SRH vs LSG: పుట్టిన రోజున టాస్ ఓడిన ప్యాట్ కమిన్స్.. హైదరాబాద్ తుదిజట్టులో రెండు మార్పులు-sunrisers hyderabad captain pat cummins loss toss on his birthday against lucknow ipl 2024 srh v lsg ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Srh Vs Lsg: పుట్టిన రోజున టాస్ ఓడిన ప్యాట్ కమిన్స్.. హైదరాబాద్ తుదిజట్టులో రెండు మార్పులు

SRH vs LSG: పుట్టిన రోజున టాస్ ఓడిన ప్యాట్ కమిన్స్.. హైదరాబాద్ తుదిజట్టులో రెండు మార్పులు

Chatakonda Krishna Prakash HT Telugu
Published May 08, 2024 07:19 PM IST

SRH vs LSG IPL 2024: లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‍కు హైదరాబాద్ బరిలోకి దిగింది. తన పుట్టిన రోజున జరుగుతున్న ఈ మ్యాచ్‍లో టాస్ ఓడాడు హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్.

SRH vs LSG: పుట్టిన రోజు టాస్ ఓడిన ప్యాట్ కమిన్స్.. తుదిజట్టులో రెండు మార్పులు
SRH vs LSG: పుట్టిన రోజు టాస్ ఓడిన ప్యాట్ కమిన్స్.. తుదిజట్టులో రెండు మార్పులు (AFP)

SRH vs LSG IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్‍లో కీలకపోరుకు సన్‍రైజర్స్ హైదరాబాద్ బరిలోకి దిగింది. ఈ సీజన్‍ తొలుత రెచ్చిపోయి ఆడిన ఎస్ఆర్‌హెచ్ ఆ తర్వాత కాస్త తడబడింది. ఇప్పటి వరకు 11 మ్యాచ్‍ల్లో ఆరు గెలిచి, ఐదు ఓడింది. లక్నో కూడా ఇదే పరిస్థితిలో ఉంది. దీంతో ప్లేఆఫ్స్ చేరాలంటే కీలకమైన పోరులో నేడు (మే 8) లక్నో సూపర్ జెయింట్స్‌ను హోం గ్రౌండ్ ఉప్పల్‍ స్టేడియంలో సన్‍రైజర్స్ హైదరాబాద్ ఢీకొంటోంది. ఈ మ్యాచ్‍లో టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ముందుగా బ్యాటింగ్ ఎంపిక చేసుకున్నారు. తన పుట్టిన రోజున జరుగుతున్న ఈ మ్యాచ్‍లో హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ టాస్ ఓడాడు.

రెండు మార్పులు

గత మ్యాచ్‍లో భారీగా పరుగులు సమర్పించిన మార్కో జాన్సెన్‍ను తుది జట్టు నుంచి తప్పించింది సన్‍రైజర్స్ హైదరాబాద్. లక్నోతో ఈ మ్యాచ్‍కు అతడి స్థానంలో శ్రీలంక బౌలర్ వియాష్‍కాంత్ విజయకాంత్‍ను తీసుకున్నట్టు కెప్టెన్ కమిన్స్ చెప్పాడు. మయాంక్ అగర్వాల్ స్థానంలో సన్వీర్ సింగ్‍ను ఎస్ఆర్‌హెచ్ తీసుకుంది.

లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కూడా తుది జట్టులో రెండు మార్పులు చేసింది. గాయం కారణంగా మోహిసిన్ ఖాన్ ఈ మ్యాచ్‍కు దూరమయ్యాడని కెప్టెన్ కేఎల్ రాహుల్ చెప్పాడు. అతడి స్థానంలో స్పిన్నర్ కృష్ణప్ప గౌతమ్‍ను తుది జట్టులోకి లక్నో ఎంపిక చేసుకుంది. స్టార్ ప్లేయర్ క్వింటన్ డికాక్ మళ్లీ లక్నో టీమ్‍లోకి వచ్చేశాడు. దీంతో ఆస్టన్ టర్నర్‌ను పక్కన పెట్టింది ఆ టీమ్.

ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ ఈ సీజన్‍లో సన్‍రైజర్స్ హైదరాబాద్.. విధ్వంసాలే చేసింది. ఐపీఎల్‍లో అత్యధిక స్కోరు రికార్డులను రెండుసార్లు సాధించింది. దీంతో టాస్ గెలిచిన కేఎల్ రాహుల్.. ముందుగా బ్యాటింగే ఎంపిక చేసుకున్నాడు.

సన్‍రైజర్స్ హైదరాబాద్ తుదిజట్టు: ట్రావిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమాద్, షెహబాజ్ అహ్మద్, సన్వీర్ సింగ్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనాద్కత్, వియాష్‍కాంత్ విజయకాంత్, టి నటరాజన్

లక్నో సూపర్ జెయింట్స్ తుది జట్టు: కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోనీ, దీపక్ హూడా, కృనాల్ పాండ్యా, కృష్ణప్ప గౌతమ్, యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్, నవీనుల్ హక్

సన్‍రైజర్స్ హైదరాబాద్‍కు గత మ్యాచ్‍లో ముంబై ఇండియన్స్ చేతిలో పరాజయం ఎదురైంది. ఇప్పటి వరకు ఈ సీజన్‍లో 11 మ్యాచ్‍ల్లో ఆరు గెలిచింది హైదరాబాద్. మిగిలిన మూడు లీగ్ మ్యాచ్‍ల్లో మూడు గెలిస్తే.. ఎలాంటి సమీకరణాలు లేకుండా ప్లేఆఫ్స్ చేరుతుంది. ఒకవేళ ఒకటి ఓడితే నెట్‍రన్ రేట్‍పై ఆధారపడాల్సి రావొచ్చు. అందుకే లక్నోతో నేటి మ్యాచ్‍ హైదరాబాద్‍కు చాలా కీలకంగా ఉంది. మరోవైపు, లక్నో పరిస్థితీ ఇదే. 11 మ్యాచ్‍ల్లో ఆ జట్టు కూడా ఆరే గెలిచింది. అయితే, నెట్‍రన్ రేట్ తక్కువగా ఉంది. దీంతో ఉప్పల్‍లో నేటి మ్యాచ్‍ ఇరు జట్లకు చాలా ముఖ్యంగా ఉంది.

Whats_app_banner