Rohit Sharma vs Hardik Pandya: ముంబై ఇండియన్స్‌కు ఇద్దరు కెప్టెన్లు? రోహిత్, హార్దిక్ కొత్త వీడియో చెబుతోంది ఇదేనా?-rohit sharma hardik pandya seen together for the first time after mumbai indians captaincy change video suggests rift ,cricket న్యూస్
తెలుగు న్యూస్  /  Cricket  /  Rohit Sharma Hardik Pandya Seen Together For The First Time After Mumbai Indians Captaincy Change Video Suggests Rift

Rohit Sharma vs Hardik Pandya: ముంబై ఇండియన్స్‌కు ఇద్దరు కెప్టెన్లు? రోహిత్, హార్దిక్ కొత్త వీడియో చెబుతోంది ఇదేనా?

Hari Prasad S HT Telugu
Mar 19, 2024 10:59 AM IST

Rohit Sharma vs Hardik Pandya: ఐపీఎల్ కొత్త సీజన్ కు ముందు ముంబై ఇండియన్స్ రిలీజ్ చేసిన ఓ కొత్త టీమ్ ఆంథెమ్ వీడియో ఆసక్తి రేపుతోంది. ఈసారి టీమ్ కు ఇద్దరు కెప్టెన్లు ఉండబోతున్నారా అన్న సందేహం ఆ వీడియో ద్వారా కలుగుతోంది.

ముంబై ఇండియన్స్‌కు ఇద్దరు కెప్టెన్లు? రోహిత్, హార్దిక్ కొత్త వీడియో చెబుతోంది ఇదేనా?
ముంబై ఇండియన్స్‌కు ఇద్దరు కెప్టెన్లు? రోహిత్, హార్దిక్ కొత్త వీడియో చెబుతోంది ఇదేనా?

Rohit Sharma vs Hardik Pandya: ఐపీఎల్ 2024లో అభిమానులకు ఎంతగానో ఆసక్తి రేపుతున్న టీమ్ ముంబై ఇండియన్స్. తమకు ఐదు టైటిల్స్ అందించిన మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ రోహిత్ శర్మ జట్టులో ఉండగానే అతన్ని తప్పించి హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించారు. దీంతో ఈ సీజన్ లో ఆ టీమ్ ప్రదర్శన ఎలా ఉండనుందో అన్న ఆసక్తి నెలకొంది. ఇక తాజాగా ఆ ఫ్రాంఛైజీ రిలీజ్ వీడియో ఈ ఆసక్తిని రెట్టింపు చేసింది.

ట్రెండింగ్ వార్తలు

రోహిత్, హార్దిక్ ఒకే సోఫాపై..

ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్ ఓ కొత్త టీమ్ ఆంథెమ్ సాంగ్ రిలీజ్ చేసింది. సోమవారం (మార్చి 18) తమ సోషల్ మీడియా ద్వారా ఈ వీడియోను అభిమానుల ముందుకు తీసుకొచ్చింది. తన కెప్టెన్సీలో ఆడటానికి రోహిత్ శర్మకు ఇబ్బందేమీ ఉండదని హార్దిక్ పాండ్యా కామెంట్ చేసిన కాసేపటికే ఈ వీడియో బయటకు వచ్చింది.

ఇందులో ముంబై ఇండియన్స్ టీమ్ లోని సభ్యులంతా కనిపిస్తారు. కెప్టెన్సీ మార్పు తర్వాత తొలిసారి రోహిత్, హార్దిక్ కలిసి కనిపించింది కూడా ఈ వీడియోలోనే. మొదట ఫ్రాంఛైజీ మెంటార్ సచిన్ టెండూల్కర్, ఓనర్ నీతా అంబానీ కలిసి చిన్నారులతో కలిసి పాట పాడుతున్న సీన్ తో ఈ వీడియో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత టీమ్ లోని ప్లేయర్ ఒక్కొక్కరుగా కనిపిస్తారు. మొదట ఈ వీడియో అంతా సరదాగా సాగిపోతుంది.

అయితే చివరి ఫ్రేమ్ లో టీమంతా ఒకే చోట ఫొటోకు పోజు ఇస్తుంది. ఇందులో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా ఒకే సోఫా చెరొక చివరన చాలా సీరియస్ గా కూర్చొని కనిపించారు. ఇదే అభిమానులను గందరగోళంలోకి నెట్టేసింది. ఈ ఇద్దరికీ ముంబై ఇండియన్స్ సమ ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా ఈ ఫొటో చూస్తే స్పష్టమవుతోంది. అయితే ఈ సీజన్లో ఈ ఇద్దరూ ముంబైకి కెప్టెన్లుగా ఉంటారా అన్న సందేహం కూడా కొందరు అభిమానులు వ్యక్తం చేయడం గమనార్హం.

మిగతా సభ్యుల్లో కొందరు పక్కన కుర్చీలపై కూర్చొని, వెనుక నిల్చొని కనిపించారు. రోహిత్, హార్దిక్ మాత్రం ఒకే సోఫాపై కూర్చున్నారు. తమకు ఐదు టైటిల్స్ అందించిన రోహిత్ శర్మకు ఇప్పటికీ కెప్టెన్ తో సమాన గౌరవం ఇస్తున్నట్లు ఈ ఫొటో స్పష్టం చేస్తోంది. అదే సమయంలో ఈ ఇద్దరి మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయా? లేక ఏమైనా విభేదాలు వచ్చాయా అన్న సందేహాలు కూడా ఈ ఫొటో చూస్తే కలుగుతున్నాయి.

అభిమానుల ఆగ్రహం

రోహిత్ శర్మ 2013 నుంచి 2023 వరకూ ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా ఉన్నాడు. ఐదుసార్లు ఆ టీమ్ ను ఛాంపియన్ గా నిలిపాడు. అలాంటి కెప్టెన్ ను ఉన్నపళంగా తొలగించి గుజరాత్ టైటన్స్ నుంచి తీసుకొచ్చిన హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వెలువడిన తర్వాత కొన్ని గంటల్లోనే ముంబై ఇండియన్స్ ఫాలోవర్లలో చాలా మంది ఆ ఫ్రాంఛైజీని అన్ ఫాలో చేశారు.

అయితే అభిమానుల అభిప్రాయాన్ని గౌరవిస్తానంటూనే.. కెప్టెన్సీ మార్పు వల్ల పెద్దగా మార్పేమీ ఉండదని, రోహిత్ కు తన కెప్టెన్సీలో ఆడటానికి ఇబ్బంది కూడా ఏమీ లేదని హార్దిక్ అనడం గమనార్హం. అంతేకాదు తన కెరీర్ మొత్తం రోహిత్ కెప్టెన్సీలోనే ఆడానని, ఇప్పుడు అతడు తనకు పూర్తి మద్దతుగా నిలుస్తాడని భావిస్తున్నట్లు హార్దిక్ చెప్పాడు.

IPL_Entry_Point