ఐపీఎల్ 2025 సీజన్ మరో నాలుగు రోజుల్లో షూరూ కానుంది. మార్చి 22న ఈ ఐపీఎల్ 18వ సీజన్ మొదలుకానుంది. మార్చి 23న రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగే మ్యాచ్‍తో ఈ సీజన్ సమరాన్ని సన్‍రైజర్స్ హైదరాబాద్ ప్రారంభించనుంది. గతేడాది విధ్వంసకర బ్యాటింగ్‍తో ఎస్ఆర్‌హెచ్ రెచ్చిపోయింది. ఫైనల్‍కు చేరింది. తుదిపోరులో కోల్‍కతా చేతిలో ఓడి టైటిల్ చేజార్చుకుంది. అయితే, ధనాధన్ ఆటతో అనేక రికార్డులను హైదరాబాద్ బద్దలుకొట్టింది.
గతేడాది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‍లో 287 పరుగులు చేసి.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డును హైదరాబాద్ సృష్టించింది. 250 పరుగుల స్కోరును మూడుసార్లు దాటింది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి ఆకాశమే హద్దుగా చెలరేగి హిట్టింగ్ ధమాకా చేశారు. ప్యాట్ కమిన్స్ సారథ్యంలో దుమ్మురేపారు. ఈ ఐపీఎల్ 2025 సీజన్‍లోనూ ఎస్ఆర్‌హెచ్ తరఫున వీరందరూ ఉన్నారు. ఇషాన్ కిషన్ రూపంలో ఈ సీజన్‍కు మరో హిట్టర్ యాడ్ అయ్యాడు. మహమ్మద్ షమీ రాకతో బౌలింగ్ కూడా బలపడింది. వేలం ద్వారా మరికొందరు ఆటగాళ్లు కూడా యాడ్ అయ్యారు.
ఐపీఎల్ 2025లో సన్‍రైజర్స్ హైదరాబాద్ బెస్ట్ తుదిజట్టు ఎలా ఉంటుందోననే ఉత్కంఠ ఉంది. బలమైన తుదిజట్టు ఎలా ఉండొచ్చో ఇక్కడ చూడండి. ఓపెనర్లుగా ఆస్ట్రేలియా స్టార్ ట్రావిస్ హెడ్, భారత యంగ్ సెన్సేషన్ అభిషేక్ శర్మ ఉంటారు. వేలం ద్వారా యాడ్ అయిన భారత వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్.. మూడో స్థానంలో బరిలోకి దిగుతాడు.
నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ ఆ తర్వాత బ్యాటింగ్‍కు వస్తారు. యంగ్ హిట్టర్ అనికేత్ వర్మకు కూడా ఎస్ఆర్‌హెచ్ తుదిజట్టులో చోటు దక్కే అవకాశాలు ఎక్కువ. అభినవ్ మనోహర్ కూడా ఉండొచ్చు.
గతేడాది వేలంలో కొనుగోలు చేసిన భారత సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ, హర్షల్ పటేల్‍కు సన్‍రైజర్స్ తుది జట్టులో చోటు ఉంటుంది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా పేస్ దళాన్ని ముందుకు నడిపిస్తాడు. స్పిన్నర్ రాహుల్ చాహల్ ఉండే ఛాన్స్ ఉంది. ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆస్ట్రేలియా ప్లేయర్ ఆడం జంపాను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించే అవకాశాలు ఎక్కువ. ఒకవేళ ఫస్ట్ బౌలింగ్ అయితే క్లాసెన్ ఇంపాక్ట్ ఆప్షన్‍గా ఉండొచ్చు. సచిన్ బేబీ, జయదేవ్ ఉనాద్కత్‍లకు అవసరాలకు తగ్గట్టు అవకాశాలు దక్కొచ్చు.
ఐపీఎల్ 2025 సీజన్‍లో సన్‍రైజర్స్ హైదరాబాద్ స్ట్రాంగ్ తుదిజట్టు: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, హర్షల్ పటేల్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), మహమ్మద్ షమీ, రాహుల్ చాహర్. ఇంపాక్ట్ ప్లేయర్: ఆడం జంపా
ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అథర్వ తైడే, సచిన్ బేబీ, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, హర్షల్ పటేల్, అభినవ్ మనోహర్, అనికేత్ వర్మ, కమిందు మెండిస్, వియాన్ ముల్డర్, మహమ్మద్ షమీ, రాహుల్ చాహర్, ఆడమ్ జంపా, జయదేవ్ ఉనద్కత్, సిమర్జీత్ సింగ్, జీషన్ అన్సారీ, ఎషాన్ మలింగ
సంబంధిత కథనం