సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఆరంభ పోరులో లక్నో సూపర్ జెయింట్స్ ఒక వికెట్ తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ సగానికిపైగా లక్నోదే ఆధిపత్యం కనిపించింది. కానీ యంగ్ క్రికెటర్లు అశోతోష్ శర్మతో పాటు విప్రజ్ నిగమ్ సంచలన బ్యాటింగ్‌తో ఢిల్లీకి అనూహ్య విజయాన్ని సాధించింది.మరో మూడు మూడు బాల్స్ మిగిలుండగానే లక్నో విధించిన 210 పరుగుల టార్గెట్‌ను ఛేదించారు.
గెలవాల్సిన మ్యాచ్‌లో లక్నో ఓడిపోవడం ఆ జట్టు అభిమానులతో పాటు ఫ్రాంచైజ్ ఓనర్ సంజీవ్ గొయెంకా కూడా జీర్ణించుకోలేనట్లుగా కనిపించింది. మ్యాచ్ అనంతరం సంజీవ్ గొయెంకాతో కెప్టెన్ రిషబ్ పంత్ మాట్లాడుతోన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో దేని గురించి సంజీవ్ గొయెంకాకు సీరియస్‌గా వివరిస్తూ రిషబ్ పంత్ కనిపించాడు. ఈ వీడియోపై సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ వెల్లువెత్తుతోన్నాయి.
అప్పుడే రిషబ్ పంత్‌కు క్లాస్ మొదలైందంటూ కామెంట్స్ చేస్తోన్నారు. గొయెంకా టీమ్‌కు ఎవరు కెప్టెన్‌గా ఉన్నా ఇలాంటి వార్నింగ్‌లు తప్పవంటూ ఫన్నీ మీమ్స్ సోషల్ మీడియాలో కనిపిస్తోన్నాయి. అప్పుడు రాహుల్, ఇప్పుడు పంత్ గొయెంకాకు బలయ్యారంటూ చెబుతోన్నారు. బ్యాటింగ్‌లో, కెప్టెన్సీతో పాటు వికెట్ కీపింగ్‌లో అంచనాలకు తగ్గట్లుగా రాణించలేకపోయినా రిషబ్ పంత్‌కు గొయెంకా వార్నింగ్ ఇచ్చినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా పంత్ బ్యాటింగ్ విషయంలో గొయెంకా అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఐపీఎల్ మెగా వేలంలో పంత్‌ను 27 కోట్లు పెట్టి లక్నో టీమ్ కొనుగోలు చేసింది. ఐపీఎల్ హిస్టరీలోనే కాస్ట్‌లీ ప్లేయర్‌గా పంత్ నిలిచాడు. అన్ని కోట్లు పెట్టి కొంటే తొలి మ్యాచ్‌లోనే పంత్ డకౌట్ అయ్యాడు. ఆరు బాల్స్ ఎదుర్కొన్న పంత్ ఒక్క పరుగు కూడా చేయకుండానే కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరుకున్నాడు. అఖరి ఓవర్‌లో మోహిత్ శర్మ స్టంప్ ఔట్ చేసే అవకాశం పంత్‌కు వచ్చింది. కానీ ఆ ఛాన్స్‌ను మిస్ చేసుకున్నాడు. పంత్ తప్పులను ఎత్తిచూపుతూ అతడికి గొయెంకా వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.
గత ఏడాది లక్నో కెప్టెన్‌గా వ్యవహరించిన కేఎల్ రాహుల్‌పై స్టేడియంలోనే ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు సంజీవ్ గొయెంకా. అతడి తీరుపై అప్పట్లో విమర్శలొచ్చాయి. ఆ తర్వాత లక్నో జట్టును వీడాడు రాహుల్. ఈ ఏడాది ఐపీఎల్‌లో ఢిల్లీ టీమ్ అతడిని కొనుగోలు చేసింది.
సంబంధిత కథనం