Suryakumar Yadav: అర్ష్‌దీప్‌పై సూర్యకుమార్ యాదవ్ ఆగ్రహం.. వేలు చూపిస్తూ ఫైర్, వీడియో వైరల్-suryakumar yadav serious on arshdeep singh after 3rd t20 series and video goes viral ,cricket న్యూస్
తెలుగు న్యూస్  /  Cricket  /  Suryakumar Yadav Serious On Arshdeep Singh After 3rd T20 Series And Video Goes Viral

Suryakumar Yadav: అర్ష్‌దీప్‌పై సూర్యకుమార్ యాదవ్ ఆగ్రహం.. వేలు చూపిస్తూ ఫైర్, వీడియో వైరల్

Sanjiv Kumar HT Telugu
Dec 16, 2023 11:03 AM IST

Suryakumar Yadav Fire On Arshdeep Singh: టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌పై స్టాండింగ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కోపంతో ఊగిపోయాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అర్ష్‌దీప్‌పై ఫైర్ అయిన సూర్యకుమార్ యాదవ్.. వేలు చూపిస్తూ ఆగ్రహం
అర్ష్‌దీప్‌పై ఫైర్ అయిన సూర్యకుమార్ యాదవ్.. వేలు చూపిస్తూ ఆగ్రహం

Suryakumar Yadav Loses Cool: ఇటీవలే సౌతాఫ్రికాతో టీమిండియా టీ20 సిరీస్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన టీ20 సిరీస్ మూడో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్ 1-1 పాయింట్లతో డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌‌లో సూర్యకుమార్ యాదవ్ సుడిగాలి సెంచరీ చేసి అద్భుతమైన ప్రదర్శన చూపాడు.

ట్రెండింగ్ వార్తలు

వేలు చూపిస్తూ

ఇదిలా ఉంటే టీ20 మూడో మ్యాచ్ తర్వాత పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌పై టీమిండియా స్టాండింగ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆగ్రహంతో ఊగిపోయాడు. టీమిండియా ప్రయాణిస్తున్న బస్సులో అర్ష్‌దీప్‌ సింగ్ వైపు వేలు చూపిస్తూ సూర్యకుమార్ యాదవ్ ఏదేదో అన్నాడు. అయితే, సూర్యకుమార్ యాదవ కోపానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.

వీడియో వైరల్

ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు. అసలు ఏమైంది?.. సూర్య భాయ్ ఎందుకు అంత కోపంగా ఉన్నాడు?, సూర్య సరదాగా అలా రియాక్ట్ అయి ఉంటాడులే! అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

డిసెంబర్ 17 నుంచి

ఇక దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ను సమం చేసిన భారత్ క్రికెట్ టీమ్ ఇప్పుడు వన్డే సిరీస్‌కు రెడీ అవుతోంది. డిసెంబర్ 17న జోహన్నెస్‌బర్గ్ వేదికగా ఈ సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఈ టోర్నమెంట్‌కు టీమిండియా కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ బాధ్యతలు చేపట్టనున్నాడు. అలాగే సౌతాఫ్రికాకు మార్‌క్రమ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

WhatsApp channel