Nitish Kumar Reddy Fitness: సన్ రైజర్స్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. దమ్మున్న తెలుగోడు వస్తున్నాడు.. ఫిట్ నెస్ టెస్ట్ పాస్
Nitish Kumar Reddy Fitness: భారీ స్కోర్లతో రికార్డులు తిరగరాసే సన్ రైజర్స్ హైదరాబాద్ కు గుడ్ న్యూస్. ఆ టీమ్ స్టార్ ఆల్ రౌండర్ ఫిట్ నెస్ టెస్టు పాసయ్యాడు. ఈ దమ్మున్న తెలుగు కుర్రాడు ఐపీఎల్ 2025 లో దుమ్ము దులిపేందుకు వస్తున్నాడు.
సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. బ్యాటింగ్, బౌలింగ్ తో అదరగొట్టే ఆ జట్టు యంగ్ ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఫిట్ నెస్ టెస్ట్ పాసయ్యాడు. ఐపీఎల్ 2025లో ఆడేందుకు రెడీ అవుతున్నాడు. ఇంజూరీ నుంచి బయటపడ్డాడు నితీశ్ కుమార్. తెలుగు ఫ్యాన్స్ ను మరోసారి అలరించేందుకు సిద్ధమవుతున్నాడు.
టెస్ట్ పాస్
పక్కటెముకల గాయంతో ఈ ఏడాది ఇంగ్లండ్ తో టీ20 సిరీస్ నుంచి నితీశ్ కుమార్ రెడ్డి తప్పుకొన్నాడు. ప్రాక్టీస్ లో నితీశ్ ఇంజూరీకి గురయ్యాడు. ఆ సిరీస్ తోపాటు వన్డే మ్యాచ్ లకూ దూరమయ్యాడు. ఆ తర్వాత బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ లో కోలుకున్నాడు. తాజాగా అక్కడ జరిగిన ఫిట్ నెస్ టెస్టులో నితీశ్ పాస్ అయ్యాడని సమాచారం. యోయో టెస్టులోనూ పాస్ అయ్యాడని తెలిసింది. దీంతో ఐపీఎల్ 2025 ఆడేందుకు నితీశ్ కు క్లియరెన్స్ వచ్చినట్లే.
ధనాధన్ బ్యాటింగ్
ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ రికార్డుల వేటలో నితీశ్ కుమార్ రెడ్డి కీ రోల్ ప్లే చేశాడు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ధనాధన్ ఆరంభానికి.. క్లాసెన్ తో కలిసి నితీశ్ మెరుపు ముగింపులనిచ్చాడు. దీంతో సన్ రైజర్స్ అలవోకగా భారీ స్కోర్లు నమోదు చేసింది. రికార్డుల దుమ్ము దులిపింది. సిక్సర్ల వేటను ఘనంగా కొనసాగించింది. ముఖ్యంగా నితీశ్ చాలా ఈజీగా కొట్టే సిక్సర్లు ఫ్యాన్స్ ను ఎంతో అలరించాయి.
సూపర్ ఫామ్
గతేడాది ఐపీఎల్ లో విశాఖ పట్నం కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి సూపర్ ఫామ్ ప్రదర్శించాడు. 21 ఏళ్ల నితీశ్ 2024 ఐపీఎల్ లో 11 ఇన్నింగ్స్ ల్లో 303 పరుగులు చేశాడు. అతని హై స్కోరు 76 నాటౌట్. పేస్ బౌలింగ్ తో అతను 3 వికెట్లు పడగొట్టాడు. ఈ సూపర్ ఫర్ ఫార్మెన్స్ తో టీమిండియా జట్టులోకి వచ్చాడు.
ఇప్పటికే 5 టెస్టులు, 4 టీ20లు ఆడాడు. ఆస్ట్రేలియాతో సిరీస్ లో మెల్ బోర్న్ లో నితీశ్ సాధించిన సెంచరీ ఎప్పటికీ గుర్తుండిపోయేదే.
రూ.6 కోట్లకు
నితీశ్ టాలెంట్ ను చూసి సన్ రైజర్స్ హైదరాబాద్ ఎంకరేజ్ చేస్తోంది. జట్టు నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నితీశ్ నిలకడగా రాణిస్తున్నాడు. అందుకే మెగా వేలానికి ముందు నితీశ్ ను రూ.6 కోట్లకు సన్ రైజర్స్ రిటైన్ చేసుకుంది. కొత్త సీజన్ కు పూర్తి ఫిట్ నెస్ తో సిద్ధమైన నితీశ్ మరోసారి అదరగొట్టాలనే లక్ష్యంతో ఉన్నాడు. కొత్త సీజన్ లో ఈ వైజాగ్ కుర్రాడి నుంచి మరిన్ని మెరుపులు చూడొచ్చు.
సంబంధిత కథనం