Rohit century: కటక్ లో హిట్ మ్యాన్ అటాక్.. 16 నెలల తర్వాత రోహిత్ వన్డే హండ్రెడ్.. సిక్సర్లతో దూకుడు
Rohit century: కటక్ లో ఇంగ్లండ్ బౌలర్లపై హిట్ మ్యాన్ అటాక్ కు దిగాడు. ఫెంటాస్టిక్ సెంచరీతో అదరగొట్టాడు. సెన్సేషనల్ బ్యాటింగ్ తో ఫ్యాన్స్ ను అలరించాడు. రెండో వన్డేలో ఛేదనలో సిక్సర్ల మీద సిక్సర్లు బాదుతున్నాడు.

హిట్ మ్యాన్ సెంచరీ
రోహిత్ సాధించాడు. వన్డేల్లో శతక నిరీక్షణకు తెరదించాడు. తన స్టైల్లో సెన్సేషనల్ బ్యాటింగ్ తో సెంచరీ అందుకున్నాడు. 16 నెలల తర్వాత వన్డేలో శతకం చేశాడు. కటక్ లో ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో వన్డేలో ఛేదనలో రోహిత్ హండ్రెడ్ మార్క్ ను చేరుకున్నాడు. అది కూడా సిక్సర్ తో కావడం విశేషం. వన్డేల్లో రోహిత్ కు ఇది 32వ సెంచరీ. హిట్ మ్యాన్ క్రీజులో టైమ్ గడిపితే ఎలా ఉంటుందో మరోసారి చూపించాడు. 76 బంతుల్లోనే 7 సిక్సర్లు, 9 ఫోర్లతో సెంచరీ చేశాడు.
16 నెలల తర్వాత
దాదాపు 16 నెలల తర్వాత హిట్ మ్యాన్ వన్డేల్లో సెంచరీ అందుకున్నాడు. చివరగా 2023 అక్టోబర్ 11న దిల్లీలో అఫ్గానిస్థాన్ పై వన్డే శతకం చేశాడు. మళ్లీ ఇన్నాళ్లకూ 50 ఓవర్ల ఫార్మాట్లో హండ్రెడ్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఒకప్పటి రోహిత్ లా బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. అతను ఫోర్లు, సిక్సర్లు కొడుతుంటే స్టేడియంలోని ఫ్యాన్స్ తో పాటు టీవీలు, ఫోన్ల ముందు ఫ్యాన్స్ కూడా ఎగిరి గంతులు వేశారు.
సిక్సర్ల శర్మ
వరుస ఫెయిల్యుర్ నుంచి బయట పడాలనే పట్టుదలతో ఈ ఛేదనను హిట్ మ్యాన్ ప్రారంభించాడు. అట్కిన్సన్ బౌలింగ్ లో మిడ్ వికెట్ మీదుగా ఫ్లిక్ తో కొట్టిన సిక్సర్.. ఆ వెంటనే మహ్మూద్ బౌలింగ్ లో లాఫ్టెడ్ షాట్ తో కవర్స్ దిశగా కొట్టిన సిక్సర్ ఆకట్టుకున్నాయి. మహ్మూద్ వేసిన మరో ఓవర్లోనే రోహిత్ బంతిని స్టాండ్స్ లో పడేశాడు. ఆ తర్వాతా సిక్సర్ల వేట కొనసాగించాడు. మార్క్ వుడ్ బౌలింగ్ లో బంతిని పిక్ చేసి స్టాండ్స్ లోపడేసిన తీరు చూసి తీరాల్సిందే. ఆ సిక్సర్ తోనే అతను 90లోకి వెళ్లాడు. ఆ తర్వాత మరో సిక్సర్ తోనే సెంచరీ చేరుకున్నాడు.
అన్ని రకాల షాట్లు
బంతి గుడ్ లెంగ్త్ లో పడ్డ.. షార్ట్ లెంగ్త్ లో వచ్చినా.. బౌండరీ బాదడమే లక్ష్యంగా రోహిత్ బ్యాటింగ్ కొనసాగించాడు. తన ఫేవరెట్ పుల్ షాట్ తో పాటు కవర్ డ్రైవ్, లాఫ్టెడ్, స్వీప్, కట్.. ఇలా అన్ని రకాల షాట్లను పర్ ఫెక్ట్ గా ఆడాడు. కళాత్మక బ్యాటింగ్ విధ్వంసంతో ఇంగ్లండ్ బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. కచ్చితమైన టైమింగ్ తో షాట్లు కొట్టాడు. భారీ ఇన్నింగ్స్ ఆడాలని టార్గెట్ పెట్టుకుని క్రీజులో నిలబడ్డాడు. సెంచరీతో విమర్శకులకు గట్టి బదులిచ్చాడు.
సంబంధిత కథనం