Indian cricketers: రెడ్ కార్పెట్ పై కోహ్లి, రోహిత్.. డోలు చప్పుళ్లు.. జానపద నృత్యాలు.. భారత ఆటగాళ్లకు ఘన స్వాగతం
Indian cricketers: ఇంగ్లండ్ తో రెండో వన్డే కోసం భువనేశ్వర్ లోని హోటల్ కు చేరుకున్న టీమ్ఇండియా సభ్యులకు ఘనస్వాగతం లభించింది. కోహ్లి, రోహిత్ సహా క్రికెటర్లు రెడ్ కార్పెట్ పై నడుచుకుంటూ వచ్చారు.

టీమ్ఇండియా సభ్యులకు ఘనస్వాగతం
రెడ్ కార్పెట్.. డోలు వాయిద్యాలు.. జానపద నృత్యాలు.. ఫ్యాన్స్ ఛీరింగ్.. ప్రత్యేక శాలువాలు.. ఇదీ టీమ్ఇండియా ఆటగాళ్లకు లభించిన ఘన స్వాగతం. ఆదివారం (ఫిబ్రవరి 9) ఇంగ్లండ్ తో రెండో వన్డే కోసం భువనేశ్వర్ చేరుకున్న భారత జట్టుకు హోటల్లో గ్రాండ్ వెల్ కమ్ దక్కింది. కెప్టెన్ రోహిత్, స్టార్ బ్యాటర్ కోహ్లి ని చూసి అభిమానులు కేకేలు వేశారు.
రెడ్ కార్పెట్ పరిచి
భారత జట్టుకు స్వాగతం పలికేందుకు అభిమానులు, ఒడిశా క్రికెట్ అసోసియేషన్ (ఓసీఏ) అధికారులు తరలిరావడంతో బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సందడి నెలకొంది. ఆ తర్వాత హోటల్లో ప్రత్యేక రెడ్ కార్పెట్ పరిచి, క్రికెటర్లకు స్వాగతం పలికేందుకు సంప్రదాయ జానపద నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు.
కోహ్లి కోహ్లి
ఆ రెడ్ కార్పెట్ నుంచి కోహ్లి నడుచుకుంటూ వస్తుంటే అక్కడే ఉన్న ఫ్యాన్స్ కేరింతలతో ప్లేస్ మార్మోగింది. ఆ తర్వాత రోహిత్ నామజపంతో పరిసరాలు దద్దరిల్లాయి. హోటల్ సిబ్బందిలోని ఓ సీనియర్ సభ్యుడు కోహ్లీని ఆప్యాయంగా కౌగిలించుకుని పలకరించారు.
అయిదేళ్ల తర్వాత వన్డే
ఇంగ్లండ్ తో రెండో వన్డేకు వేదికైన కటక్ లోని చారిత్రక బారాబతి స్టేడియంలో అయిదేళ్ల తర్వాత వన్డే మ్యాచ్ జరగబోతోంది. దీంతో ఓసీఏ అన్ని ఏర్పాట్లను ఘనంగా చేస్తోంది. ఈ మైదానంలో 19 వన్డేలు ఆడిన భారత్ 12 గెలిచి, 7 ఓడింది. ఇంగ్లండ్ తో మూడు మ్యాచ్ ల సిరీస్ లో తొలి వన్డే గెలిచిన భారత్.. ఈ మ్యాచ్ లోనూ గెలిచి ఇక్కడే సిరీస్ దక్కించుకోవాలని చూస్తోంది.
సంబంధిత కథనం