ఆస్ట్రేలియాతో నవంబరులో ప్రారంభంకానున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం 18 మంది సభ్యులతో కూడిన జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శుక్రవారం రాత్రి ఎంపిక చేసింది. కానీ.. ఐదు టెస్టుల ఈ సిరీస్‌కి ఎంపిక చేసిన జట్టులో యంగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌కి చోటు దక్కకపోవడంపై టీమిండియా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఢిల్లీ పేసర్ హర్షిత్ రాణా, ఆంధ్రా సీమ్ బౌలింగ్ ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిలకు ఈ జట్టులో తొలి అవకాశం లభించగా, కుల్దీప్ యాదవ్ గజ్జల్లో గాయం కారణంగా దూరమయ్యాడు. అలానే 2023 వన్డే వరల్డ్‌కప్‌లో గాయపడిన మహ్మద్ షమీ గాయం నుంచి పూర్తి స్థాయిలో కోలుకోకపోవడంతో అతడ్ని కూడా ఎంపిక చేయలేదు.
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైశ్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ఆకాశ్ దీప్, ప్రసీద్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్)
కానీ.. ఈ జట్టులో రుతురాజ్ గైక్వాడ్ లేకపోవడంతో సోషల్ మీడియాలో అభిమానులకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండియా-ఎ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రుతురాజ్ గైక్వాడ్‌ను ఆస్ట్రేలియా పర్యటనకి ఎంపిక చేయబోతున్నట్లు ఈ నెల ఆరంభంలో వార్తలు వచ్చాయి. కానీ.. అతడ్ని సెలెక్టర్లు పట్టించుకోలేదు. ఆస్ట్రేలియాతో నవంబరు 22 నుంచి ఈ ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభంకానుండగా.. వ్యక్తిగత కారణాల వల్ల రోహిత్ శర్మ ఫస్ట్ టెస్టుకి దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దాంతో అతని స్థానంలో ఈశ్వరన్ అభిమన్యుని సెలెక్టర్లు ఎంపిక చేశారు.
ప్రస్తుత దేశవాళీ సీజన్‌లో గైక్వాడ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు, ఒక సెంచరీ, మూడు అర్ధసెంచరీలతో 47.2 సగటుతో 472 పరుగులు చేశాడు. కానీ.. గైక్వాడ్‌ను సెలెక్టర్లు పట్టించుకోలేదు. గత ఏడాది కూడా ఈశ్వరన్ అభిమన్యుకే జట్టులో చోటిస్తూ కనిపించారు. అలానే శుభమన్ గిల్ కొన్ని మ్యాచ్‌ల్లో విఫలమైనా.. అతడ్నే కొనసాగిస్తారు. దాంతో కావాలనే గైక్వాడ్‌ను సెలెక్టర్లు పక్కన పెడుతున్నారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నవంబరు 22 నుంచి పెర్త్‌లో తొలి టెస్టు మ్యాచ్
డిసెంబరు 6 నుంచి అడిలైడ్‌లో రెండో టెస్టు మ్యాచ్
బ్రిస్బేబ్ వేదికగా డిసెంబరు 14 నుంచి మూడో టెస్టు మ్యాచ్
మెల్‌బోర్న్ వేదికగా డిసెంబరు 26 నుంచి నాలుగో టెస్టు మ్యాచ్
జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా ఆఖరి టెస్టు మ్యాచ్