MS Dhoni: ధోనీతో నాకు విభేదాలు ఉన్నాయి.. గంభీర్‍కు వరల్డ్ కప్ విన్నర్ స్ట్రాంగ్ కౌంటర్-s sreesanth counter to gautam gambhir comments regarding ms dhoni ,cricket న్యూస్
Telugu News  /  Cricket  /  S Sreesanth Counter To Gautam Gambhir Comments Regarding Ms Dhoni

MS Dhoni: ధోనీతో నాకు విభేదాలు ఉన్నాయి.. గంభీర్‍కు వరల్డ్ కప్ విన్నర్ స్ట్రాంగ్ కౌంటర్

Sanjiv Kumar HT Telugu
Sep 23, 2023 10:00 AM IST

Sreesanth Counter To Gautam Gambhir: టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని గురించి ఏమాత్రం పరిచయం లేదు. తాజాగా ఆయనతో విభేదాలు ఉన్నాయంటూ చెబుతూ గౌతమ్ గంభీర్‍కు కౌంటర్ ఇచ్చాడు వరల్డ్ కప్ విజేత, మాజీ పేసర్ శ్రీశాంత్.

ధోనీతో నాకు విభేదాలు ఉన్నాయి.. గంభీర్‍కు వరల్డ్ కప్ విన్నర్ స్ట్రాంగ్ కౌంటర్
ధోనీతో నాకు విభేదాలు ఉన్నాయి.. గంభీర్‍కు వరల్డ్ కప్ విన్నర్ స్ట్రాంగ్ కౌంటర్

మిస్టర్ కూల్ కెప్టెన్‍గా పేరు తెచ్చుకున్న మహేంద్ర సింగ్ ధోని కొన్నిసార్లు విమర్శపాలు కూడా అయ్యాడు. మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ధోని.. జట్టు కోసం కఠిన నిర్ణయాలు, మైదానంలో వ్యూహాలతో పక్కా ప్లాన్స్ వేశాడు. అందులో భాగంగానే పలు విమర్శలు ఎదుర్కొన్నాడు. ఒకప్పటి స్టార్ ఆల్‍రౌండర్ యువరాజ్ సింగ్‍కు ధోని అన్యాయం చేశాడంటూ అతని తండ్రి యోగ్‍రాజ్ బహరిరంగంగానే సీరియస్ అయ్యారు.

ట్రెండింగ్ వార్తలు

ఒక్కరూ కూడా చెప్పలేరు

ఇదిలా ఉంటే తాజాగా మహేంద్ర సింగ్ ధోనితో తనకు మనస్పర్థలు వచ్చిన విషయం నిజమేనంటూ మాజీ పేసర్ శ్రీశాంత్ స్పోర్ట్స్ క్రీడాతో తెలిపాడు. "ధోని భాయ్‍తో నాకు విభేదాలున్న మాట నిజమే. కానీ, క్రికెట్ పరంగా గత కొన్నేళ్లలో మనం సాధించిన విజయాలను చూస్తే ధోని తమకు సపోర్ట్ గా నిలవలేదని ఒక్క ఆటగాడు కూడా చెప్పలేడు. కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితుల కారణంగా కెప్టెన్ కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. సారథ్య బాధ్యతలు మోయడం అంత తేలికేం కాదు" అని శ్రీశాంత్ తెలిపాడు.

ధోనినే మొదలు పెట్టాడు

"నేను మాట్లాడే మాటలు వివాదానికి దారి తీయొచ్చు. చాలా మంది.. అదేంటి ఒకరిద్దరు గురించే ఎక్కువగా మాట్లాడతారు. జట్టు మొత్తం కలిస్తేనే కదా విజయాలు సాధించేదని అంటూ ఉంటారు. కానీ, ధోని ఎప్పుడూ తాను లైమ్‍లైట్‍లోకి రావాలనుకోలేదు. జట్టునే ముందుంచేవాడు. అంతేకాదు జట్టులోకి వచ్చిన కొత్త వాళ్ల చేతికే ట్రోఫీని ఇచ్చే సాంప్రదాయాన్ని కూడా తనే మొదలు పెట్టాడు. జట్టు బాగుంటే చాలని ధోని భావిస్తాడు" అని శ్రీశాంత్ పేర్కొన్నాడు.

అవసరం లేకుండా పోదు

"మేము రెండుసార్లు వరల్డ్ కప్ గెలవడంలో ప్రతి ఒక్క ఆటగాడి పాత్ర ఉంది. ఇది ఎవరూ కాదనలేని సత్యం. అయితే, షిప్‍లో ఎంతమంది సెలబ్రిటీలు ఉన్నా.. దాన్ని గమ్య స్థానానికి చేర్చడంలో కెప్టెన్‌దే ప్రధాన పాత్ర కదా. ఫ్లైట్‍లో ఆటోపైలట్ ఆప్షన్ ఉన్నంతమాత్రాన పైలట్ అవసరం లేకుండా పోదు కదా" అని శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు. అయితే, 2007, 2011 వరల్డ్ కప్‍లో తామంతా కష్టపడినా ధోనికే ఎక్కువ క్రెడిట్ వచ్చిందని గౌతమ్ గంభీర్ అన్న విషయం తెలిసిందే.

గంభీర్‍కు కౌంటర్

గౌతమ్ గంభీర్ మాటలకు కౌంటర్‌‍గా శ్రీశాంత్ వ్యాఖ్యలు ఉన్నాయని టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే, ధోని సారథ్యంలో 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో శ్రీశాంత్ కూడా ఉన్న విషయం తెలిసిందే. టీ20 ఫైనల్‍లో పాక్ ప్లేయర్ మిస్బా ఉల్ హక్ ఇచ్చిన క్యాచ్ పట్టి ఇండియా విజయానికి దగ్గర చేయడంలో శ్రీశాంత్ కీ రోల్ ప్లే చేశాడు.

WhatsApp channel
వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ లేటెస్ట్ అప్‌డేట్స్ చూడండి  Cricket News  అలాగే  Live Score  ఇంకా Telugu News  మరెన్నో క్రికెట్ న్యూస్ హిందుస్తాన్ టైమ్స్ లో చూడండి.