T20 World Cup Team India: ఓపెనర్లుగా రోహిత్, కోహ్లీ.. యశస్వి జైస్వాల్‍కు చోటు కష్టమేనా?-rohit sharma and virat kohli to open for team india in t20 world cup yashasvi jaiswal may drop ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  T20 World Cup Team India: ఓపెనర్లుగా రోహిత్, కోహ్లీ.. యశస్వి జైస్వాల్‍కు చోటు కష్టమేనా?

T20 World Cup Team India: ఓపెనర్లుగా రోహిత్, కోహ్లీ.. యశస్వి జైస్వాల్‍కు చోటు కష్టమేనా?

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 17, 2024 03:27 PM IST

T20 World Cup 2024 Team India: టీ20 ప్రపంచకప్‍లో భారత జట్టులో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉంటారనే సమాచారం బయటికి వచ్చింది. మెగాటోర్నీకి ఆటగాళ్ల ఎంపికపై ఇటీవలే ఓ మీటింగ్ జరగగా.. కొన్ని వివరాలు వెల్లడయ్యాయి.

T20 World Cup Team India: ఓపెనర్లుగా రోహిత్, కోహ్లీ.. యశస్వి జైస్వాల్‍కు చోటు కష్టమేనా?
T20 World Cup Team India: ఓపెనర్లుగా రోహిత్, కోహ్లీ.. యశస్వి జైస్వాల్‍కు చోటు కష్టమేనా?

T20 World Cup Team India: ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టులో ఎవరికి అవకాశం లభిస్తుందనే చర్చ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. ప్రస్తుత ఐపీఎల్ 2024 సీజన్‍లో కొందరు ఆటగాళ్లు సత్తాచాటుతుండడం ఆసక్తికరంగా మారింది. 2024 టీ20 ప్రపంచకప్‍కు జట్టు ఎంపిక గురించి టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల సమావేశమయ్యారని సమాచారం బయటికి వచ్చింది. ఈ మీటింగ్‍లో చర్చించిన కొన్ని అంశాలు వెల్లడయ్యాయి.

yearly horoscope entry point

కోహ్లీకి ఛాన్స్.. రోహిత్‍తో ఓపెనింగ్

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని టీ20 ప్రపంచకప్‍కు సెలెక్టర్లు ఎంపిక చేయకపోవచ్చని గతంలో వాదనలు వినిపించాయి. అయితే, ప్రస్తుత ఐపీఎల్‍లో కోహ్లీ అద్భుతమైన ఫామ్‍లో ఉన్నాడు. ఈ సీజన్‍లో ఇప్పటి వరకు 7 మ్యాచ్‍ల్లోనే 361 పరుగులు చేశాడు. ఈ సీజన్‍లో ఓ శతకం కూడా బాదేశాడు. దీంతో భీకర ఫామ్‍లో ఉన్న కోహ్లీని ప్రపంచకప్‍కు తీసుకోవాలని సెలెక్టర్లు ఫిక్స్ అయినట్టు సమాచారం బయటికి వచ్చింది. అలాగే, ప్రపంచకప్‍లో కోహ్లీ ఉండాలని రోహిత్ కూడా కోరుకుంటున్నాడట.

దీంతో, ఈ ఏడాది జూన్‍లో జరిగే టీ20 ప్రపంచకప్‍లో విరాట్ కోహ్లీకి ప్లేస్ దక్కడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ మెగాటోర్నీలో రోహిత్ శర్మతో కలిసి కోహ్లీ ఓపెనింగ్ చేయనున్నాడని అంచనాలు ఉన్నాయి.

యశస్వికి నో ఛాన్స్.. బ్యాకప్‍గా గిల్?

ఈ ఏడాది ఇంగ్లండ్‍తో టెస్టు సిరీస్‍లో భారత యంగ్ స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ విజృంభించాడు. డబుల్ సెంచరీలతో రెచ్చిపోయాడు. అయితే, ప్రస్తుత ఐపీఎల్ సీజన్‍లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఇప్పటి వరకు 7 మ్యాచ్‍ల్లో కేవలం 121 పరుగులే చేశాడు జైస్వాల్. త్వరగా ఔటవుతూ నిరాశపరుస్తున్నాడు. ఫామ్ కోల్పోయాడు. దీంతో టీ20 ప్రపంచకప్‍కు జైస్వాల్‍ను పక్కన పెట్టాలని సెలెక్టర్లు ప్రస్తుతం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ తదుపరి మ్యాచ్‍ల్లో అద్భుత బ్యాటింగ్ చేస్తే తప్ప వరల్డ్ కప్‍లో అతడికి చోటు దక్కడం కష్టమే. ఇక, శుభ్‍మన్ గిల్‍ను బ్యాకప్ ఓపెనర్‌గా ప్రపంచకప్‍కు తీసుకోవాలని సెలెక్టర్లు భావిస్తున్నారని తెలుస్తోంది.

హార్దిక్‍కు చెప్పేశారట

ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్రస్తుత ఐపీఎల్ సీజన్‍లో పేలవంగా ఆడుతున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్‍లోనూ విఫలమవుతున్నాడు. ఒకవేళ టీ20 ప్రపంచకప్‍కు ఎంపిక కావాలంటే ఐపీఎల్‍లో బౌలింగ్‍లో నిరూపించుకోవాలని టీమిండియా సెలెక్టర్లు హార్దిక్‍కు చెప్పారట. బౌలింగ్ చేస్తేనే చోటు దక్కుతుందని సూచించారని తెలుస్తోంది. లేకపోతే హార్దిక్ పాండ్యా స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ శివమ్ దూబేను ప్రపంచకప్‍కు ఎంపిక చేసేందుకు సెలెక్టర్లు ఆలోచిస్తున్నారు. 6 మ్యాచ్‍ల్లో 163 స్ట్రైక్ రేట్‍తో 242 రన్స్ చేసి సూపర్ ఫామ్‍లో ఉన్నాడు దూబే.

ఐపీఎల్‍లో సూపర్ ఫామ్‍లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్, అసోం స్టార్ రియాన్ పరాగ్‍ను కూడా టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టులోకి సెలెక్టర్లు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సీజన్‍లో ఇప్పటి వరకు 7 మ్యాచ్‍ల్లో 318 రన్స్ చేశాడు పరాగ్. భారీ హిట్టింగ్ చేస్తూ కీలక సమయాల్లో పరుగులు సాధించాడు. కాగా, 2024 టీ20 ప్రపంచకప్ టోర్నీ జూన్ 1 నుంచి జూన్ 29 వరకు వెస్టిండీస్, అమెరికా వేదికలుగా జరగనుంది.

Whats_app_banner