Rinku Singh: టెంపుల్ కోసం రింకూ సింగ్ భారీ విరాళం - నెటిజ‌న్ల ప్ర‌శంస‌లు-rinku singh donated 11 lakhs for temple construction on his birthday ,cricket న్యూస్
తెలుగు న్యూస్  /  Cricket  /  Rinku Singh Donated 11 Lakhs For Temple Construction On His Birthday

Rinku Singh: టెంపుల్ కోసం రింకూ సింగ్ భారీ విరాళం - నెటిజ‌న్ల ప్ర‌శంస‌లు

Nelki Naresh Kumar HT Telugu
Oct 12, 2023 10:48 AM IST

Rinku Singh: పుట్టిన‌రోజు నాడు ఓ టెంపుల్ నిర్మాణం కోసం 11 ల‌క్ష‌లు విరాళం ఇచ్చి నెటిజ‌న్ల మ‌న‌సుల్ని గెలుచుకున్నాడు టీమిండియా క్రికెట‌ర్ రింకూ సింగ్‌.

రింకూ సింగ్‌
రింకూ సింగ్‌

Rinku Singh: పుట్టిన‌రోజు నాడు మంచి ప‌నిచేసి అభిమానుల మ‌న‌సుల్ని గెలుచుకున్నాడు టీమిండియా క్రికెట‌ర్ రింకూ సింగ్‌. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని క‌మ‌ల్‌పూర్‌లో ఓ టెంపుల్ నిర్మాణం కోసం 11 ల‌క్ష‌ల‌ను విరాళంగా ఇచ్చాడు. గురువారం త‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ విరాళం అంద‌జేశాడు. అత‌డిపై నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

రింకూ సింగ్ మంచి మ‌న‌సుకు నిద‌ర్శ‌న‌మిద‌ని పొగ‌డుతోన్నారు. రింకూ సింగ్‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా శుభాకాంక్ష‌లు అంద‌జేస్తున్నారు. ఐపీఎల్ 2023 సీజ‌న్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ త‌ర‌ఫున బ‌రిలోకి దిగాడు రింకూ సింగ్‌. ఈ సీజ‌న్‌తోనే అత‌డి బ్యాటింగ్ ప్ర‌తిభ‌ వెలుగులోకి వ‌చ్చింది. గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో చివ‌రి ఓవ‌ర్‌లో ఐదుసిక్స‌ర్లు కొట్ట‌డంతో రింకూ సింగ్ పాపుల‌ర్ అయ్యాడు.

అంచ‌నాల‌కు మించి ధ‌నాధ‌న్ బ్యాటింగ్‌తో ఈ సీజ‌న్‌లో రాణించిన రింకూ సింగ్ 14 మ్యాచ్‌ల‌లో 474 ర‌న్స్ చేశాడు. ఐపీఎల్ ప్ర‌ద‌ర్శ‌న‌తో ఏషియ‌న్ గేమ్స్ కోసం ఎంపిక‌చేసిన టీమిండియా యువ జ‌ట్టులో స్థానం సంపాదించాడు. ఏషియ‌న్ గేమ్స్‌లో రాణించాడు. ఐపీఎల్‌లో కోల్‌క‌తాకంటే ముందు పంజాబ్ కింగ్స్ త‌ర‌ఫున ఆడాడు రింకూ సింగ్‌. కానీ తుది జ‌ట్టులో అడే అవ‌కాశం అత‌డికి రాలేదు.

WhatsApp channel

టాపిక్

For latest cricket news, live score stay connected with HT Telugu