shubman gill: టీమ్ఇండియా ప్రిన్స్ సూపర్ సెంచరీ.. అహ్మదాబాద్ లో శుభ్ మన్ గిల్ శతకం.. హాఫ్ సెంచరీతో ఫామ్ లోకి కోహ్లి
shubman gill: ఇంగ్లండ్ తో అహ్మదాబాద్ లో మూడో వన్డేలో టీమ్ఇండియా యువ బ్యాటర్ శుభ్ మన్ గిల్ సూపర్ సెంచరీ చేశాడు. కింగ్ కోహ్లి హాఫ్ సెంచరీతో ఫామ్ లోకి వచ్చాడు.

ఇంగ్లండ్ తో మూడో వన్డేలో సెంచరీ చేసిన శుభ్ మన్ గిల్ (PTI)
టీమ్ఇండియా ప్రిన్స్ శుభ్ మన్ గిల్ అదరగొడుతున్నాడు. సూపర్ ఫామ్ లో ఉన్న ఈ యంగ్ ఓపెనర్ బుధవారం (ఫిబ్రవరి 12) ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో వన్డేలో సెంచరీ బాదేశాడు. ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా హోం గ్రౌండ్ అహ్మదాబాద్ లో జట్టును నడిపించే గిల్.. ఇప్పుడు అదే స్టేడియంలో తొలి వన్డే సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు ఫ్యాన్స్ ఎదురు చూపులకు తెరదించుతూ కింగ్ కోహ్లి ఫిఫ్టీతో ఫామ్ లోకి వచ్చాడు.
- భారత యువ ఓపెనర్ శుభ్ మన్ గిల్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. నిలకడగా రాణిస్తున్నాడు. ఇంగ్లండ్ తో తొలి వన్డేలో 87, రెండో వన్డేలో 60 పరుగులు చేశాడు.
- ఇప్పుడు మూడో వన్డేలో గిల్ సెంచరీ అందుకున్నాడు. 102 బంతుల్లో 112 పరుగులు చేశాడు. 14 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. తన స్టైల్లో హాఫ్ వ్యాలీ షాట్లు ఆడటంతో పాటు కవర్ డ్రైవ్, లాఫ్టెడ్, కట్ షాట్లు కొట్టాడు.
- మరోవైపు అభిమానుల వెయిటింగ్ కు కింగ్ కోహ్లి ముగింపు పలికాడు. మోకాలు వాపుతో ఇంగ్లండ్ తో తొలి వన్డేకు దూరమైన కోహ్లి రెండో వన్డేలో 5 పరుగులే చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ ఆడుతున్న ఈ ఆఖరి వన్డేలో కోహ్లి సత్తాచాటాలని అందరూ కోరుకున్నారు.
- అందరూ ఆశించినట్లుగా కోహ్లి హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 55 బంతుల్లో 52 పరుగులు చేశాడు. 7 ఫోర్లు, ఓ సిక్సర్ కొట్టాడు. ముఖ్యంగా స్పిన్ వేసే రూట్ బౌలింగ్ లో కోహ్లి ఆధిపత్యం ప్రదర్శించాడు. ఫ్లిక్, కవర్ డ్రైవ్, స్వీప్ తో బౌండరీలు రాబట్టాడు. సెంచరీ దిశగా సాగేలా కనిపించిన కోహ్లీని మరోసారి లెగ్ స్పిన్నర్ రషీద్ ఔట్ చేశాడు.
- శ్రేయస్ అయ్యర్ కూడా ఫామ్ కొనసాగించాడు. తొలి రెండు వన్డేల్లో వరుసగా 59, 44 పరుగులు చేసిన అతను.. ఈ మ్యాచ్ లో 78 పరుగులు సాధించాడు. 8 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టాడు.
- ఇప్పటికే ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ ను 2-0 తో సొంతం చేసుకున్న భారత్ మూడో వన్డేలోనూ భారీ స్కోరు దిశగా సాగుతోంది. 43 ఓవర్లు పూర్తయ్యేసరికి 302/5తో నిలిచింది. కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ క్రీజులో ఉన్నారు.
సంబంధిత కథనం