Rishabh Pant: ‘ఔటైపో’ బ్యాటింగ్ చేస్తున్న కుల్‍దీప్‍తో పంత్.. ఆడుతూనే ముచ్చట్లు.. ప్రత్యర్థి జట్టు మీటింగ్‍లో రిషబ్-rishabh pant funny banter with kuldeep yadav during duleep trophy match and india b beat a team ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rishabh Pant: ‘ఔటైపో’ బ్యాటింగ్ చేస్తున్న కుల్‍దీప్‍తో పంత్.. ఆడుతూనే ముచ్చట్లు.. ప్రత్యర్థి జట్టు మీటింగ్‍లో రిషబ్

Rishabh Pant: ‘ఔటైపో’ బ్యాటింగ్ చేస్తున్న కుల్‍దీప్‍తో పంత్.. ఆడుతూనే ముచ్చట్లు.. ప్రత్యర్థి జట్టు మీటింగ్‍లో రిషబ్

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 08, 2024 09:11 PM IST

Rishabh Pant: దులీప్ ట్రోఫీలోనూ రిషబ్ పంత్ తన మార్క్ కామెంట్లతో అదరగొట్టాడు. కుల్దీప్ యాదవ్ బ్యాటింగ్ చేస్తుంటే వికెట్ కీపింగ్ చేస్తున్న పంత్ అతడితో ముచ్చట్లు పెట్టాడు. రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాడు. ఇది బాగా వైరల్ అవుతోంది.

Rishabh Pant: ‘ఔటైపో’ బ్యాటింగ్ చేస్తున్న కుల్‍దీప్‍తో పంత్.. ఆడుతూనే ముచ్చట్లు.. ప్రత్యర్థి జట్టు మీటింగ్‍లో రిషబ్
Rishabh Pant: ‘ఔటైపో’ బ్యాటింగ్ చేస్తున్న కుల్‍దీప్‍తో పంత్.. ఆడుతూనే ముచ్చట్లు.. ప్రత్యర్థి జట్టు మీటింగ్‍లో రిషబ్

భారత యంగ్ స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్.. ఆటతో పాటు స్లెడ్జింగ్‍లోనూ అదరగొడతాడు. అంతర్జాతీయ మ్యాచ్‍ల్లో వికెట్ కీపింగ్ చేస్తూ ప్రత్యర్థి జట్టు బ్యాటర్లపై వ్యూహాత్మకంగా అతడు చేసిన కామెంట్లు కొన్నిసార్లు వైరల్ అయ్యాయి. టెస్టుల్లో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. ఆస్ట్రేలియా ఆటగాళ్లను పంత్ ఎక్కువగా కవ్విస్తుంటాడు. అయితే, ప్రస్తుతం జరుగుతున్న దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలో ఇండియా-బీ తరఫున ఆడుతున్న పంత్ తన మార్క్ ఫన్నీ స్లెడ్జింగ్‍తో అదరొగట్టాడు.

‘టెన్షన్ పడొద్దు’.. ‘అయితే ఔటైపో’

ఈ మ్యాచ్ నాలుగో రోజైన నేడు ఇండియా-ఏ వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ తరుణంలో కుల్దీప్ యాదవ్ నిలకడగా ఆడుతూ మందుకు సాగాడు. దీంతో కుల్దీప్‍ను వికెట్ కీపింగ్ చేస్తున్న పంత్ కవ్వించాడు. భారత జట్టులో తన టీమ్‍మేట్ అయిన అతడిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కుల్దీప్ కూడా పంత్ పంచ్‍లకు స్పందించాడు. ఇదంతా స్టంప్ మైక్‍లో రికార్డు అయింది.

ఇతడిని ఔట్ చేసేందుకు మంచి ప్లాన్ వేశానని రిషబ్ పంత్ అరిచాడు. ఇది ఓ ఎత్తు అని తెలుసుకున్న కుల్దీప్ కూడా రెస్పాండ్ అయ్యాడు. “అతడిని (కుల్దీప్) సింగిల్ తీసుకోనివ్వండి. ఔట్ చేసేందుకు నేడు గట్టి ప్లాన్ చేశా” అని పంత్ అన్నాడు.

దీనికి కుల్దీప్ స్పందించాడు. “సరేలే. ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావ్. ప్రశాంతంగా ఉండు” అని కుల్దీప్ చెప్పాడు. “ అయితే, నువ్వు త్వరగా ఔట్ అయిపో” అని కుల్దీప్‍తో పంత్ అన్నాడు. ఈ ముచ్చట్లన్నీ స్టంప్‍ మైక్‍లో వినిపించాయి. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది. చాలా రోజుల తర్వాత ఫస్ట్ క్లాస్ క్రికెట్ బరిలోకి దిగిన పంత్.. అదే జోరు చూపిస్తున్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పంత్ మార్క్ ఫన్ అంటూ రాసుకొస్తున్నారు.

ప్రత్యర్థి టీమ్‍తో..

మ్యాచ్ నాలుగో రోజు మొదలయ్యే ముందు శుభ్‍మన్ గిల్ సారథ్యంలోని ఇండియా-ఏ జట్టు ఆటగాళ్లు రౌండ్‍గా నిల్చొని మీటింగ్‍లో మాట్లాడుకున్నారు. వ్యూహాల గురించి చర్చించుకున్నారు. అయితే, ఇండియా-బీ తరఫున ఆడుతున్న పంత్.. వారి కలిసిపోయి నిలబడ్డాడు. ప్రత్యర్థి జట్టు మీటింగ్‍లో దూరిపోయాడు. అంతా అయిపోయాక పంత్‍ను ఆవేశ్ ఖాన్ గుర్తించాడు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

ఇండియా-బీ విజయం

దులీప్ ట్రోఫీలో ఈ మ్యాచ్‍లో ఇండియా-ఏపై ఇండియా-బీ జట్టు విజయం సాధించింది. 76 పరుగుల తేడాతో అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్సీలోని బీ టీమ్ గెలిచింది. 275 రన్స్ లక్ష్యఛేదనలో రెండో ఇన్నింగ్స్‌లో నేడు (సెప్టెంబర్ 8) ఇండియా-ఏ 198 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (121 బంతుల్లో 57 పరుగులు) పోరాడాడు. అయినా ఫలితం లేకపోయింది. అక్షదీప్ (43) మినహా మిగిలిన వారు విఫలమయ్యారు. దీంతో ఇండియా-ఏ వెనువెంటనే వికెట్లు కోల్పోయింది. ఇండియా-బీ బౌలర్లలో యశ్ దయాల్ మూడు వికెట్లతో రాణించాడు. ముకేశ్ కుమార్, నవదీప్ సైనా తలా రెండు వికెట్లు దక్కంచుకున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులు చేసిన ఇండియా-బీ బ్యాటర్ ముషీర్‌ ఖాన్‍కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.