శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతోన్న ఐపీఎల్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు చేసింది. పాయింట్స్ టేబుల్‌లో టాప్ ప్లేస్‌పై కన్నేసిన పంజాబ్ కింగ్స్‌ను శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో ఆదుకోగా...చివరల్లో మెరుపు ఇన్నింగ్స్‌తో స్లాయినిస్ రెండు వందల పరుగులు దాటించాడు. వీరిద్దరి జోరుతో ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయిన పంజాబ్ కింగ్స్ 206 పరుగులు చేసింది. ఢిల్లీ ముందు భారీ టార్గెట్‌ను విధించింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ డుప్లెసిస్...పంజాబ్‌కు బ్యాటింగ్ అప్పగించాడు. ఈ సీజన్‌లో సూపర్ ఫామ్‌లో పంజాబ్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య ఫోరు కొట్టి జోరు మీద కనిపించాడు. రెండో ఓవర్‌లోనే అతడిని ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఔట్ చేశాడు. ప్రియాన్ష్ ఔట్ అయినా...ప్రభ్‌సిమ్రాన్, జోస్ ఇంగ్లీస్ ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ఎడాపెడా ఫోర్లు, సిక్సర్లతో బెంబేలెత్తించారు. కానీ వారి జోరు ఎక్కువ సేపు సాగలేదు. జోస్ ఇంగ్లీస్ 12 బాల్స్‌లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 32 పరుగులు చేయగా...ప్రభ్‌సిమ్రాన్ 18 బాల్స్‌లో నాలుగు ఫోర్లు ఓ సిక్సర్‌తో 28 రన్స్ చేసి ఔటయ్యాడు.
నేహల్ వధేరా, శశాంక్ సింగ్ సాయంతో ఢిల్లీ స్కోరును వంద పరుగులు దాటించాడు శ్రేయస్ అయ్యర్ ఓ వైపు వికెట్లు పడుతోన్న ఒంటరి పోరాటం చేశాడు. హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న శ్రేయస్ అయ్యర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్ ఔటయ్యాడు. 34 బాల్స్‌లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 53 పరుగులు చేశాడు శ్రేయస్ అయ్యర్.
చివరలో స్టాయినిస్ విధ్వంసంతో పంజాబ్ కింగ్స్ రెండు వందల పరుగులు దాటింది. స్టాయినిస్ 16 బాల్స్‌లోనే నాలుగు సిక్సర్లు, మూడు ఫోర్లతో 44 పరుగులు చేశాడు.
ఢిల్లీ బౌలర్లలో ముస్తాఫిజుర్ మూడు, విప్రజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఐపీఎల్ పాయింట్స్ టేబుల్‌లో పంజాబ్ కింగ్స్ టాప్ ప్లేస్‌కు చేరుకుంటుంది. ఢిల్లీకి ఈ మ్యాచ్‌లో ఓడిపోయినా, గెలిచిన ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి ఈ జట్టు నిష్క్రమించింది. మరోవైపు ఇంగ్లండ్ టూర్ కోసం శనివారం టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ టెస్ట్ టీమ్‌లో శ్రేయస్ అయ్యర్‌కు స్థానం దక్కలేదు. అదే రోజు అతడు హాఫ్ సెంచరీ చేయడం క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
సంబంధిత కథనం