Team India Cricketer: ఈ తమిళ యాక్టర్ ఒకప్పుడు టీమిండియా ఓపెనర్ - విశాల్ మధగజరాజాలో నటించిన క్రికెటర్ ఎవరంటే?
Team India Cricketer: సంక్రాంతికి రిలీజై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన మధగజరాజా మూవీలో ఓ టీమిండియా క్రికెటర్ నటించాడు. అతడు మరెవరో కాదు. శఠగోపన్ రమేష్. 1999 -2001 మధ్యకాలంలో టీమిండియా తరఫున వన్డేలు, టెస్ట్‌లు ఆడాడు రమేష్. ఓపెనర్‌గా పలు మ్యాచుల్లో రాణించాడు.
శఠగోపన్ రమేష్ నేటితరం క్రికెట్ అభిమానులకు ఈ పేరు పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు. 1999 - 2001 మధ్యకాలంలో టీమిండియా తరఫున పలు టెస్టులు, వన్డేలు ఆడాడు. టీమిండియాకు ఓపెనర్‌గా, హాఫ్ స్పిన్సర్‌గా అద్భుత విజయాల్ని సాధించిపెట్టాడు. టీమిండియా తరఫున 19 టెస్ట్‌లు, 24 వన్డేలు మాత్రమే ఆడాడు.

టాలెంట్ ఉన్నా సరిగ్గా అవకాశాలు రాకపోవడంతో అర్ధాంతరంగా క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన శఠగోపన్ రమేష్ ఆ తర్వాత యాక్టర్‌గా మారాడు. విశాల్ హీరోగా సంక్రాంతికి రిలీజై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన తమిళ మూవీ మధగజరాజాలో శఠగోపన్ రమేష్ కీలక పాత్రలో నటించాడు.
ఓపెనర్‌గా...
1999లో పాకిస్థాన్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌తో టీమిండియాలోకి శఠగోపన్ రమేష్ ఎంట్రీ ఇచ్చాడు. ఓపెనర్‌గా బరిలో దిగిన రమేష్ సిరీస్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ తర్వాత శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టాడు. 1999 ఏడాదిలోనే పెప్సీ కప్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన ఐదో వన్డే ద్వారా యాభై ఓవర్ల క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు.
1999 వన్డే వరల్డ్ కప్‌లో...
1999 వన్డే వరల్డ్ కప్‌లో చోటు దక్కించుకున్నాడు రమేష్. వెస్టిండీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే తాను వేసిన మొదటి బాల్‌కే వికెట్ తీసి చరిత్రను సృష్టించాడు. వన్డేల్లో ఫస్ట్ బాల్‌కే వికెట్ తీసిన తొలి ఇండియన్ బౌలర్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత సౌతాఫ్రికాతో జరిగిన ఎల్‌జీ కప్‌లో రమేష్ ఆడాడు. చివరగా 2001లో శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో రమేష్ కనిపించాడు.
ఈ సిరీస్‌లో బ్యాటర్‌గా, బౌలర్‌గా రమేష్ రాణించాడు. కానీ ఈ సిరీస్‌లో టీమిండియా చిత్తుగా ఓడటంతో అతడిని సెలెక్టర్లు జట్టు నుంచి తప్పించారు. చివరి టెస్ట్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో నలభై ఏడు, సెకండ్ ఇన్నింగ్స్‌లో 55 పరుగులు చేశాడు శఠగోపన్ రమేష్.
మొత్తంగా 19 టెస్టుల్లో రెండు సెంచరీలు, ఎనిమిది హాఫ్ సెంచరీలతో 1367 పరుగులు, 24 వన్డేల్లో ఆరు హాఫ్ సెంచరీలతో 646 రన్స్ చేశాడు.
హీరోగా...
అవకాశాలు రాకపోవడంలో క్రికెట్ కెరీర్‌కు అర్ధాంతరంగా గుడ్‌బై చెప్పిన రమేష్ ఆ తర్వాత యాక్టర్‌గా మారాడు. పోట్టా పోట్టీ అనే తమిళ మూవీలో హీరోగా నటించాడు. క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీ 2011లో రిలీజైంది. జయం రవి హీరోగా అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయికి రీమేక్‌గా తెరకెక్కిన సంతోష్ సుబ్రమణియమ్ అనే తమిళ మూవీలోనెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్రలో కనిపించాడు.
మధగజరాజాలో…
విశాల్ హీరోగా సంక్రాంతికి రిలీజై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన మధగజరాజాలో సబ్ కలెక్టర్ పాత్రలో శఠగోపన్ రమేష్ నటించాడు. తమిళంలో యాభై కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ ఇటీవలే తెలుగులో రిలీజైంది.