ICC World Cup Team: ఐసీసీ వరల్డ్ కప్ టీమ్‌లో ఆరుగురు ఇండియన్ క్రికెటర్స్ - కోహ్లికి నో ఛాన్స్!
ICC World Cup Team: టీ20 వరల్డ్ కప్ టీమ్‌ను ఐసీసీ అనౌన్స్ చేసింది. ఈ టీమ్‌లో భారత జట్టు నుంచి ఆరు క్రికెటర్లకు స్థానం దక్కంది. ఆఫ్గానిస్తాన్ నుంచి ముగ్గురు క్రికెటర్లు చోటు దక్కించుకున్నారు.
ICC World Cup Team: టీ20 వరల్డ్ కప్ టీమ్‌ను ఐసీసీ అనౌన్స్‌చేసింది. వరల్డ్ కప్‌లో బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో మెరిసిన పదకొండు మంది క్రికెటర్లతో కూడిన జట్టును ప్రకటించింది. ఐసీసీ టీమ్‌లో భారత్ నుంచి ఆరుగురు క్రికెటర్లకు స్థానం దక్కింది. బ్యాటర్ల లిస్ట్‌లో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, ఆల్‌రౌండర్ల కోటా నుంచి హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్ చోటు దక్కించుకున్నారు. బౌలర్ల జాబితా నుంచి బుమ్రా, అర్షదీప్ సింగ్ స్థానం సంపాదించుకున్నారు.
ఒకే ఒక్క ప్లేయర్...
టీ20 వరల్డ్ కప్‌లో ఫైనల్‌లో టీమిండియా చేతిలో ఓటమి పాలైన సౌతాఫ్రికా నుంచి ఐసీసీ టీమ్‌లో ఒకే ఒక్క ప్లేయర్‌కు ఛాన్స్ దక్కింది. అది కూడా పన్నెండో ప్లేయర్‌గా సౌతాఫ్రికా పేసర్ ఆన్రీచ్ నోర్జ్‌ను ఐసీసీ ప్రకటించింది.
ఆఫ్గానిస్తాన్ నుంచి ముగ్గురు...
టీమిండియా తర్వాత ఐసీసీ టీమ్‌లో ఆఫ్గానిస్తాన్ నుంచి ముగ్గురు క్రికెటర్లు చోటు దక్కించుకున్నారు. రహ్మనుల్లా గుర్బాజ్, రషీద్ ఖాన్, ఫజల్ హక్ ఫరూఖీ లకు ఐసీసీ తన టీమ్‌లో చోటు కల్పించింది. ఆస్ట్రేలియా నుంచి మార్కస్ స్టాయినిస్, వెస్టెండీస్ నుంచి నికోలస్ పూరన్‌కు మాత్రమే ఐసీసీ టీమ్‌లో చోటు దక్కింది. మిగిలిన జట్ల నుంచి ఒక్కరికి కూడా ఐసీసీ టీమ్‌లో స్థానం దక్కలేదు.
రోహిత్ సెకండ్ ప్లేస్....
ఈ వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ 255 పరుగులతో అదరగొట్టాడు. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో ఆఫ్గానిస్తాన్ ఓపెనర్ రహ్మనుల్లా గుర్భాజ్ (281 పరుగులు)లతో టాప్ ప్లేస్‌లో కొనసాగుతోన్నాడు.
అర్షదీప్ సింగ్, బుమ్రా...
2024 టీ20 వరల్డ్ కప్‌లో ఆఫ్గానిస్తాన్ పేసర్ ఫజల్‌హక్ ఫరూఖీ పదిహేడు వికెట్లు తీశాడు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా టాప్ ప్లేస్‌లో నిలిచాడు. ఫజల్ హక్‌తో సమానంగా పదిహేడు వికెట్లు తీసిన టీమిండియా పేసర్ అర్షదీప్ సింగ్ సెకండ్ ప్లేస్‌లో నిలిచాడు.
పదిహేను వికెట్లతో బుమ్రా మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. బెస్ట్ బౌలింగ్ రికార్డ్ కూడా ఫరూఖీ పేరు మీదనే నమోదు అయ్యింది. ఉగాండతో జరిగిన మ్యాచ్‌లో ఫరూఖీ తొమ్మిది పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు తీసుకున్నాడు. భారత్ నుంచి అర్షదీప్ అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన చేశాడు. అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో తొమ్మిది పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. అర్షదీప్, బుమ్రా కలిసి పలు మ్యాచుల్లో టీమిండియాకు విజయాన్ని అందించారు.
ఫైనల్‌లో...
ఫైనల్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా విజయానికి ఐదు ఓవర్లలో ముప్పై పరుగులు అవసరమైన తరుణంలో బుమ్రా, అర్షదీప్‌తో పాటు హార్దిక్ పాండ్య కలిసి సౌతాఫ్రికాను కట్టడి చేశారు.
ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 176 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 169 పరుగులు మాత్రమే చేసింది ఏడు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఫైనల్‌లో కోహ్లి 76 పరుగులతో టీమిండియా గౌరవప్రదమైన స్కోరు అందించాడు. బౌలింగ్‌లో పాండ్య మూడు, అర్షదీప్, బుమ్రా తలో రెండు వికెట్లు తీసుకున్నారు.