Shivam Dube: టీ20ల్లో ఆరేళ్లుగా ఓట‌మి లేని టీమిండియా క్రికెట‌ర్‌గా శివ‌మ్ దూబే రికార్డ్ - వ‌రుస‌గా 30 మ్యాచుల్లో విజ‌యం-shivam dube becomes first indian cricketer to win 30 consecutive matches in t20 cricket ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Shivam Dube: టీ20ల్లో ఆరేళ్లుగా ఓట‌మి లేని టీమిండియా క్రికెట‌ర్‌గా శివ‌మ్ దూబే రికార్డ్ - వ‌రుస‌గా 30 మ్యాచుల్లో విజ‌యం

Shivam Dube: టీ20ల్లో ఆరేళ్లుగా ఓట‌మి లేని టీమిండియా క్రికెట‌ర్‌గా శివ‌మ్ దూబే రికార్డ్ - వ‌రుస‌గా 30 మ్యాచుల్లో విజ‌యం

Nelki Naresh Kumar HT Telugu
Feb 04, 2025 01:26 PM IST

Shivam Dube: టీమిండియా క్రికెట‌ర్ శివ‌మ్ దూబే అరుదైన రికార్డును నెల‌కొల్పాడు. 30 మ్యాచుల్లో ఓట‌మే లేని క్రికెట‌ర్‌గా నిలిచాడు. 2019 నుంచి ఇటీవ‌ల ఇంగ్లండ్‌తో జ‌రిగిన ఐదో వ‌న్డే వ‌ర‌కు దూబే ఆడిన ప్ర‌తి మ్యాచ్‌లో టీమిండియా విజ‌యాన్ని సాధించ‌డం గ‌మ‌నార్హం.

శివ‌మ్ దూబే
శివ‌మ్ దూబే

Shivam Dube: టీ20 క్రికెట్‌లో టీమిండియా ప్లేయ‌ర్ శివ‌మ్ దూబే అరుదైన రికార్డును నెల‌కొల్పాడు. కోహ్లి, రోహిత్‌తో పాటు టీమిండియా దిగ్గ‌జ క్రికెట‌ర్ల‌కు సాధ్యం కానీ రికార్డును దూబే త‌న పేరిట న‌మోదు చేశాడు. ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్‌లో దూబే ఆడిన 30 మ్యాచుల్లో టీమిండియా విజ‌యం సాధించింది. 2019 నుంచి ఇంగ్లండ్‌తో ఇటీవ‌ల జ‌రిగిన ఐదో వ‌న్డే వ‌ర‌కు దూబే ప్రాతినిథ్యం వ‌హించిన ఏ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోలేదు. టీ20 హిస్ట‌రీలో వ‌రుస‌గా 30 మ్యాచుల్లో విజ‌యం సాధించిన ఏకైక‌, తొలి టీమిండియా ప్లేయ‌ర్‌గా శివ‌మ్ దూబే రికార్డ్ నెల‌కొల్పాడు.

yearly horoscope entry point

సీఎస్‌కే ట్వీట్‌...

దూబే రికార్డును ఉద్దేశిస్తూ చెన్నై సూప‌ర్ కింగ్స్ చేసిన ట్వీట్ వైర‌ల్ అవుతోంది. దూబే ఆడితే టీమిండియాకు విజ‌య‌మే. 30-0తో దూబే విన్నింగ్ రికార్డ్ స్ట్రాంగ్‌గా కంటిన్యూ అవుతోంది అంటూ చెన్నై సూప‌ర్ కింగ్స్ ఓ పోస్ట్ పెట్టింది. దూబే షాట్ కొడుతోన్న ఓ ఫొటోను అభిమానుల‌తో పంచుకున్న‌ది. ఈ ఫొటోపై 2019 డిసెంబ‌ర్ 11 నుంచి శివ‌మ్ దూబే విజ‌య యాత్ర కొన‌సాగుతుంది అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది.

2019లో ఎంట్రీ...

2019 న‌వంబ‌ర్‌లో బంగ్లాదేశ్‌తో జ‌రిగిన టీ20 మ్యాచ్ ద్వారా టీమిండియాలోకి శివ‌మ్ దూబే ఎంట్రీ ఇచ్చాడు. తొలి మ్యాచ్‌లో కేవ‌లం ఒక్క ప‌రుగు మాత్ర‌మే చేసి నిరాశ‌ప‌రిచాడు. 2019 డిసెంబ‌ర్ 8న వెస్టిండీస్‌తో జ‌రిగిన టీ20 మ్యాచ్‌లో దూబే హాఫ్ సెంచ‌రీ చేసిన టీమిండియా ఓట‌మి పాలైంది. ఆ త‌ర్వాత డిసెంబ‌ర్ 11న జ‌రిగిన మ‌రో టీ20లో వెస్టిండీస్‌ను టీమిండియా చిత్తు చేసింది. అప్ప‌టి నుంచి ఇంగ్లండ్‌తో జ‌రిగిన ఐదో టీ20 వ‌ర‌కు దూబే ఆడిన ప్ర‌తి మ్యాచ్‌లో టీమిండియా గెలిచింది.

ఇప్ప‌టివ‌ర‌కు టీమిండియా త‌ర‌ఫున 35 టీ20 మ్యాచ్‌లు ఆడిన దూబే నాలుగు హాఫ్ సెంచ‌రీల‌తో 531 ప‌రుగులు చేశాడు. 13 వికెట్లు ద‌క్కించుకున్నాడు.

ఐపీఎల్‌లో

ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 65 మ్యాచులు ఆడిన దూబే 1502 ర‌న్స్ చేశాడు. తొమ్మిది హాఫ్ సెంచ‌రీలు సాధించాడు. ఐదు వికెట్లు తీసుకున్నాడు. ఐపీఎల్ ప్ర‌స్తుతం చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు దూబే ప్రాతినిథ్యం వ‌హిస్తోన్నాడు. ఐపీఎల్ 2024 సీజ‌న్‌లో 396 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్స్‌లో ఒక‌రిగా నిలిచాడు. ఐపీఎల్ 2025 కోసం దూబేను సీఎస్‌కే 12 కోట్ల‌కు రిటైన్ చేసుకుంది. చెన్నై కంటే ముందే రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌ర‌ఫున ఆడాడు శివ‌మ్ దూబే.

Whats_app_banner