IND vs AUS World Cup Final: ఫైన‌ల్‌లో ఓట‌మితో సిరాజ్ క‌న్నీళ్లు - ఎమోష‌న‌ల్ అయిన టీమిండియా క్రికెట‌ర్లు-siraj and kohli gets emotional after team india loss in world cup final ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Aus World Cup Final: ఫైన‌ల్‌లో ఓట‌మితో సిరాజ్ క‌న్నీళ్లు - ఎమోష‌న‌ల్ అయిన టీమిండియా క్రికెట‌ర్లు

IND vs AUS World Cup Final: ఫైన‌ల్‌లో ఓట‌మితో సిరాజ్ క‌న్నీళ్లు - ఎమోష‌న‌ల్ అయిన టీమిండియా క్రికెట‌ర్లు

Nelki Naresh Kumar HT Telugu
Nov 19, 2023 10:05 PM IST

IND vs AUS World Cup Final: వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఓట‌మితో టీమిండియా క్రికెట‌ర్లు ఎమోష‌న‌ల్ అయ్యారు. సిరాజ్ స్టేడియంలోనే క‌న్నీళ్లు పెట్టుకున్నాడు. కోహ్లి, రాహుల్ కూడా త‌మ క‌న్నీళ్ల‌ను అదిమిపెట్టుకుంటూ క‌నిపించారు. ఈ ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి.

సిరాజ్
సిరాజ్

IND vs AUS World Cup Final: వరల్డ్ కప్ ఫైన‌ల్‌లో ఓట‌మితో టీమిండియా క్రికెట‌ర్లు ఎమోష‌న‌ల్ అయ్యారు. సిరాజ్ బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్ రెండు ప‌రుగులు తీయ‌డంతో ఆస్ట్రేలియా విజేత‌గా నిలిచింది. ఆస్ట్రేలియా గెలుపు సంబ‌రాల్లో మునిగిపోయింది. టీమిండియా ఓట‌మితో సిరాజ్ క‌న్నీళ్లు పెట్టుకున్నాడు. ఏడుస్తూనే ఉండిపోయాడు.

కెప్టెన్ రోహిత్ శ‌ర్మ క‌న్నీళ్ల‌తో స్టేడియం నుంచి బ‌య‌ట‌కు వెళుతూ క‌నిపించాడు. కోహ్లి కూడా క‌న్నీళ్ల‌ను దాచుకుంటూ క‌నిపించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి. సిరాజ్‌ను బుమ్రాతో పాటు మిగిలిన క్రికెట‌ర్లు ఓదార్చారు.

వ‌ర‌ల్డ్ క‌ప్‌లో 11 విజ‌యాల‌తో టీమిండియా ఓట‌మి లేకుండా ఫైన‌ల్‌లో అడుగుపెట్టింది. కానీ తుది మెట్టులో ఆస్ట్రేలియా చేతిలో ఓట‌మి పాలైంది.

ఆదివారం జ‌రిగిన ఫైన‌ల్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా యాభై ఓవ‌ర్ల‌లో 240 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. ట్రావిస్‌హెడ్ సెంచ‌రీతో పాటు ల‌బుషేన్ హాఫ్ సెంచ‌రీతో రాణించ‌డంతో ఈ టార్గెట్‌ను 43 ఓవ‌ర్ల‌లోనే నాలుగు వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా ఛేదించింది. ఆరోసారి వ‌ర‌ల్డ్ క‌ప్‌ను గెలుచుకున్న‌ది.