Sunil Narine Red Card: క్రికెట్‌లో రెడ్ కార్డ్ - ఈ రూల్ కు బలైన ఫస్ట్ క్రికెటర్ సునీల్ నరైన్
Sunil Narine Red Card: కరేబియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా క్రికెట్‌లోను రెడ్ కార్డ్ నిబంధనను అమలులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెడ్ కార్డ్ రూల్ కారణంగా పనిష్‌మెంట్‌కు గురైన ఫస్ట్ క్రికెటర్‌గా సునీల్ నరైన్ నిలిచాడు.

Sunil Narine Red Card: రెడ్‌కార్డ్ రూల్ అన్నది ఎక్కువగా ఫుట్‌బాల్‌లోనే కనిపిస్తుంది. ఆట కొనసాగుతోండగా నిబంధనలను ఉల్లంఘించిన ప్లేయర్స్‌ను రెడ్‌కార్డ్ చూపించి అంపైర్స్ బయటకు పంపిస్తుంటారు. ఈ రెడ్‌కార్డ్ రూల్‌ను కరేబియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా క్రికెట్‌లోనూ ప్రవేశపెట్టారు.
ఈ రెడ్ కార్డ్ రూల్ కారణంగా ఫస్ట్ పనిష్‌మెంట్‌కు గురైన క్రికెటర్‌గా సునీల్ నరైన్ నిలిచాడు. ట్రింబాగో నైట్ రైడర్స్ సెయింట్ కిట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అంపైర్ రెడ్ కార్డ్ రూల్‌ను అమలు చేశాడు.
స్లో ఓవర్ రేట్ కారణంగా నైట్ రైడర్స్ ప్లేయర్ సునీల్ నరైన్ మైదానాన్నీ వీడాడు. సీపీఎల్‌లో ఒక్కో ఇన్నింగ్స్ 85 నిమిషాల్లోగా పూర్తిచేయాలని నిబంధన విధించారు. ఒక్కో ఓవర్ ను నాలుగు నిమిషాల 15 సెకన్ల చొప్పున 19 ఓవర్లను 80 నిమిషాల 45 సెకన్లలోనే పూర్తిచేయాలి.
ఆ సమయంలోగా పూర్తిచేయకపోతే టీమ్‌కు రెడ్ కార్డ్ ను పెనల్టీగా ఇస్తారు. స్లో ఓవర్ రేట్ కారణంగా నైట్ రైడర్స్‌కు అంపైర్ రెడ్ కార్డ్ చూపించాడు. ఈ పెనాల్టీ కారణంగా నైట్ రైడర్స్ కెప్టెన్ పొల్లార్డ్ సూచన మేరకు సునీల్ నరైన్ మైదానాన్ని వీడాడు. 19 ఓవర్‌లో కేవలం పదిమంది ఆటగాళ్లతోనే నైట్ రైడర్స్ ఫీల్డింగ్ చేసింది.
నైడ్ రైడర్స్‌కు అంపైర్ రెడ్‌కార్డ్ పెనీల్టీ ఇచ్చిన వీడియో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ కిట్స్ ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 178 పరుగులు చేసింది. రూథర్‌ఫోర్డ్ 62 పరుగులతో రాణించాడు. 17 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి నైట్ రైడర్స్ టార్గెట్‌ను ఛేదించింది. నికోలస్ పూరన్ 61 రన్స్, పొల్లార్డ్ 37 రన్స్‌తో రాణించారు.
టాపిక్