Pak vs Sl Asia Cup: పాకిస్థాన్‌ను వణికిస్తున్న వరుణుడు - శ్రీలంకతో మ్యాచ్ రద్ధైతే బాబర్ సేన ఇంటికే?
Pak vs Sl Asia Cup: ఆసియా కప్ సూపర్ 4 రౌండ్‌లో నేడు శ్రీలంక, పాకిస్థాన్ మధ్య కీలకమైన పోరు జరుగనుంది. ఈ మ్యాచ్‌లో విజేతగా నిలిచిన జట్టు ఫైనల్ చేరుకుంటుంది. అయితే నేటి మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచినట్లుగా తెలుస్తోంది.

Pak vs Sl Asia Cup: ఆసియా కప్‌లో పాకిస్థాన్ ఫైనల్ ఆశలు మొత్తం నేటి శ్రీలంకతో జరుగనున్న మ్యాచ్‌పైనే ఆధారపడ్డాయి. ఈ సూపర్ ఫోర్ మ్యాచ్ గురువారం (సెప్టెంబర్ 14న) కొలంబో వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు ఫైనల్‌లో ఇండియాతో తలపడనుంది.
ఫైనల్ బెర్త్….
ఫైనల్ బెర్తు కోసం శ్రీలంక, పాకిస్థాన్ మధ్య హోరాహోరీ పోరు జరగడం ఖాయమని క్రికెట్ అభిమానులు భావిస్తోన్నారు. కాగా ఈ మ్యాచ్‌కు వరుణుడి ముప్పు ఉన్నట్లు శ్రీలంక వాతావరణ శాఖ వెబ్‌సైట్స్ ప్రకటించాయి. కొలంబోలో 96 శాతం వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించాయి.
గత ఐదురోజులుగా కొలంబోలో వర్షం కురుస్తూనే ఉందని తెలిసింది. గురువారం కూడా మధ్యాహ్నం భారీ వర్ష సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు. వర్షం కారణంగా టాస్ కూడా ఆలస్యమయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. రాత్రి 8 గంటల తర్వాతే వర్ష తీవ్రత తగ్గుముఖం పట్టచ్చునని తెలిసింది. అప్పటివరకు వర్షం తీవ్రత గట్టిగానే ఉంటుందని అంటున్నారు.
మ్యాచ్ రద్ధైతే…
ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్ధైతే ఫైనల్ వెళ్లలనే పాకిస్థాన్ ఆశలకు గండిపడుతుంది. రన్‌రేట్ ప్రతిపాదికన శ్రీలంక ఫైనల్‌లో అడుగుపెడుతుంది. పాకిస్థాన్ ఇంటిముఖం పడుతుంది. దాంతో ఈమ్యాచ్ రిజల్ట్ ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.
ఇండియాతో మ్యాచ్‌లో చిత్తుగా ఓడిన పాకిస్థాన్ ఆ ఫలితం రిపీట్ కాకుండా శ్రీలంకతో జరుగనున్న సూపర్ ఫోర్ మ్యాచ్‌లో భారీగా మార్పులు చేసింది. ఫకర్ జమాన్, ఫహీమ్‌లపై వేటు వేసింది. వారి స్థానంలో మహ్మద్‌హరీస్, మహ్మద్ నవాజ్ జట్టులోకి వచ్చారు.