Cricket: క్రికెటర్లకు గాయం - బరిలో దిగిన కోచ్ - ధనాధన్ ఇన్నింగ్స్‌తో ఊచకోత - బిగ్‌బాష్ లీగ్‌లో వింత
Cricket: బిగ్‌బాష్ లీగ్‌లో అరుదైన సంఘటన చోటుచేసుకున్నది. బ్రిస్బేన్ లీగ్‌తో జరిగిన మ్యాచ్‌లో సిడ్నీ థండర్స్ ఆటగాళ్లు గాయపడటంతో కోచ్ డాన్ క్రిస్టియన్ బరిలో దిగాడు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో అదరగొట్టాడు. 92 మీటర్ల భారీ సిక్స్ కొట్టాడు.
Cricket: సాధారణంగా క్రికెట్‌లో ఓ ఆటగాడు గాయపడితే అతడి స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా లేదా రిప్లేస్‌మెంట్‌గా మరో క్రికెటర్ బరిలో దిగడం కామన్‌గా కనిపిస్తుంది. కానీ బిగ్‌బాష్ లీగ్‌లో మాత్రం గాయపడ్డ క్రికెటర్ స్థానంలో ఆ టీమ్ కోచ్ బ్యాటింగ్ చేశాడు.
అసిస్టెంట్ కోచ్...
బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్స్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా డాన్ క్రిస్టియన్ వ్యవహరిస్తోన్నాడు. ఈ లీగ్‌లో సోమవారం బ్రిస్బేన్ హీట్‌తో జరిగిన మ్యాచ్‌లో డాన్ క్రిస్టియన్ బరిలో దిగాడు. గత మ్యాచ్‌లో సిడ్నీ థండర్స్ ఆటగాళ్లు బాన్‌క్రాఫ్ట్, డానియెల్ సామ్స్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డారు. వారికి సబ్‌స్టిట్యూట్‌గా రావాల్సిన క్రికెటర్లు కూడా గాయలతో ఇబ్బంది పడటంతో బ్రిస్బేన్ హీట్‌తో జరిగిన మ్యాచ్‌లో తుది జట్టులో అసిస్టెంట్ కోచ్ డాన్ క్రిస్టియన్ పేరును చేర్చింది సిడ్నీ థండర్స్ టీమ్.
టాస్ గెలిచిన....
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన మొదట బ్యాటింగ్ ఎంచుకున్న సిడ్నీ థండర్స్ టీమ్ ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 173 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. 36 బాల్స్‌లో ఏడు ఫోర్లతో సరిగ్గా యాభై పరుగులు చేసిన వార్నర్ ఔటయ్యాడు. వార్నర్ తర్వాత సిడ్నీ థండర్స్ టీమ్‌లో సెకండ్ హయ్యెస్ట్ స్కోరర్‌గా డాన్ క్రిస్టియన్ నిలవడం గమనార్హం.
92 మీటర్ల సిక్స్...
పదిహేడో ఓవర్‌లో బ్యాటింగ్ దిగిన డాన్ క్రిస్టియన్ 15 బాల్స్‌లో రెండు సిక్సర్లతో 23 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. జేవియర్ బార్ట్‌లెట్ బౌలింగ్ 92 మీటర్ల దూరంతో క్రిస్టియన్ కొట్టిన సిక్స్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. 153 స్ట్రైక్ రేట్‌తో క్రిస్టియన్ బ్యాటింగ్ చేశాడు. బౌలింగ్‌లోనూ నాలుగు ఓవర్లు వేసిన క్రిస్టియన్ ఇరవై ఐదు పరుగులు ఇచ్చి ఓ వికెట్ తీశాడు.
అయినా తప్పని ఓటమి...
అయితే ఈ మ్యాచ్‌లో సిడ్నీ థండర్స్ ఐదు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. బ్రయాంగ్, రెన్‌షా విధ్వంసంతో 18.5 ఓవర్లలోనే బ్రిస్బేన్ హీట్ లక్ష్యాన్ని ఛేదించింది. బ్రయాంట్ 35 బాల్స్‌లో ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 72 పరుగులు చేశాడు. రెన్‌షా 33 బాల్స్‌లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో 48 రన్స్ సాధించాడు.
క్రికెట్‌కు గుడ్‌బై...
డాన్ క్రిస్టియన్ 2023లోనే క్రికెట్‌కు గుడ్‌బై ప్రకటించాడు. ఆస్ట్రేలియా తరఫున 43 మ్యాచ్‌లు ఆడాడు. 23 ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్‌లు ఆడిన క్రిస్టియన్ 118 పరుగులతో పాటు 13 వికెట్లు తీసుకున్నాడు.