Rohit sharma: హిట్ మ్యాన్ ఈజ్ బ్యాక్.. స్టేడియం దద్దరిల్లేలా షాట్లు.. మెరుపు హాఫ్ సెంచరీ
Rohit sharma: హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఫామ్ లోకి వచ్చాడు. ఇంగ్లండ్ తో రెండో వన్డేలో మెరుపు సిక్సర్లతో అదరగొడుతున్నాడు. అతను చెలరేగుతుండటంతో భారత్ గెలుపు బాటలో సాగుతోంది. శుభ్ మన్ కూడా అర్ధశతకం పూర్తిచేశాడు.
రోహిత్ అంటే ఇది
రోహిత్ శర్మ అంటే పుల్ షాట్లు.. మెరుపు సిక్సర్లు.. భారీ షాట్లు. కొన్ని రోజులుగా రోహిత్ బ్యాటింగ్ లో ఇవి మిస్సవుతున్న అభిమానులు ఆదివారం (ఫిబ్రవరి 9) మాత్రం హిట్ మ్యాన్ విధ్వంసంతో కిక్కులో మునిగిపోయారు. కటక్ లో ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో వన్డేలో ఛేదనలో రోహిత్ చెలరేగిపోతున్నాడు. సిక్సర్లు, ఫోర్లతో రెచ్చిపోతున్నాడు. 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదేశాడు.
ఆరంభం నుంచి
ఇంగ్లండ్ తో ఛేదనలో రోహిత్ శర్మ ఆరంభం నుంచే భారీ షాట్లతో చెలరేగుతున్నాడు. హిట్టింగ్ చేయడమే లక్ష్యంగా క్రీజులో అడుగుపెట్టిన అతను అదే మైండ్ సెట్ తో బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే 4 సిక్సర్లు, 4 ఫోర్లు బాదాడు. పేసర్లు, స్పిన్నర్లు అనే తేడా లేకుండా బంతిని బౌండరీలు దాటిస్తున్నాడు.
ఆ ఫెయిల్యుర్ దాటి
కెప్టెన్ గా రోహిత్ వరుసగా విఫలమవుతుండటంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టుల్లో అతను దారుణమైన ప్రదర్శన చేశాడు. 3 టెస్టుల్లో 31 పరుగులు మాత్రమే చేశాడు. ఇంగ్లండ్ తో తొలి వన్డేలోనూ 2 పరుగులే సాధించాడు. దీంతో రోహిత్ రిటైరవ్వాలనే డిమాండ్లు మరింత పదునెక్కాయి. కానీ ఈ మ్యాచ్ లో ఆ ఫెయిల్యుర్ ను దాటి బ్యాటింగ్ తోనే విమర్శలకు ఆన్సరిచ్చాడు.
విక్టరీ వైపు
ఇంగ్లండ్ తో 305 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత్ గెలుపు వైపు దూసుకెళ్తోంది. ఓపెనర్లు రోహిత్, గిల్ దూకుడుగా ఆడుతూ హాఫ్ సెంచరీలతో ఛేదనలో జట్టును నడిపిస్తున్నారు. 16 ఓవర్లు ముగిసే సరికి భారత్ 127 పరుగులు చేసింది. రోహిత్ 73 పరుగులతో, గిల్ 52 పరుగులతో ఆడుతున్నారు.
సంబంధిత కథనం