india vs england 2nd odi: ఇదేందయ్యా రాహుల్.. ధిమాక్ పెట్టు హర్షిత్.. రోహిత్ కు కోపమొచ్చింది.. రివ్యూ తీసుకుంటే వికెట్!
india vs england 2nd odi: కటక్ లో ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో వన్డేలో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ కు కోపమొచ్చింది. డీఆర్ఎస్ వద్దన్న కేఎల్ రాహుల్. అది తీసుకుంటే రూట్ ఔట్.
నో డీఆర్ఎస్
ఇంగ్లండ్ తో రెండో వన్డేలో రూట్ ను త్వరగా పెవిలియన్ చేర్చే ఛాన్స్ ను టీమ్ఇండియా మిస్ చేసుకుంది. డీఆర్ఎస్ తీసుకోక చేతులారా మూల్యం చెల్లించుకుంటోంది. అక్షర్ పటేల్ బౌలింగ్ లో రూట్ వికెట్ల ముందు దొరికిపోయాడు. కానీ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. రోహిత్ డీఆర్ఎస్ తీసుకుద్దామంటే వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, అక్షర్ ఇంట్రస్ట్ చూపించలేదు.
రోహిత్ కు కోపం
ఇంగ్లాండ్ సీనియర్ బ్యాటర్ రూట్ రెండో వన్డేలో నిలకడగా ఆడుతున్నాడు. అయితే అక్షర్ వేసిన ఇన్నింగ్స్ 25వ ఓవర్ రెండో బంతిని స్వీప్ చేద్దామని చూసిన రూట్ ప్యాడ్ ను బాల్ తాకింది. ఎల్బీ కోసం గట్టిగా అప్పీల్ చేసిన అంపైర్ నాటౌటిచ్చాడు. డీఆర్ఎస్ తీసుకుందామా? అని రోహిత్ అడిగితే.. రాహుల్, అక్షర్ ఇంట్రస్ట్ చూపలేదు. కానీ ఆ తర్వాత రీప్లేలో రూట్ ఔటయ్యేవాడని కనిపించగానే రోహిత్ కోపంతో చేతులు ఎత్తి చూపించాడు.
ధిమాక్ పెట్టు
ఆ తర్వాత పేసర్ హర్షిత్ రాణాపైనా రోహిత్ అసహనం వ్యక్తం చేశాడు. ధిమాక్ పెట్టు అంటూ చేతులతో చూపించాడు. ఇన్నింగ్స్ 32వ ఓవర్ లో హర్షిత్ బౌలింగ్ లో ఓ బంతిని బట్లర్ డిఫెన్స్ ఆడాడు. రిటర్న్ వచ్చిన బంతిని హర్షిత్ వికెట్ల వైపు విసిరాడు. తీరా అది బౌండరీకి వెళ్లింది. దీంతో ధిమాక్ పెట్టు అంటూ రోహిత్ అరిచాడు.