Sachin on IND vs PAK Match: అక్టోబ‌ర్ 14 కోసం వెయిటింగ్ - ఇండియా, పాక్ మ్యాచ్‌పై స‌చిన్ ట్వీట్ వైర‌ల్‌-sachin tendulkar interesting tweet on india vs pakistan match in world cup ,cricket న్యూస్
తెలుగు న్యూస్  /  Cricket  /  Sachin Tendulkar Interesting Tweet On India Vs Pakistan Match In World Cup

Sachin on IND vs PAK Match: అక్టోబ‌ర్ 14 కోసం వెయిటింగ్ - ఇండియా, పాక్ మ్యాచ్‌పై స‌చిన్ ట్వీట్ వైర‌ల్‌

Nelki Naresh Kumar HT Telugu
Oct 12, 2023 09:38 AM IST

Sachin on IND vs PAK Match: ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌ను ఉద్దేశించి మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ చేసిన ట్వీట్ వైర‌ల్ అవుతోంది. ఈ మ్యాచ్ కోసం తాను వెయిటింగ్ అంటూ స‌చిన్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నాడు.

స‌చిన్ టెండూల్క‌ర్
స‌చిన్ టెండూల్క‌ర్

Sachin on IND vs PAK Match: రోహిత్ శ‌ర్మ రికార్డ్ సెంచ‌రీలో వ‌ర‌ల్డ్ క‌ప్‌లో రెండో విక్ట‌రీని త‌న ఖాతాలో వేసుకున్న‌ది టీమిండియా. బుధ‌వారం ఆఫ్ఘ‌నిస్తాన్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శ‌ర్మ కేవ‌లం 66 బాల్స్‌లోనే సెంచ‌రీ సాధించాడు. వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఫాస్టెస్ట్ సెంచ‌రీని న‌మోదు చేశాడు. అంతే కాకుండా వ‌ర‌ల్డ్ క‌ప్‌లో అత్య‌ధిక సెంచ‌రీలో చేసిన టీమిండియా ఆట‌గాడిగా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శ‌ర్మ 84 బాల్స్‌లో ప‌ద‌హారు ఫోర్లు, ఐదు సిక్స‌ర్ల‌తో 131 ర‌న్స్ చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

రోహిత్ శ‌ర్మ‌తో పాటు బుమ్రా కూడా నాలుగు వికెట్లు తీసి ఆఫ్ఘ‌నిస్తాన్‌కు అడ్డుక‌ట్ట‌వేశాడు. రోహిత్‌, బుమ్రాపై మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ ప్ర‌శంస‌లు కురిపించాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్‌, బుమ్రా అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌ను క‌న‌బ‌రిచార‌ని, త‌మ ఆట‌తీరుతో ఆక‌ట్టుకున్నార‌ని స‌చిన్ ట్వీట్ చేశాడు. మిగిలిన ఆట‌గాళ్ల నుంచి రోహిత్‌, బుమ్రాల‌కు చ‌క్క‌టి మ‌ద్ధ‌తు ల‌భించింద‌ని, ఆ స‌మిష్టి త‌త్వ‌మే టీమిండియా విజ‌యానికి దోహ‌ద‌ప‌డింద‌ని తెలిపాడు.

వ‌ర‌ల్డ్ క‌ప్ రెండు మ్యాచ్‌ల‌లో ఒక‌రిపైనే భారం ప‌డ‌కుండా వేర్వేరు ఆట‌గాళ్లు రాణించ‌డం శుభ‌ప‌రిణామ‌మ‌ని, పాకిస్థాన్‌పై విజ‌యానికి ఇది ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంద‌ని స‌చిన్ తెలిపాడు. అక్టోబ‌ర్ 14న జ‌రుగ‌నున్న ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ కోసం తాను ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న‌ట్లు స‌చిన్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నాడు. అత‌డి ట్వీట్ వైర‌ల్‌గా మారింది.

అక్టోబ‌ర్ 14న అహ్మ‌దాబాద్ వేదిక‌గా ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ జ‌రుగ‌నుంది. వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఇండియా, పాకిస్థాన్ రెండేసి విజ‌యాల‌తో స‌మిష్టిగా ముందంజ‌లో ఉన్నాయి.

WhatsApp channel