భారత బ్యాటర్ శుభ్‌మన్ గిల్ తనపై వస్తున్న రూమర్స్‌పై స్పందించాడు. ఐపీఎల్ 2025లో ఈ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. రిలేషన్ షిప్ స్టేటస్ పై బాంబ్ పేల్చాడు. తాను మూడేళ్లుగా సింగిల్‌గానే ఉన్నానని చెప్పాడు. హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాతో మాట్లాడుతూ.. తనపై వస్తున్న రూమర్స్ గురించి పట్టించుకోనని, ఎందుకంటే అవి నిజం కావని తనకు తెలుసని గిల్ అన్నాడు.
దిగ్గజ క్రికెటర్ సారా టెండూల్కర్ తో శుభ్‌మన్ గిల్ డేటింగ్ రూమర్స్ ఓ రేంజ్ లో ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరూ లవ్ లో ఉన్నారనే ప్రచారం ఉంది. వీళ్లిద్దరి డీప్ ఫేక్ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరోవైపు బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ తో గిల్ రిలేషన్ లో ఉన్నాడనే వార్తలొచ్చాయి.
తనపై వస్తున్న రూమర్స్ ను శుభ్‌మన్ గిల్ ఖండించాడు. "నేను మూడేళ్లకు పైగా సింగిల్‌గానే ఉన్నా. చాలా మందితో నన్ను ముడిపెడుతూ రూమర్స్ వస్తున్నాయి. కొన్నిసార్లు అయితే నేను ఎప్పుడూ చూడని, కలవని వ్యక్తులతో కూడా నన్ను లింక్ చేస్తున్నారు. అసలు నేను ఆ వ్యక్తితో ఎందుకు ఉన్నానని కూడా రూమర్స్ వస్తున్నాయి" అని గిల్ అన్నాడు.
క్రికెట్ కారణంగా రిలేషన్‌షిప్‌లో ఉండేందుకు తనకు టైమ్ లేదని గిల్ చెప్పాడు. "నేను నా ప్రొఫెషనల్ కెరీర్‌పై దృష్టి పెట్టా. సంవత్సరంలో 300 రోజులు ప్రయాణాలు చేస్తూ ఉండటం వల్ల రిలేషన్‌షిప్‌లో ఉండటానికి నాకు సమయం లేదు" అని గిల్ క్లారిటీ ఇచ్చాడు.
గ్రౌండ్ లో గిల్ ఫీల్డింగ్ చేస్తున్న టైమ్ లో సారా పేరుతో ఫ్యాన్స్ నినాదాలు చేయడం తెలిసిందే. సహచర క్రికెటర్లు కూడా ఈ విషయంలో గిల్ ను టీజ్ చేస్తున్నారు. "నేను చాలాసార్లు చెప్పా. కానీ రూమర్స్ అనేది ఓ ఆటోమేటిక్ స్విచ్ లాంటిది. ఇతర ఏ బ్యాటర్ కూడా అలాంటి నినాదాలు వినలేరు. అది వివరించడం కష్టం. మీరు ఫీల్డ్ లో ఉన్నప్పుడు పనిపైనే దృష్టి పెడతారు. బౌలర్ ఎలా బౌలింగ్ చేస్తున్నాడు, ఎంత స్కోర్ చేయాలి, నేను ఏమి చేయాలి అనే దానిపైనే దృష్టి ఉంటుంది" అని గిల్ చెప్పాడు.
"ఏ గ్యాప్‌లో కొట్టాలి, బౌలర్ ఎక్కడ బౌలింగ్ చేస్తే ఎక్కడ కొట్టాలి, ఎలా ఆడాలి అనే దానిపైనే దృష్టి ఉంటుంది. ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు మాత్రం నినాదాలు వినబడతాయి. ముఖ్యంగా బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు అవి మరింత ఎక్కువగా వినిపిస్తాయి." అని గిల్ తెలిపాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్టులో గిల్ ఉన్నాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి ఆటగాళ్లతో కలిసి ఆ టోర్నమెంట్ గెలవడం చాలా ప్రత్యేకంగా అనిపించిందని గిల్ చెప్పాడు. రోహిత్ భాయ్, విరాట్ భాయ్‌లతో కలిసి ఆడటం అనేది వర్ణించలేని అనుభూతి. క్రీడలు మాత్రమే మిమ్మల్ని ప్రపంచంలోనే ఉత్తమంగా నిలబెడతాయి" అని గిల్ అన్నాడు.
సంబంధిత కథనం