Shubman Gill: శుభ్‌మన్ గిల్ 90 ఔట్.. విరాట్ కోహ్లి రికార్డును సమం చేసిన గుజరాత్ టైటన్స్ కెప్టెన్-shubman gill out in the nineties again equals unwanted record of virat kohli ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Shubman Gill: శుభ్‌మన్ గిల్ 90 ఔట్.. విరాట్ కోహ్లి రికార్డును సమం చేసిన గుజరాత్ టైటన్స్ కెప్టెన్

Shubman Gill: శుభ్‌మన్ గిల్ 90 ఔట్.. విరాట్ కోహ్లి రికార్డును సమం చేసిన గుజరాత్ టైటన్స్ కెప్టెన్

Hari Prasad S HT Telugu

Shubman Gill: గుజరాత్ టైటన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఐపీఎల్లో మరోసారి 90ల్లో ఔటై విరాట్ కోహ్లి రికార్డును సమం చేశాడు. కేకేఆర్ తో మ్యాచ్ లో అతడు 90 రన్స్ చేసిన విషయం తెలిసిందే.

శుభ్‌మన్ గిల్ 90 ఔట్.. విరాట్ కోహ్లి రికార్డును సమం చేసిన గుజరాత్ టైటన్స్ కెప్టెన్ (Hindustan Times)

Shubman Gill: ఐపీఎల్లో గుజరాత్ టైటన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రెండోసారి 90ల్లో ఔటయ్యాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో అతడు చెలరేగిపోయాడు. అయితే సెంచరీ ఆశ మాత్రం తీరలేదు. ఈ క్రమంలో గిల్.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి రికార్డును సమం చేశాడు. సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కంటే కాస్త వెనుకబడ్డాడు.

గిల్ సెంచరీ మిస్

శుభ్‌మన్ గిల్ కేకేఆర్ తో మ్యాచ్ లో 55 బంతుల్లోనే 10 ఫోర్లు, 3 సిక్స్ లతో 90 రన్స్ చేశాడు. సెంచరీ కచ్చితంగా చేస్తాడని భావించినా.. 18వ ఓవర్ ఐదో బంతికి ఔటయ్యాడు. మరో రెండు ఓవర్లు ఉండటంతో గిల్ సులువుగా మూడంకెల స్కోరు అందుకుంటాడని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు. గిల్ ఐపీఎల్లో 90ల్లో ఔటవడం ఇది రెండోసారి.

ఈ క్రమంలో ఐపీఎల్లో ఇలా ఒకటి కంటే ఎక్కువసార్లు 90ల్లో ఔటైన నాలుగో ఇండియన్ బ్యాటర్ గా గిల్ నిలిచాడు. అదే సమయంలో విరాట్ కోహ్లి రికార్డును కూడా సమం చేశాడు. ఐపీఎల్లో అత్యధికంగా 90ల్లో ఔటైన బ్యాటర్ గా రుతురాజ్ గైక్వాడ్ నిలిచాడు. అతడు మూడుసార్లు ఇలా ఔటయ్యాడు. విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ రెండేసిసార్లు ఇలా ఔటయ్యారు. ఇప్పుడు గిల్ వాళ్ల సరసన చేరాడు.

గతంలో 2022లోనూ పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో గిల్ 96 రన్స్ చేసి ఔటయ్యాడు. ఇప్పుడు కేకేఆర్ తో మ్యాచ్ లో 90 రన్స్ చేశాడు. ఈ క్రమంలో ఐపీఎల్ 2025లో అతడు 300 రన్స్ మార్క్ దాటాడు. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో 7వ స్థానంలో ఉన్నాడు. 8 ఇన్నింగ్స్ లో అతడు 305 రన్స్ చేశాడు. స్ట్రైక్ రేట్ 153.26గా ఉంది.

90ల్లో ఎక్కువసార్లు ఔటైన ప్లేయర్స్ వీళ్లే

ఓవరాల్ గా ఐపీఎల్లో 90ల్లో ఒకటి కంటే ఎక్కువసార్లు ఔటైన ప్లేయర్స్ 8 మంది ఉన్నారు. అందులో ఇండియన్స్ నలుగురు కాగా.. మిగిలిన నలుగురు విదేశీ ప్లేయర్స్.

రుతురాజ్ గైక్వాడ్ – 3 సార్లు

గ్లెన్ మాక్స్‌వెల్ – 3 సార్లు

డేవిడ్ వార్నర్ – 3 సార్లు

క్రిస్ గేల్ – 2 సార్లు

ఫాఫ్ డుప్లెస్సి – 2 సార్లు

విరాట్ కోహ్లీ – 2 సార్లు

శుభ్‌మన్ గిల్ – 2 సార్లు

కేఎల్ రాహుల్ – 2 సార్లు

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం