Team India: ఆరేళ్ల క్రితం ఇదే రోజు చరిత్ర సృష్టించి భారత ఆటగాళ్ల సంబరాలు.. ఇప్పుడు నైరాశ్యం
Team India: ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా సృష్టించిన చరిత్రకు నేటితో ఆరేళ్లు నిండాయి. విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత జట్టు దుమ్మురేపే ప్రదర్శనతో హిస్టరీ క్రియేట్ చేసింది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
భారత క్రికెట్‍లో 2019కి ప్రత్యేక స్థానం ఉంటుంది. చరిత్రలోనే తొలిసారి ఆస్ట్రేలియా గడ్డపై ఆ జట్టుతో టెస్టు సిరీస్ గెలిచింది ఆ ఏడాదిలోనే. 2019 జనవరి 19వ తేదీన ఆసీస్‍లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించింది విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా. ఈ ఘనత సాధించిన తొలి ఆసియా జట్టుగా నిలిచి సత్తాచాటింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2018-19 సిరీస్‍ను 2-1 తేడాతో భారత్ దక్కించుకుంది. హిస్టరీ క్రియేట్ చేసింది. ఆసీస్ గడ్డపై భారత ఆటగాళ్లు జోరుగా సంబరాలు చేసుకున్నారు. ఆ చరిత్రాత్మక సందర్భానికి నేటి (జనవరి 7)తో ఆరేళ్లు. ఆ సిరీస్ వివరాలివే..
సిరీస్ ఇలా..
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2018-19 నాలుగు టెస్టుల సిరీస్‍లో భారత్ తొలి మ్యాచ్‍లోనే విజయం సాధించింది. ఆడిలైడ్‍లో దుమ్మురేపింది. ఆ తర్వాత పెర్త్ వేదికగా రెండో టెస్టులో ఓటమి ఎదురైంది. అనంతరం మెల్‍బోర్న్ టెస్టులో భారత్ అద్భుత విజయం సాధించింది. సిడ్నీ వేదికగా జరిగిన చివరిదైన నాలుగో టెస్టులో భారత్ ఆధిపత్యం చూపింది. ఆసీస్‍ను ఫాలోఆన్ ఆడించింది. అయితే, వాన వల్ల చివరి రోజు రద్దవటంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది కోహ్లీ సారథ్యంలోని భారత్. ఆసీస్ గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్ గెలిచి హిస్టరీ క్రియేట్ చేసింది.
పుజార అదుర్స్.. హీరోలు వీరే
టీమిండియా నయా వాల్ చతేశ్వర్ పుజార.. 2018-19 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అద్భుతంగా ఆడాడు. నాలుగో టెస్టుల్లో ఏకంగా 521 పరుగులు చేశారు. 74.42 యావరేజ్‍తో అదరగొట్టాడు. భారత్ ఈ సిరీస్ గెలువడంతో పుజార కీలకపాత్ర పోషించాడు. రిషబ్ పంత్ (350 పరుగులు), కెప్టెన్ విరాట్ కోహ్లీ (282 పరుగులు) కూడా బ్యాటింగ్‍లో అదరగొట్టారు. ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, హేజిల్‍వుడ్, లయాన్‍తో కూడిన ఆసీస్ బౌలింగ్ లైనప్‍ను దీటుగా ఎదుర్కొని భారీ పరుగులు చేసింది భారత్.
బౌలింగ్‍లో జస్‍ప్రీత్ బుమ్రా దుమ్మురేపాడు. 21 వికెట్లను దక్కించుకున్నాడు. మహమ్మద్ షమీ 16 వికెట్లతో రాణించగా.. ఇశాంత్ శర్మ 11 వికెట్లు తీశాడు. రవీంద్ర జడేజా కూడా 7 వికెట్లతో సపోర్ట్ చేశాడు. బ్యాటింగ్, బౌలింగ్‍లో ఆధిపత్యం చూపి ఆస్ట్రేలియా గడ్డపై ఆరేళ్ల క్రితం టీమిండియా గర్జించింది. అంచనాలకు మించి అదగొట్టి చరిత్ర సృష్టించింది. భారత క్రికెట్ చరిత్రలో 2018-19 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలుపు చిరస్థాయిగా నిలిచిపోతుంది. 2020-21లోనూ ఆసీస్ గడ్డపై బీజీటీ సిరీస్ గెలిచింది భారత్.
ఇప్పుడు పరాభవం
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గత నాలుగుసార్లు కైవసం చేసుకున్న భారత్.. ఇటీవల ఆసీస్ గడ్డపై తీవ్రంగా నిరాశపరిచింది. బీజీటీ 2023-24 సిరీస్‍లో టీమిండియా ఘోరంగా విఫలమైంది. ఐదు టెస్టుల సిరీస్‍ను 1-3తో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. పదేళ్ల తర్వాత బీజీటీ సిరీస్‍ను ఆసీస్ కైవసం చేసుకుంది. అయితే, ఈ సిరీస్‍లో కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తీవ్రంగా విఫలమవడం టీమిండియాకు చాలా ఇబ్బందిగా మారింది. భారత జట్టులో వారు ఉంటారా లేదా అనే అనిశ్చితి కూడా ఏర్పడింది. టీమ్‍లో నైరాశ్యం నెలకొంది.
సంబంధిత కథనం