Rohit Hardik fight : రోహిత్‌ని హార్దిక్ అవమానించాడా? ఇద్దరు గొడవ పడ్డారా? వీడియో వైరల్!
Hardik Rohit fight in GT vs MI : గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ తర్వాత.. హార్దిక్ పాండ్యా- రోహిత్ శర్మలు గొడవ పడ్డారా? ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
GT vs MI highlights : ఐపీఎల్ 2024లో ఆదివారం గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ జరిగింది. చివరి 5 ఓవర్లలో 43 పరుగులు చేయలేక.. జీటీ చేతిలో ఓటమి పాలైంది ముంబై ఇండియన్స్. కెప్టెన్‌గా శుభాన్ గిల్‌కి ఇది మొదటి సక్సెస్. ఇక రోహిత్ శర్మ నుంచి బాధ్యతలు తీసుకుని, ముంబైకి తొలిసారిగా ఫుల్-టైమ్ కెప్టెన్‌గా పనిచేస్తున్న హార్దిక్ పాండ్యాకు పెద్ద డిజాస్టర్! వీటన్నింటి మధ్య.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన వారందరు..రోహిత్ శర్మ- హార్దిక్ పాండ్యాలు గొడవపడ్డారు అని అనుకుంటున్నారు.
హార్దిక్- రోహిత్ గొడవ పడ్డారా?
ఈ ఘటన.. మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ప్రకారం.. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాల మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగినట్టే కనిపిస్తోంది! రోహిత్ ఎవరితోనో మాట్లాడుతుండగా.. వెనక నుంచి హార్దిక్ పాండ్యా.. అతడిని హగ్ చేసుకున్నాడు. కానీ హార్దిక్‌ని రోహిత్ తోసేశాడు. ఆ తర్వాత ఏదో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆ వెంటనే.. హార్దిక్ ఎక్స్ప్రెషన్స్ కూడా మారిపోయాయి.
Rohit Sharma Hardik Pandya fight viral video : మరి వీరి మధ్య ఎలాంటి సంభాషణ జరిగిందో తెలియదు కానీ.. నెటిజన్లు మాత్రం.. రోహిత్- హార్దిక్‌లు గొడవ పడ్డారనే అనుకుంటున్నారు. కొందరు మాత్రం.. 'మ్యాచ్ ఓడిపోవడానికి గల కారణాలను రోహిత్.. పాండ్యాకు వివరిస్తున్నాడు' అని అంటున్నారు. మరి ఇందులో నిజం ఏదో తెలియాల్సి ఉంది.
సోషల్ మీడియోలో వైరల్‌గా మారిన రోహిత్ శర్మ- హార్దిక్ పాండ్యా గొడవకు సంబంధించిన వీడియోను ఇక్కడ చూడండి :
రోహిత్‌ని హార్దిక్ పాండ్యా అవమానించాడా?
చూస్తుంటే... హార్దిక్‌కు టైమ్ కలిసి రావడం లేదని అనిపిస్తోంది! లాస్ట్ రెండు సీజన్లు గుజరాత్ టైటాన్స్‌కి ఆడిన అతను.. ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్‌లోకి వచ్చేశాడు. అది గుజరాత్ టైటాన్స్ అభిమానులకు నచ్చలేదు. ఇక ముంబై ఇండియన్స్‌కి ఎప్పటి నుంచో కెప్టెన్‌గా ఉంటూ, టీమ్‌కి 5 ట్రోఫీలను అందించిన రోహిత్ శర్మను సారథ్య బాధ్యతలను తప్పించి, పాండ్యా చేతిలో పెట్టడం.. ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కి నచ్చలేదు. ఫలితంగా.. రెండు జట్ల అభిమానులు.. హార్దిక్ పాండ్యాను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇందుకు మ్యాచ్ మధ్యలో జరిగిన ఓ ఘటన ఓ ఉదాహరణ.
Rohit Hardik viral video : ఆదివారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ మొదట బ్యాటింగ్ చేసిన విషయం తెలిసిందే. ఓవర్ల మధ్యలో ఫీల్డింగ్ సెట్ చేశాడు హార్దిక్ పాండ్యా. రోహిత్ శర్మను లాంగ్ ఆఫ్ దగ్గరికి వెళ్లాలని చెప్పాడు. తనకే చెబుతున్నాడని రోహిత్‌కి అర్థమవ్వడానికి కాస్త సమయం పట్టింది. ఆ తర్వాత.. హార్దిక్ చెప్పిన చోట నిలబడ్డాడు రోహిత్. సాధారణంగా.. ఇంతకాలం సారథిగా ఉన్న రోహిత్, ఇప్పుడు ఒకరు చెబుతుంటే పని చేయడాన్ని అతని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. అదే సమయంలో.. రోహిత్‌కు పాండ్యా చెప్పిన తీరు నెటిజన్లకు నచ్చలేదు. రోహిత్‌ని పాండ్యా అవమానించాడని అందరు ఆరోపిస్తున్నారు.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోని ఇక్కడ చూడండి :
సంబంధిత కథనం