Sunrisers Hyderabad team anthem: సన్ రైజర్స్ మేము బ్రో.. పక్కా ఇంకో రేంజ్ బ్రో.. కొత్త ఆంథెమ్ చూశారా?-sunriers hyderabad new anthem for ipl 2024 sunrisers with new captain new jersey new anthem for new ipl season ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Sunrisers Hyderabad Team Anthem: సన్ రైజర్స్ మేము బ్రో.. పక్కా ఇంకో రేంజ్ బ్రో.. కొత్త ఆంథెమ్ చూశారా?

Sunrisers Hyderabad team anthem: సన్ రైజర్స్ మేము బ్రో.. పక్కా ఇంకో రేంజ్ బ్రో.. కొత్త ఆంథెమ్ చూశారా?

Hari Prasad S HT Telugu
Published Mar 21, 2024 02:03 PM IST

Sunrisers Hyderabad team anthem: ఐపీఎల్ 2024 కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కొత్త ఆంథెమ్ రిలీజ్ చేసింది. సన్ రైజర్స్ మేము బ్రో.. పక్కా ఇంకో రేంజ్ బ్రో అంటూ ఈ పాట సాగింది.

సన్ రైజర్స్ మేము బ్రో.. పక్కా ఇంకో రేంజ్ బ్రో.. కొత్త ఆంథెమ్ చూశారా?
సన్ రైజర్స్ మేము బ్రో.. పక్కా ఇంకో రేంజ్ బ్రో.. కొత్త ఆంథెమ్ చూశారా?

Sunrisers Hyderabad team anthem: తెలుగు అభిమానులను ఆకట్టుకునేలా సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ ఐపీఎల్ 2024కు ముందు సరికొత్త ఆంథెమ్ సాంగ్ రిలీజ్ చేసింది. మాస్ బీట్ తో సన్ రైజర్స్ మేము బ్రో.. పక్కా ఇంకో రేంజ్ బ్రో అంటూ ఈ పాట సాగింది. ఈ కొత్త ఆంథెమ్ లో టీమ్ లోని కీలకమైన ప్లేయర్స్ అందరూ కనిపించారు.

సన్ రైజర్స్ కొత్త ఆంథెమ్..

సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఐపీఎల్ 2024 కోసం సిద్ధమైంది. కొత్త కెప్టెన్, కొత్త జెర్సీతోపాటు ఈ కొత్త సీజన్ కు కొత్త ఆంథెమ్ తో సరికొత్త ఉత్సాహంతో ఈ ఫ్రాంఛైజీ ప్లేయర్స్ రెడీ అయ్యారు. బుధవారం (మార్చి 20) సాయంత్రం ఈ ఆంథెమ్ రిలీజ్ చేశారు. సన్ రైజర్స్ మేము బ్రో.. పక్కా ఇంకో రేంజ్ బ్రో అంటూ సాగే ఈ పాట మాస్ బీట్స్ తో అభిమానులను ఆకట్టుకునేలా ఉంది.

క్రికెట్ కు తన తెలుగు వారి టచ్ ఇచ్చినట్లుగా ఈ కొత్త ఆంథెమ్ ఉంది. తమ సోషల్ మీడియా ద్వారా సన్ రైజర్స్ ఫ్రాంఛైజీ ఈ సాంగ్ ను షేర్ చేసింది. ఈ పాటలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తోపాటు భువనేశ్వర్ కుమార్, మయాంక్ అగర్వాల్, హెన్రిచ్ క్లాసెన్, ఏడెన్ మార్‌క్రమ్ లాంటి కీలకమైన ప్లేయర్స్ అందరూ కనిపించారు. ఉప్పల్ స్టేడియంతోపాటు హైదరాబాద్ లోని కొన్ని ముఖ్యమైన లొకేషన్లలో ఈ సాంగ్ షూట్ చేసినట్లు కనిపిస్తోంది.

కొత్త ఆశలతో సన్ రైజర్స్

సన్ రైజర్స్ హైదరాబాద్ గత ఐపీఎల్ సీజన్లో దారుణమైన ప్రదర్శన చేసింది. 14 మ్యాచ్ లలో కేవలం 4 గెలిచి పాయింట్ల టేబుల్లో అట్టడుగున నిలిచింది. దీంతో ఈ సీజన్ కోసం ఫ్రాంఛైజీ గట్టి కసరత్తే చేసింది. వేలంలోనే కమిన్స్, హెడ్, మయాంక్ అగర్వాల్ లాంటి ప్లేయర్స్ ను కొనుగోలు చేసి జట్టును బలోపేతం చేయడంపై దృష్టి సారించింది.

ఇక కొత్త సీజన్ కు ముందు కొత్త జెర్సీ లాంచ్ చేసింది. తాజాగా కొత్త ఆంథెమ్ తీసుకొచ్చింది. దీంతో సన్ రైజర్స్ ప్లేయర్స్ తోపాటు అభిమానులు కూడా కొత్త సీజన్ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. గతేడాది ఆస్ట్రేలియాను ఆరోసారి విశ్వవిజేతగా చేసిన ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీలో ఈసారి సన్ రైజర్స్ కూడా అద్భుతాలు చేస్తుందన్న ఆశతో ఉన్నారు.

ఐపీఎల్ 2024లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్ ను కోల్‌కతా నైట్ రైడర్స్ తో ఈడెన్ గార్డెన్స్ లో శనివారం (మార్చి 23) రాత్రి 7.30 గంటలకు తలపడనుంది. ఆ తర్వాత మార్చి 27న ఉప్పల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో కీలకమైన మ్యాచ్ ఉంది. ఈ సీజన్లో సొంతగడ్డపై సన్ రైజర్స్ ఆడబోయే తొలి మ్యాచ్ ఇదే.

ఆ తర్వాత మార్చి 31న గుజరాత్ టైటన్స్ తో అహ్మదాబాద్ లో మ్యాచ్ ఉంటుంది. ఇక తొలి విడత షెడ్యూల్లో సన్ రైజర్స్ తన చివరి మ్యాచ్ ను ఏప్రిల్ 5న ఉప్పల్లోనే చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడుతుంది. ఐపీఎల్ పూర్తి స్థాయి షెడ్యూల్ ఇంకా రిలీజ్ కాలేదు. త్వరలోనే బీసీసీఐ దీనిపై నిర్ణయం తీసుకోనుంది.

Whats_app_banner