వణికించిన కమిన్స్.. పోరాడిన స్టబ్స్, అశుతోష్.. ఢిల్లీ తక్కువ స్కోరు.. స‌న్‌రైజర్స్‌కు ఈజీ టార్గెట్-sunrisers hyderabad captain pat cummins feiry bowling stuns delhi capitals stubbs ashutosh fighting ipl 2025 srh vs dc ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  వణికించిన కమిన్స్.. పోరాడిన స్టబ్స్, అశుతోష్.. ఢిల్లీ తక్కువ స్కోరు.. స‌న్‌రైజర్స్‌కు ఈజీ టార్గెట్

వణికించిన కమిన్స్.. పోరాడిన స్టబ్స్, అశుతోష్.. ఢిల్లీ తక్కువ స్కోరు.. స‌న్‌రైజర్స్‌కు ఈజీ టార్గెట్

పవర్ హిట్టర్లతో బ్యాటింగ్ లో పటిష్టంగా కనిపించే స‌న్‌రైజర్స్‌ హైదరాబాద్ ఈ సారి బంతితో మ్యాజిక్ చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ ను కూల్చేసింది. స‌న్‌రైజర్స్‌ కెప్టెన్ కమిన్స్ అద్భుతమైన బౌలింగ్ తో అదరగొట్టాడు.

చెలరేగిన కమిన్స్ (AFP)

ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ ఆశలు నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్ లో స‌న్‌రైజర్స్‌ హైదరాబాద్ సత్తాచాటింది. ఫస్ట్ బౌలింగ్ లో అదుర్స్ అనిపించింది. ముఖ్యంగా ఆ టీమ్ కెప్టెన్ కమిన్స్.. ఢిల్లీ క్యాపిటల్స్ ను హడలెత్తించాడు. సోమవారం (మే 5) ఉప్పల్ స్టేడియంలో చిరు జల్లులు పడుతుండగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన డీసీ 133/7 స్కోరుకే పరిమితమైంది.

కమిన్స్ మూడు వికెట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ టాప్ ఆర్డర్ ను కుప్పకూల్చాడు. 4 ఓవర్లు వేసిన కమిన్స్ 19 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. డీసీని అశుతోష్ శర్మ (26 బంతుల్లో 41; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), స్టబ్స్ (36 బంతుల్లో 41 నాటౌట్; 4 ఫోర్లు) ఆదుకున్నారు.

కిరాక్ కమిన్స్

ఢిల్లీ క్యాపిటల్స్ తో ఐపీఎల్ 2025 మ్యాచ్ లో టాస్ గెలిచిన కమిన్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఫస్ట్ బ్యాటింగ్ చేసి స‌న్‌రైజర్స్‌ పరుగుల మోత మోగిస్తుందేమో అనుకున్న ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు. కానీ బంతితో స‌న్‌రైజర్స్‌ అంతకంటే ఎక్కువగా రెచ్చిపోయింది. ముఖ్యంగా కెప్టెన్ కమిన్స్.. పవర్ ప్లేలో ఢిల్లీ క్యాపిటల్స్ ను వణికించాడు.

ఫస్ట్ బాల్ వికెట్

ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్ కే కమిన్స్ వికెట్ సాధించాడు. కరుణ్ నాయర్ (0)ను వికెట్ కీపర్ క్యాచ్ తో కమిన్స్ ఔట్ చేయడంతో ఉప్పల్ స్టేడియం హోరెత్తింది. తన తర్వాతి ఓవర్లో డుప్లెసిస్ (3) ను ఇలాగే ఔట్ చేశాడు కమిన్స్. ఆ తర్వాత అభిషేక్ పోరెల్ (8)ను పెవిలియన్ చేర్చాడు. ఆ వికెట్ కూడా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ అందుకున్నాడు.

కేఎల్ కూడా

వచ్చిన బౌలర్ వచ్చినట్లు వికెట్ల వేట కొనసాగించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ కోలుకోలేకపోయింది. డీసీ కెప్టెన్ అక్షర్ పటేల్ (6)ను హర్షల్ పటేల్, కీ ప్లేయర్ కేఎల్ రాహుల్ (10)ను జైదేవ్ ఉనద్కత్ ఔట్ చేయడంతో 29 రన్స్ కే డీసీ 5 వికెట్లు కోల్పోయింది.

ఆ రనౌట్

ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్ (18) కలిసి కాసేపు ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. కానీ విప్రజ్ నిగమ్ బిజారే రనౌట్ డీసీని మరింత ముంచింది. స్టబ్స్ రెండో పరుగు కోసం ట్రై చేయగా.. విప్రజ్ నో చెప్పాడు. కానీ పట్టించుకోని స్టబ్స్ పరుగెత్తి అవతలి క్రీజు దాటాడు. కానీ అక్కడే ఉండిపోయిన విప్రజ్ వికెట్ త్యాగం చేయక తప్పలేదు. ఇద్దరు బ్యాటర్లు ఒకే ఎండ్ లో ఉండిపోయారు.

స్టబ్స్, అశుతోష్ పోరాటం

ఢిల్లీ క్యాపిటల్స్ ను 100లోపే ఆలౌట్ చేసే గోల్డెన్ ఛాన్స్ ను స‌న్‌రైజర్స్‌ మిస్ చేసుకుంది. స్టబ్స్, ఇంపాక్ట్ ప్లేయర్ అశుతోష్ శర్మ కలిసి పోరాడారు. ముఖ్యంగా అశుతోష్ మరోసారి భారీ షాట్లతో ఢిల్లీని ఆదుకున్నాడు. చివరకు ఆ టీమ్ స్కోరు 130 దాటింది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం