Ipl 2025: ఐపీఎల్ ఫ్యాన్స్ కు షాక్.. మ్యాచ్ లను ఫ్రీగా చూడలేరు.. మనీ కట్టాల్సిందే.. జియో హాట్ స్టార్ లో కొత్త ప్లాన్లు
Ipl 2025: కొత్త ఓటీటీ స్ట్రీమింగ్ వేదిక జియోహాట్ స్టార్ క్రికెట్ ఫ్యాన్స్ కు షాకిచ్చింది. ఐపీఎల్ 2025 మ్యాచ్ లను చూడాలంటే ఫ్యాన్స్ మనీ చెల్లించాల్సిందే. ప్లాన్లు రూ.149 నుంచి స్టార్ట్ అవుతున్నాయి.

ఐపీఎల్ ఫ్యాన్స్ కు షాక్.. మ్యాచ్ లు చూడాలంటే డబ్బులు కట్టాల్సిందే (ANI)
రిలయన్స్ కు చెందిన వయాకామ్ 18, స్టార్ ఇండియా విలీనంతో కొత్తగా ఏర్పడిన జియోహాట్ స్టార్ క్రికెట్ ఫ్యాన్స్ కు షాకిచ్చింది. ఐపీఎల్ 2025 మ్యాచ్ లను ఫ్రీగా చూసే ఛాన్స్ ను ఎత్తేసింది. ఇక ఆ మ్యాచ్ లు చూడాలంటే మనీ కట్టి సబ్ స్క్రిప్షన్ ప్లాన్స్ తీసుకోవాల్సిందే. లేదంటే ఐపీఎల్ మ్యాచ్ లు చూసే అవకాశం లేదు. గతంలో జియో సినిమా, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సెపరేట్ గా ఉండేవి.
- వయాకామ్ 18, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ విలీనమయ్యి జియోహాట్ స్టార్ గా కొత్త వేదికను శుక్రవారం ప్రారంభించాయి. ఈ జియోహాట్ స్టార్ లో ఫ్రీగా ఐపీఎల్ మ్యాచ్ లు ప్రసారం చేయొద్దని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కొన్ని నిమిషాల ఫ్రీ టైమ్ తర్వాత స్ట్రీమింగ్ ఆగిపోతుందని తెలిసింది. ప్లాన్ కొనుగోలు చేస్తేనే మ్యాచ్ లు చూడొచ్చు.
- ఈ ప్లాన్లు రూ.149 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అది బేసిక్ ప్లాన్. అది కూడా మూడు నెలలు. ఏడాది ప్లాన్ కావాలంటే రూ.499 చెల్లించాలి. ఈ ఆఫర్ కేవలం మొబైల్ లో చూసేందుకు మాత్రమే. మూడు నెలలకు రూ.299 లేదా ఏడాదికి రూ.899 ప్లాన్ తో రెండు డివైజ్ లలో యాప్ ను యాక్సెస్ చేయొచ్చు. ఇక నెలకు రూ.299 లేదా మూడు నెలలకు రూ.499 లేదా ఏడాదికి రూ.1499 తో యాడ్ ఫ్రీ ప్లాన్ ను పొందొచ్చు. ఈ ప్లాన్ తో నాలుగు డివైజ్ లలో మ్యాచ్ లు చూడొచ్చు.
- 2022లో రిలయన్స్ కు చెందిన వయాకామ్ 18 ఐపీఎల్ డిజిటల్ మీడియా రైట్స్ ను సుమారు రూ.23,758 కోట్లు (3 బిలియన్ డాలర్లు) చెల్లించి దక్కించుకుంది. 2023 నుంచి 2027 వరకు హక్కులు సొంతం చేసుకుంది.
- వయాకామ్ 18 తనకు చెందిన జియో సినిమాలో 2023, 2024 ఐపీఎల్ ను ఫ్రీగా చూసే అవకాశం ఫ్యాన్స్ కు కల్పించింది. కానీ 2025 ఐపీఎల్ నుంచి అభిమానులకు ఆ ఛాన్స్ లేదు. రాయిటర్స్ రిపోర్ట్ ప్రకారం 2025 ఐపీఎల్ మ్యాచ్ లు చూడాలంటే ప్లాన్ కొనుగోలు చేయాల్సిందే.
సంబంధిత కథనం