india vs england: శ్రేయస్ లేదా జైస్వాల్.. వేటు ఎవరిపై? కోహ్లికి దారినిచ్చేదెవరు?
india vs england: ఇంగ్లండ్ తో రెండో వన్డేలో భారత తుది జట్టుపై సస్పెన్స్ కొనసాగుతోంది. కోహ్లి గాయం నుంచి కోలుకోవడంతో ఈ మ్యాచ్ కోసం శ్రేయస్ అయ్యర్ లేదా యశస్వీ జైస్వాల్ పై వేటు పడే అవకాశముంది.

వేటు ఎవరిపై?
సిరీస్ ను సొంతం చేసుకోవడమే లక్ష్యంగా ఇంగ్లండ్ తో రెండో వన్డేలో భారత్ బరిలో దిగబోతోంది. ఆదివారం (ఫిబ్రవరి 9) ఈ మ్యాచ్ జరుగుతుంది. అయితే మ్యాచ్ కు ముందు టీమ్ఇండియా ఎలెవన్ పై చర్చ కొనసాగుతోంది. మోకాలి వాపుతో తొలి వన్డేకు దూరమైన కోహ్లి ఫిట్ నెస్ సాధించాడు. అతణ్ని రెండో వన్డేలో ఆడించాలంటే శ్రేయస్ అయ్యర్ లేదా యశస్వి జైస్వాల్ పై వేటు తప్పకపోవచ్చు.
శ్రేయస్ అర్ధశతకంతో
ఇంగ్లండ్ తో తొలి వన్డేకు శ్రేయస్ రిజర్వ్ బెంచ్ కే పరిమితం కావాల్సింది. కానీ మోకాలి నొప్పితో కోహ్లి దూరం కావడంతో శ్రేయస్ కు ఆడే అవకాశమొచ్చింది. ఈ ఛాన్స్ ను పూర్తిగా సద్వినియోగం చేసుకున్న అతను మెరుపు అర్ధశతకం (36 బంతుల్లో 59 పరుగులు)తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
జైస్వాల్ అరంగేట్రం
మరోవైపు టెస్టులు, టీ20ల్లో సత్తాచాటిన యశస్వీ జైస్వాల్ ఇంగ్లండ్ తో తొలి వన్డేతో 50 ఓవర్ల ఫార్మాట్లోనూ అరంగేట్రం చేశాడు. కానీ ఆ మ్యాచ్ లో 22 బంతుల్లో 15 పరుగులే చేశాడు. అలా అని ఒక్క మ్యాచ్ తో జైస్వాల్ లాంటి మోస్ట్ టాలెంటెడ్ బ్యాటర్ ను పక్కనపెట్టడం కరెక్టు కాదు.
కోహ్లి రావాలంటే
ఇంగ్లండ్ తో రెండో వన్డేలో కోహ్లి ఆడాలంటే ఒకరు బయటకు వెళ్లాల్సిందే. గత మ్యాచ్ లో రోహిత్, జైస్వాల్ ఓపెనర్లుగా ఆడటంతో శుభ్ మన్ గిల్ మూడో స్థానంలో దిగాడు. శ్రేయస్ నాలుగులో ఆడాడు. కానీ కోహ్లి వస్తే మూడో స్థానంలో ఆడతాడు. అప్పుడు జైస్వాల్ ను తప్పిస్తే.. రోహిత్, గిల్ ఓపెనింగ్ చేస్తారు. తొలి వన్డేలో అర్ధశతకం చేసిన శ్రేయస్ ను కొనసాగించేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి.
సంబంధిత కథనం