Rohit sharma fans: కాలర్ ఎగరేసుకుంటున్నరోహిత్ ఫ్యాన్స్.. ఇది కదా హిట్ మ్యాన్ ఆట.. టీమ్, ఫ్యాన్స్ ఫుల్ ఖుష్
Rohit sharma fans: ఇన్ని రోజులు రోహిత్ శర్మ వరుస వైఫల్యాలతో నిరాశలో కుంగిపోయిన అతని అభిమానులు ఇప్పుడు కాలర్ ఎగరేస్తున్నారు. ఇంగ్లండ్ తో రెండోో వన్డేలో హిట్ మ్యాన్ సెన్సేషనల్ సెంచరీతో అటు టీమ్, ఇటు ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

ఫ్యాన్స్ టైమ్ ఆగయా
రోహిత్ శర్మ అభిమానులకు టైమ్ వచ్చింది. కాలర్ ఎగిరేస్తూ గర్వంగా తిరిగే రోజు మళ్లీ వచ్చింది. కటక్ లో ఆదివారం (ఫిబ్రవరి 9) ఇంగ్లండ్ తో రెండో వన్డేలో హిట్ మ్యాన్ ఫెంటాస్టిక్ హండ్రెడ్ తో అతని ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఆ సెంచరీ కంటే కూడా ఇంగ్లండ్ బౌలర్లపై ఫుల్ డామినెన్స్ తో రోహిత్ ఒకప్పటిలా చెలరేగడం మరింత కిక్కునిస్తోంది.
వాట్ ఏ బ్యాటింగ్
ఇంగ్లండ్ తో రెండోో వన్డేలో రోహిత్ బ్యాటింగ్ ఇండియన్ ఫ్యాన్స్ ను ఫుల్ ఎంటర్ టైన్ చేసింది. క్రీజులో అడుగుపెట్టింది మొదలు హిట్ మ్యాన్ బ్యాట్ బౌలర్ల పాలిట శాపంగా మారింది. బ్యాక్ ఫుట్ పై బలంగా నిలబడి ఫుల్ షాట్లు.. ఫ్రంట్ ఫుట్ ను సమర్థంగా వాడుతూ లాఫ్టెడ్ షాట్లు.. ఇలా బంతిని స్టాండ్స్ లో పడేయడమే లక్ష్యంగా రోహిత్ సాగాడు. ఇన్నింగ్స్ లో ఏకంగా 7 సిక్సర్లు బాదాడు. మరో 12 ఫోర్లూ కొట్టాడు.
ఆ ఫెయిల్యూర్స్
2024లో ఇండియాకు టీ20 ప్రపంచకప్ అందించిన రోహిత్ ఆ తర్వాత గడ్డు పరిస్థితులు చూశాడు. టఫ్ సిట్యువేషన్స్ ను ఫేస్ చేశాడు. బ్యాటర్ గా, కెప్టెన్ గా విఫలమయ్యాడు. ముఖ్యంగా టెస్టుల్లో తేలిపోయాడు. సొంతగడ్డపై న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ లో వైట్ వాష్, ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో ఘోర పరాభవం కలిసి రోహిత్ రిటైర్మెంట్ డిమాండ్లు ఎక్కువయ్యాయి.
సెంచరీతో జోరు
37 ఏళ్ల రోహిత్ ఇక ఆటకు గుడ్ బై చెప్తే మంచిదనే డిమాండ్లు వచ్చాయి. కెప్టెన్ ఇలా ఆడితే ఎలా అనే ప్రశ్నలు వచ్చాయి. దీంతో రోహిత్ ఫ్యాన్స్ ఆవేదనలో మునిగిపోయారు. బాధతో తల వంచుకున్నారు. కానీ ఇంగ్లండ్ తో రెండో వన్డేలో రోహిత్ తన ఇన్నింగ్స్ తో మళ్లీ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా చేశాడు.
సంబంధిత కథనం