Sourav Ganguly: రోహిత్ శర్మపై సౌరవ్ గంగూలీ కామెంట్స్.. అప్పటి వరకు అంటూ!-sourav ganguly comments on rohit sharma captaincy over ind vs sa match ,cricket న్యూస్
తెలుగు న్యూస్  /  Cricket  /  Sourav Ganguly Comments On Rohit Sharma Captaincy Over Ind Vs Sa Match

Sourav Ganguly: రోహిత్ శర్మపై సౌరవ్ గంగూలీ కామెంట్స్.. అప్పటి వరకు అంటూ!

Sanjiv Kumar HT Telugu
Dec 02, 2023 10:09 AM IST

Sourav Ganguly About Team India Captaincy: టీమిండియా మాజీ సారథి, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ భారత్‌ క్రికెట్ టీమ్‌కు రోహిత్ శర్మనే కెప్టెన్‌గా ఉండాలని పేర్కొన్నారు. అందుకు గల కారణాలను కూడా గంగూలీ వివరించారు.

టీమిండియాకు అప్పటిదాకా అతనే కెప్టెన్‌గా ఉండాలి: గంగూలీ కామెంట్స్
టీమిండియాకు అప్పటిదాకా అతనే కెప్టెన్‌గా ఉండాలి: గంగూలీ కామెంట్స్

Sourav Ganguly IND vs SA: భారత్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ టీమిండియా కెప్టెన్సీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడు ఫార్మాట్‌లలో భారత్‌ క్రికెట్ టీమ్‌కు కెప్టెన్‌గా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఉండాలని తెలిపారు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ ముగిసేంతవరకు రోహిత్ శర్మను కెప్టెన్‌గా కొనసాగిస్తే అనుకున్న ఫలితాలు రాబట్టగలమని సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డారు. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 తర్వాత ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్‌లకు రోహిత్ శర్మ దూరం కానున్నాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు

ఈ నేపథ్యంలో "చాలా మంది ఆటగాళ్లు అందుబాటులో ఉండకపోవడం సమస్యగా అవతరించింది. టీ20 కెప్టెన్‌గా సూర్య కుమార్ యాదవ్ ఎంపికయ్యాడు. అయితే, వన్డేల్లో అతడి స్థానం విషయంలో అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. కాబట్టి 50 ఓవర్ల క్రికెట్‌కు మరో కెప్టెన్ అంటే ఈసారి కేఎల్ రాహుల్ వస్తున్నాడు. ఇక రోహిత్ టెస్ట్ మ్యాచ్‌లు ఆడాలనుకుంటున్నాడు కాబట్టి అతనే కెప్టెన్‌గా ఉంటాడు" అని సౌరవ్ గంగూలీ తెలిపారు.

"నిజానికి రోహిత్ శర్మ అన్ని ఫార్మాట్‌లలో ఆడాలి. వన్డే వరల్డ్ కప్‌లో అతడి కెప్టెన్సీలో టీమిండియా అద్భుతమైన ప్రదర్శన కనబర్చింది. అతడు గొప్ప నాయకుడు. టీ20 వరల్డ్ కప్ 2024 (T20 World Cup 2024) ముగిసేంత వరకు అన్ని ఫార్మాట్స్‌లలో కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఉండాలి" అని సౌరవ్ గంగూలీ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

ఇదిలా ఉంటే ఈ డిసెంబర్ నెలలో సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా జరగున్న టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఉండటం లేదు. రోహిత్‌తోపాటు విరాట్ కోహ్లీ కూడా దూరం కానున్నాడు. ఈ క్రమంలో టీమిండియా సారథి బాధ్యతలను హార్దిక్ పాండ్యా చేపట్టాల్సి ఉండగా.. అతను గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా ఉన్న సూర్య కుమార్ యాదవ్‌నే సఫారీల సిరీస్‌కు సారథ్యం వహించనున్నాడు.

WhatsApp channel