టీమిండియా టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మరో రికార్డు నమోదు చేశాడు. సంచలనాన్ని అందుకున్నాడు. 148 ఏళ్ల టెస్టు చరిత్రలో మరే బ్యాటర్ కు దక్కని రికార్డును సొంతం చేసుకున్నాడు. హిస్టరీ క్రియేట్ చేశాడు. ఒకే టెస్టులో 250, 150కు పైగా పరుగులు చేసిన ఏకైక బ్యాటర్ గా శుభ్‌మన్ గిల్ నిలిచాడు. ఇంగ్లాండ్ తో రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో 269 పరుగులు చేసిన గిల్.. రెండో ఇన్నింగ్స్ లో 161 పరుగులు సాధించాడు.
ఇంగ్లాండ్ తో రెండో టెస్టుపై టీమిండియా పట్టు బిగించింది. గెలుపు కోసం రంగం సిద్ధం చేసుకుంది. ఓటమైతే ఎదురయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అయితే ఇంగ్లాండ్ అసాధారణంగా పోరాడితే మ్యాచ్ డ్రా కావొచ్చు. ఇండియా రెండో ఇన్నింగ్స్ ను 427/6 వద్ద డిక్లేర్ చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (162 బంతుల్లో 161; 13 ఫోర్లు, 8 సిక్సర్లు) అదరగొట్టాడు. జడేజా (69 నాటౌట్), రిషబ్ పంత్ (65), కేఎల్ రాహుల్ (55) రాణించారు.
రెండో టెస్టులో ఇంగ్లాండ్ కు టీమిండియా భారీ టార్గెట్ సెట్ చేసింది. నాలుగో రోజైన శనివారం ఇండియా రెండో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. ఇంగ్లాండ్ ముందు 608 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. ఇప్పటికే ఓ వికెట్ కూడా పడగొట్టింది. ఈ మ్యాచ్ లో విజయం కోసం టీమిండియా గట్టిగా పోరాడుతోంది. అన్ని రకాలుగా ఇంగ్లాండ్ ను దెబ్బకొడుతోంది. మరో రోజు ఆట మాత్రమే మిగిలి ఉంది.
భారత టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రికార్డులు బ్రేక్ చేస్తూనే ఉన్నాడు. సరికొత్త చరిత్రకు నాంది పలుకుతూనే ఉన్నాడు. ఇంగ్లాండ్ తో రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్ లో హండ్రెడ్ బాదాడు. ఓ టెస్టులో 250 ప్లస్, 150 ప్లస్ స్కోర్లు చేసిన ఫస్ట్ బ్యాటర్ గా నిలిచాడు. అంతే కాకుండా ఓ టెస్టులో అత్యధిక పరుగులు చేసిన ఇండియన్ ప్లేయర్ గా హిస్టరీ క్రియేట్ చేశాడు. ఈ మ్యాచ్ లో గిల్ 430 రన్స్ చేశాడు. ఓవరాల్ గా చూసుకుంటే ఓ మ్యాచ్ లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్ గా నిలిచాడు. గూచ్ (1990లో ఇండియాపై 456) ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు.
తొలి టెస్టులో ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా ఓడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో నెగ్గి సిరీస్ సమం చేయాలని భారత్ పట్టుదలతో ఉంది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 587 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్ 407 పరుగులకు కుప్పకూలింది.
సంబంధిత కథనం