Rinku Singh Engagement: లోక్‌సభ ఎంపీతో టీమిండియా స్టార్ క్రికెటర్ రింకు సింగ్ ఎంగేజ్‌మెంట్.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్-rinku singh engagement to lok sabha mp priya saroj social media post gone viral ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rinku Singh Engagement: లోక్‌సభ ఎంపీతో టీమిండియా స్టార్ క్రికెటర్ రింకు సింగ్ ఎంగేజ్‌మెంట్.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్

Rinku Singh Engagement: లోక్‌సభ ఎంపీతో టీమిండియా స్టార్ క్రికెటర్ రింకు సింగ్ ఎంగేజ్‌మెంట్.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్

Hari Prasad S HT Telugu
Jan 17, 2025 06:00 PM IST

Rinku Singh Engagement: టీమిండియా స్టార్ క్రికెటర్ రింకు సింగ్ లోక్‌సభ ఎంపీ ప్రియా సరోజ్ తో నిశ్చితార్థం చేసుకున్నట్లు వస్తున్న వార్తలు వైరల్ అవుతున్నాయి. ఓ సోషల్ మీడియా పోస్ట్ ఆసక్తికరంగా మారింది.

లోక్‌సభ ఎంపీతో టీమిండియా స్టార్ క్రికెటర్ రింకు సింగ్ ఎంగేజ్‌మెంట్.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
లోక్‌సభ ఎంపీతో టీమిండియా స్టార్ క్రికెటర్ రింకు సింగ్ ఎంగేజ్‌మెంట్.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్

Rinku Singh Engagement: టీమిండియా స్టార్ క్రికెటర్ రింకు సింగ్ తెలుసు కదా. అతడు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఏకంగా సమాజ్‌వాదీ పార్టీకి చెందిన లోక్‌సభ ఎంపీ ప్రియా సరోజ్ తోనే అతని ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు వస్తున్న వార్తలు వైరల్ గా మారాయి. ఈమె ఉత్తర ప్రదేశ్ లోని మచిలీషహర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే ఇది ఎంత వరకు నిజమన్నదానిపై స్పష్టత లేదు.

రింకు సింగ్ నిశ్చితార్థం

స్టార్ క్రికెటర్, టీ20 క్రికెట్ లో మంచి ఫినిషర్ గా ఎదుగుతున్న రింకు సింగ్ కు సంబంధించి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వస్తోంది. అతని ఎంగేజ్‌మెంట్ జరిగిందని, అది కూడా ఎంపీ ప్రియా సరోజ్ తో అన్న వార్తలు ఆసక్తి రేపుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.

అయితే ముఫద్దల్ వోహ్రా అనే వెరిఫైడ్ ఎక్స్ అకౌంట్ నుంచి వచ్చిన పోస్ట్ మాత్రం వైరల్ అవుతోంది. "రింకు సింగ్ సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ తో నిశ్చితార్థం చేసుకున్నాడు. వాళ్లకు శుభాకాంక్షలు" అనే క్యాప్షన్ తో ఈ ఇద్దరి ఫొటోలను పోస్ట్ చేశాడు. ఈ వార్తల్లో నిజమెంత అన్నది తేలాల్సి ఉంది.

ఎవరీ ప్రియా సరోజ్?

ప్రియా సరోజ్ యూపీకి చెందిన ఎంపీ. ఆమె వయసు కేవలం 26 ఏళ్లు మాత్రమే. ప్రియ ఓ లాయర్ కూడా. సమాజ్‌వాదీ పార్టీ తరఫున ఎంపీగా గెలిచింది. గతేడాది జరిగిన ఎన్నికల్లో పార్లమెంట్ లో అడుగుపెట్టిన సెకండ్ యంగెస్ట్ ఎంపీగా పేరుగాంచింది.

గతంలో మూడుసార్లు ఎంపీ, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న తుఫానీ సరోజ్ కూతురే ఈ ప్రియా సరోజ్. ఆమె నవంబర్ 23, 1998లో యూపీలోని వారణాసిలో జన్మించింది. గతేడాది ఎన్నికల్లో మచిలీషహర్ నుంచి 35850 ఓట్లతో బీపీ సరోజ్ ను ఓడించి ఎంపీగా ఎన్నికైంది.

రింకు సింగ్ ఎక్కడ?

ప్రస్తుతం రింకు సింగ్ ఇంగ్లండ్ తో జరగబోయే వైట్ బాల్ సిరీస్ కు సిద్ధమవుతున్నాడు. ఇంగ్లండ్ తో జనవరి 22 నుంచి ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్ జరగనుంది. జనవరి 22న కోల్‌కతాలో తొలి టీ20 జరుగుతుంది. దీనికోసం శనివారమే (జనవరి 18) టీమ్ కోల్‌కతాలో క్యాంప్ కు వెళ్లనుంది.

టీ20 సిరీస్ కోసం ఇప్పటికే జట్టును ఎంపిక చేశారు. కొన్నాళ్లుగా టీమిండియా టీ20 జట్టులో రింకు సింగ్ రెగ్యులర్ గా ఉంటూ వస్తున్నాడు. ఇప్పుడు ఇంగ్లండ్ తో సిరీస్ లోనూ అతడు కీలకపాత్ర పోషించబోతున్నాడు.

Whats_app_banner