Sachin Tendulkar Statue: గ్రాండ్‍గా సచిన్ టెండూల్కర్ భారీ విగ్రహం ఆవిష్కరణ: వీడియో
Sachin Tendulkar Statue: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సచిన్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వివరాలివే..
Sachin Tendulkar Statue: భారత గ్రేటెస్ట్ క్రికెటర్, దిగ్గజ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ విగ్రహావిష్కణ ఘనంగా జరిగింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో టెండూల్కర్ విగ్రహాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) ఏర్పాటు చేసింది. సచిన్ విగ్రహావిష్కణ కార్యక్రమం నేడు (నవంబర్ 1) గ్రాండ్‍గా జరిగింది. సచిన్ టెండూల్కర్ ఐకానిక్ షాట్ ఆడుతున్నట్టు ఈ విగ్రహం ఉంది.
తన విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సచిన్ టెండూల్కర్ హాజరయ్యారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‍నాథ్ షిండే, బీసీసీఐ సెక్రటరీ జైషా, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, ఎన్‍సీపీ చీఫ్, ఐసీసీ మాజీ చీఫ్ శరద్ పవార్, ఎంసీఏ అధ్యక్షుడు అమోల్ కాలే ఈ విగ్రహావిష్కణ కార్యక్రమంలో పాల్గొన్నారు. సచిన్ టెండూల్కర్ స్టాండ్ పక్కనే ఈ సచిన్ ప్రత్యేక విగ్రహాన్ని ఏంసీఏ ఏర్పాటు చేసింది.
సచిన్ టెండూల్కర్ భార్య అంజలి, కూతురు సారా కూడా ఈ ప్రత్యేక కార్యక్రమానికి వచ్చారు. సచిన్ హోమ్ గ్రౌండ్‍లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సచిన్ తన అద్భుతమైన కెరీర్లో ఎక్కువ క్రికెట్ వాంఖడేలోనే ఆడారు. 2011 ప్రపంచకప్ టైటిల్‍ను కూడా ఇదే గ్రౌండ్‍లో చేతబట్టారు టెండూల్కర్.
క్రికెట్ దేవుడిగా సచిన్ టెండూల్కర్‌ను భావిస్తారు. అంతర్జాతీయ క్రికెట్‍లో వంద శతకాలు చేసిన తొలి, ఏకైక ప్లేయర్‌గా సచిన్ టెండూల్కర్ పేరిట అనన్య సామాన్యమైన రికార్డు ఉంది.
1989లో 16 ఏళ్ల వయసులో టీమిండియా తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశారు సచిన్ టెండూల్కర్. 24 ఏళ్ల పాటు భారత్‍కు ఎన్నో విజయాలను విజయాలను అందించారు. లెక్కకు మిక్కిలి రికార్డులను సాధించారు. 2013లో ఆయన అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అయ్యారు.
తన అద్భుతమైన కెరీర్లో 200 టెస్టు మ్యాచ్‍లు ఆడిన సచిన్ టెండూల్కర్ 51 శతకాలు సహా మొత్తంగా 15,921 పరుగులు చేశారు. 463 వన్డేల్లో 18,426 పరుగులు చేశారు. వన్డేల్లో 49 శతకాలు సాధించారు. అత్యధిక అంతర్జాతీయ పరుగులు, అంతర్జాతీయ సెంచరీల రికార్డులు ఇప్పటికీ సచిన్ టెండూల్కర్ పేరిటే ఉన్నాయి. ఆయన నెలకొల్పిన చాలా రికార్డులు బద్దలవడం కూడా చాలా కష్టమే.
కాగా, ప్రస్తుతం జరుగుతున్న వన్డే ప్రపంచకప్‍లో భాగంగా రేపు (నవంబర్ 2)న వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో టీ్మిండియా తలపడనుంది.