు కూడా కన్ఫమ్ అయింది. అతని ఎంపికకు వచ్చిన ఢోకా ఏమీ లేదని పీటీఐ రిపోర్ట్ తెలిపింది.

ఇక విరాట్ కోహ్లి ఎంపిక కూడా ఖాయమే. అంతేకాదు కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి అతడే ఓపెనింగ్ చేయనున్నాడనీ ఈ మధ్యే దైనిక్ జాగరన్ రిపోర్టు కూడా వెల్లడించిన విషయం తెలిసిందే. దీనివల్ల మిడిలార్డర్ లో ఓ పవర్ హిట్టర్ ను తీసుకునే అవకాశం కలుగుతుందన్నది టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచనగా కనిపస్తోంది. అంతేకాదు ఐపీఎల్లో కోహ్లి ఓపెనర్ గా వచ్చి రాణిస్తున్నాడు.

అంతర్జాతీయ టీ20ల్లోనూ ఇప్పటి వరకూ విరాట్ 9సార్లు ఓపెనర్ గా వచ్చి 57 సగటుతో 400 రన్స్ చేశాడు. ఇక స్ట్రైక్ రేట్ కూడా 161గా ఉండటం విశేషం. ఇక ఈ ఇద్దరూ కాకుండా ఈ ఫార్మాట్లో నంబర్ వన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, స్టార్ పేసర్ బుమ్రా, ఆల్ రౌండర్ జడేజా, వికెట్ కీపర్ రిషబ్ పంత్, పేస్ బౌలర్లు అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, స్పిన్నర్ కుల్దీప్ కూడా దాదాపు ఖాయమైనట్లే. అంతేకాదు వీళ్లలో 9 మంది తుది జట్టులోనూ ఉంటారు. అర్ష్‌దీప్, సిరాజ్ లలో ఒకరికి మాత్రమే అవకాశం దక్కుతుంది.

మిగతా 5 స్థానాల సంగతేంటి?

ఇక మిగిలిన 5 స్థానాల కోసం దాదాపు పది మంది ప్లేయర్స్ పోటీ పడుతున్నారు. మూడో ఓపెనర్ స్థానం కోసం శుభ్‌మన్ గిల్, యశస్వి మధ్య పోటీ నెలకొననుంది. ఇక రెండో వికెట్ కీపర్ స్థానం కోసం అయితే సంజూ శాంసన్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, జితేష్ శర్మలాంటి వాళ్లు పోటీ పడుతున్నారు. కాకపోతే వీళ్లలో మిడిలార్డర్ లో ఆడే అనుభవం జితేష్ శర్మకు మాత్రమే ఉంది.

రాహుల్, ఇషాన్ టీ20ల్లో ఎప్పుడూ మిడిలార్డర్ లో ఆడలేదు. సంజూ శాంసన్ ప్రస్తుతం మూడో స్థానంలో ఆడుతుండటంతో అతడు కూడా మంచి ఛాయిస్ అని చెప్పొచ్చు. గిల్, యశస్వి, రింకు సింగ్, శివమ్ దూబెలలో ముగ్గురికి మాత్రమే జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. ఒకవేళ కోహ్లి ఓపెనింగ్ చేస్తే రింకు, దూబె ఇద్దరూ జట్టులోకి రావచ్చు.

ఇక స్పిన్నర్ల విషయానికి వస్తే కుల్దీప్ కు తోడుగా చహల్, అక్షర్, రవి బిష్ణోయ్ లలో ఒకరు రావచ్చు. ప్రస్తుతం టాప్ ఫామ్ లో ఉన్న చహల్ కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.

Whats_app_banner