భారత మాజీ ఆల్‌రౌండర్ సంజయ్ బంగర్ కుమార్తె అనయ బంగర్ సంచలన వ్యాఖ్యలు చేసింది. లైంగిక వేధింపులకు గురయ్యానని వెల్లడించి బాంబ్ పేల్చింది. ప్రముఖ క్రికెటర్లు తనకు నగ్న చిత్రాలు పంపారని సంచలన ఆరోపణలు చేసింది. ఓ వెటరన్ క్రికెటర్ తనతో పడుకోవాలని కోరుకుంటున్నానని చెప్పాడని ఆమె పేర్కొంది. అనయ బంగర్ లింగ (జెండర్) మార్పిడి ఆపరేషన్ చేయించుకుని అబ్బాయి నుంచి అమ్మాయిగా మారింది.
హార్మోన్ రిప్లేస్‌మెంట్ థెరపీ, లింగ పునర్నిర్మాణ శస్త్రచికిత్స తర్వాత తన లుక్ గురించి మాట్లాడిన అనయ.. ద లలన్ టాప్ ఇంటర్వ్యూలో సంచలన విషయాలు బయటపెట్టింది. మొదట ఆర్యన్ గా పెరిగిన ఆమె.. అబ్బాయితో కలిసి ఏజ్ గ్రూప్ క్రికెట్ కూడా ఆడింది.
“నేను ఎనిమిది లేదా తొమ్మిది ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అమ్మ దుస్తులు తీసుకుని వేసుకునేదాన్ని. అద్దంలో చూసుకుని 'నేను అమ్మాయిని. నేను అమ్మాయిగా ఉండాలనుకుంటున్నా' అని అనుకునే దాన్ని’ అని అనయ పేర్కొంది.
“ముషీర్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్, యశస్వి జైస్వాల్ లాంటి ప్రముఖ క్రికెటర్లతో కలిసి ఆడా. కానీ నాన్న ఫేమస్ పర్సనాలిటీ కావడంతో ప్రైవసీ మెయింటేన్ చేయాల్సి వచ్చేది. జెండర్ మార్పిడి తర్వాత కొంతమంది క్రికెటర్లు నన్ను లైైంగికంగా వేధించారు. నాకు నగ్న చిత్రాలు పంపించారు. ముఖ్యంగా ఓ వ్యక్తి పక్కన కూర్చొని ఫొటోలు అడిగేవాడు.
నా పరిస్థితి గురించి ఒక వెటరన్ క్రికెటర్‌కు చెప్పా. అతనేమో ‘కారులో వెళ్దాం, నీతో పడుకోవాలని ఉంది’ అని డైరెక్ట్ గానే చెప్పేవాడు’’ అని అనయ వెల్లడించింది.
తండ్రి సంజయ్ బంగర్ లాగే అనయ కూడా స్థానిక క్లబ్ క్రికెట్ లో ఇస్లాం జింఖానాకు ఆడింది. అంతే కాకుండా లెస్టర్‌షైర్‌లోని హింక్లీ క్రికెట్ క్లబ్‌కు కూడా ప్రాతినిథ్యం వహించింది. అయితే ఐసీసీ తీసుకున్న నిర్ణయంపై మాత్రం అనయ తీవ్ర నిరాశ వ్యక్తం చేసింది. ట్రాన్స్‌జెండర్ క్రీడాకారులను మహిళల క్రికెట్ ఆడటానికి అనుమతించబోమని ఐసీసీ ప్రకటించింది.
ట్రాన్స్ మహిళల కోసం క్రికెట్లో రూల్స్ తీసుకురావాలని అనయ డిమాండ్ చేసింది. అథ్లెట్లు కెరీర్, గుర్తింపు మధ్య నలిగిపోకుండా ఉండేలా నిబంధనలు తయారు చేయాలని ఆమె కోరింది. ప్రస్తుతం యూకేలోని మాంచెస్టర్ లో అనయ ఉంటున్నట్లు తెలిసింది.
సంబంధిత కథనం