South Africa Team: టీమిండియాతో ఈ నెల 10 నుంచి ప్రారంభం కాబోయే టీ20, వన్డే, టెస్ట్ సిరీస్ ల కోసం సౌతాఫ్రికా జట్లను సోమవారం (డిసెంబర్ 4) అనౌన్స్ చేశారు. టీ20, వన్డే జట్లకు ఏడెన్ మార్‌క్రమ్ కెప్టెన్ గా ఉండనున్నాడు. టెంబా బవుమా కేవలం టెస్టులకే పరిమితమయ్యాడు. సౌతాఫ్రికా టూర్లో భాగంగా ఇండియా 3 టీ20లు, మూడు వన్డేలు, 2 టెస్టులు ఆడనుంది.
డిసెంబర్ 10న జరిగే తొలి టీ20తో సౌతాఫ్రికాతో టీమిండియా టూర్ మొదలవుతుంది. ఇండియన్ టీమ్ లాగే సౌతాఫ్రికా కూడా మూడు ఫార్మాట్లకు మూడు వేర్వేరు జట్లను అనౌన్స్ చేసింది. వైట్ బాల్ సిరీస్ నుంచి కోహ్లి, రోహిత్ లకు రెస్ట్ ఇచ్చినట్లుగానే సౌతాఫ్రికా కూడా టెంబా బవుమా, కగిసో రబాడాలాంటి వాళ్లను పక్కన పెట్టింది. అతడు టెస్ట్ సిరీస్ కు తిరిగి రానున్నాడు.
టీ20 జట్టులో ఉన్న మార్కో జాన్సన్, లుంగి ఎంగిడి, గెరాల్డ్ కొయెట్జీ వన్డేలకు దూరమై తిరిగి టెస్టులకు రానున్నారు. వరల్డ్ కప్ 2023లో సౌతాఫ్రికా సెమీఫైనల్ వరకూ వచ్చిన విషయం తెలిసిందే. అయితే కెప్టెన్ గా ఉన్న బవుమా మాత్రం బ్యాట్ తో పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో అతన్ని ఇండియాతో వైట్ బాల్ సిరీస్ కు పక్కన పెట్టిన టీమ్ మేనేజ్‌మెంట్ తిరిగి టెస్టులకు బాధ్యతలు అప్పగించింది.
ఏడెన్ మార్‌క్రమ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మాన్, మాథ్యూ బ్రీజ్కే, నాండ్రె బర్గర్, గెరాల్డ్ కొయెట్జీ, డోనోవాన్ ఫెరీరా, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, ఆండిలె ఫెహ్లుక్వాయో, తబ్రేజ్ షంసీ, ట్రిస్టన్ స్టబ్స్, లిజాడ్ విలియమ్స్
ఏడెన్ మార్‌క్రమ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మాన్, మాథ్యూ బ్రీజ్కే, నాండ్రె బర్గర్, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, డేవిడ్ మిల్లర్, ఆండిలె ఫెహ్లుక్వాయో, తబ్రేజ్ షంసీ, లిజాడ్ విలియమ్స్, రాసీ వాండెర్ డుసెన్, టోనీ డిజోర్జీ, మిహ్లాలీ ఎంపోగ్వానా, వియాన్ ముల్డర్
టెంబా బవుమా (కెప్టెన్), డేవిడ్ బెడింగామ్, నాండ్రె బర్గర్, గెరాల్డ్ కొయెట్జీ, టోనీ డీజోర్జి, డీన్ ఎల్గార్, మార్కో జాన్సన్, కేశవ్ మహరాజ్, ఏడెన్ మార్‌క్రమ్, వియాన్ ముల్డర్, లుంగి ఎంగిడి, కీగన్ పీటర్సన్, కగిసో రబాడా, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెర్రీన్
తొలి టీ20 - డిసెంబర్ 10, డర్బన్
రెండో టీ20 - డిసెంబర్ 12, గెబెర్హా
మూడో టీ20 - డిసెంబర్ 14, జోహన్నెస్‌బర్గ్
తొలి వన్డే - డిసెంబర్ 17, జోహన్నెస్‌బర్గ్
రెండో వన్డే -డిసెంబర్ 19, గెబెర్హా
మూడో వన్డే - డిసెంబర్ 21, పార్ల్
తొలి టెస్ట్ - డిసెంబర్ 30, సెంచూరియన్
రెండో టెస్ట్ - జనవరి 7, కేప్ టౌన్