Sourav Ganguly: ఫైన‌ల్లో ఇండియా ఓడిపోతే రోహిత్ శర్మ స‌ముద్రంలో దూకేస్తాడు - గంగూలీ ఫ‌న్నీ కామెంట్స్-sourav ganguly says if team india lose in t20 world cup final rohit sharma might jump in barbados ocean ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Sourav Ganguly: ఫైన‌ల్లో ఇండియా ఓడిపోతే రోహిత్ శర్మ స‌ముద్రంలో దూకేస్తాడు - గంగూలీ ఫ‌న్నీ కామెంట్స్

Sourav Ganguly: ఫైన‌ల్లో ఇండియా ఓడిపోతే రోహిత్ శర్మ స‌ముద్రంలో దూకేస్తాడు - గంగూలీ ఫ‌న్నీ కామెంట్స్

Nelki Naresh Kumar HT Telugu
Jun 29, 2024 10:57 AM IST

Sourav Ganguly: సౌతాఫ్రికాతో నేడు (శ‌నివారం) జ‌రుగ‌నున్న టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్లో టీమిండియా ఓడిపోతే రోహిత్ శ‌ర్మ బార్బ‌డోస్ స‌ముద్రంలో దూకేస్తాడేమోన‌ని సౌర‌వ్ గంగూలీ ఫ‌న్నీ కామెంట్స్ చేశాడు. గంగూలీ కామెంట్స్ వైర‌ల్ అవుతోన్నాయి.

రోహిత్ శర్మ, సౌరవ్ గంగూలీ
రోహిత్ శర్మ, సౌరవ్ గంగూలీ

Sourav Ganguly: టీమిండియా, సౌతాఫ్రికా మ‌ధ్య నేడు (శ‌నివారం) జ‌రుగ‌నున్న టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌పై బీసీసీఐ మాజీ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ ఫ‌న్నీ కామెంట్స్ చేశాడు. నేటి ఫైన‌ల్‌లో టీమిండియా ఓడిపోతే కెప్టెన్ రోహిత్ శ‌ర్మ బార్బ‌డోస్ స‌ముద్రంలో దూకేసినా దూకేస్తాడ‌ని గంగూలీ స‌ర‌దాగా వ్యాఖ్యానించారు.

ఈ ఫైన‌ల్ పోరులో టీమిండియానే ఫేవ‌రేట్‌గా క‌నిపిస్తోంద‌ని గంగూలీ అన్నాడు. అంతే కాకుండా రోహిత్ కెప్టెన్సీపై గంగూలీ ప్ర‌శంస‌లు కురిపించాడు.

తాను ప్రెసిడెంట్‌గా ఉన్న‌ప్పుడే...

తాను బీసీసీఐ ప్రెసిడెంట్‌గా ఉన్న స‌మ‌యంలోనే రోహిత్ టీమిండియా కెప్టెన్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించాడ‌ని గంగూలీ గుర్తుచేశాడు. సార‌థిగా రోహిత్‌ ప్ర‌తిభాపాఠ‌వాల‌పై త‌న‌కు సంపూర్ణ‌మైన అవ‌గాహ‌న ఉంద‌ని కోహ్లి అన్నాడు. తెలివైన నిర్ణ‌యాలు తీసుకుంటూ స‌మిష్టిగా జ‌ట్టును ముందుకు న‌డిపిస్తుంటాడ‌ని, రోహిల్ కెప్టెన్సీలో టీమిండియా తిరుగులేని విజ‌యాల‌తో దూసుకుపోవ‌డం ఆనందంగా ఉంద‌ని గంగూలీ అన్నాడు.

ఇష్టం లేక‌పోయినా...

విరాట్ కోహ్లి కెప్టెన్సీ నుంచి త‌ప్పుకున్న త‌ర్వాత రోహిత్‌కు ఆ బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని అనుకున్నామ‌ని గంగూలీ తెలిపాడు. కానీ రోహిత్ కెప్టెన్సీ ప‌గ్గాల‌ను అందుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌లేద‌ని, తామే బ‌ల‌వంతంగా అత‌డిని ఒప్పించిన‌ట్లుగంగూలీ తెలిపాడు. అయిష్టంగానే కెప్టెన్సీని చేప‌ట్టిన రోహిత్‌...ఆ బాధ్య‌త‌ల‌కు పూర్తిగా న్యాయం చేస్తోన్నాడ‌ని తెలిపాడు.

ఐపీఎల్ కంటే గౌర‌వం...

కెప్టెన్‌గా రోహిత్ ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన సంగ‌తిని సౌర‌వ్ గంగూలీ గుర్తుచేశాడు. ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కంటే ఐపీఎల్ గొప్ప‌ద‌ని తాను అన‌డం లేద‌ని కానీ ఐపీఎల్ టైటిల్ గెల‌వాలంటే 16 నుంచి 17 మ్యాచుల్లో విజ‌యం సాధించాల్సివుంటుంద‌ని సౌర‌వ్ గంగూలీ అన్నాడు. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత‌గా నిల‌వాలంటే ఎనిమిది నుంచి తొమ్మిది మ్యాచులు గెలిస్తే చాల‌ని గంగూలీ తెలిపాడు. అయితే ఐపీఎల్ కంటే వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌డం అన్న‌ది ఏ కెప్టెన్‌కు అయినా గౌర‌వంగా ఉంటుంద‌ని, నేటి ఫైన‌ల్‌లో విజేత‌గా నిలిచి ఆ గౌర‌వాన్ని రోహిత్ పొందుతాడ‌నే న‌మ్మ‌క‌ముంద‌ని గంగూలీ చెప్పాడు.

ఆరు నెల‌ల గ్యాప్‌లో...

గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లో జ‌రిగిన వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌లో టీమిండియా ఓట‌మి పాలైంది. ఆ ఓట‌మి బాధ నుంచి తేరుకొని టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌లో ప్ర‌వేశించింది. ఆరు నెల‌ల గ్యాప్‌లో టీమిండియా ఆడుతోన్న రెండో వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ ఇది. ఈ ఫైన‌ల్‌లో టీమిండియా ఓడిపోతుంద‌ని తాను అనుకోవ‌డం లేద‌ని గంగూలీ చెప్పాడు. అనుకోని ప‌రిస్థితుల్లో టీమిండియా ఓట‌మి పాలైతే రోహిత్ బార్బ‌డోస్ స‌ముద్రంలో దూకేస్తాడేమోన‌ని గంగూలీ పేర్కొన్నాడు. గంగూలీ కామెంట్స్ వైర‌ల్ అవుతోన్నాయి.

WhatsApp channel