RCB vs LSG: కెప్టెన్‍గా కేఎల్ రాహుల్ ఈజ్ బ్యాక్.. చిన్నస్వామిలో విరాట్‍కు వందో మ్యాచ్-rcb vs lsg final xis toss kl rahul back as captain kohli 100th ipl match at chinnaswamy stadium bengaluru won toss ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rcb Vs Lsg: కెప్టెన్‍గా కేఎల్ రాహుల్ ఈజ్ బ్యాక్.. చిన్నస్వామిలో విరాట్‍కు వందో మ్యాచ్

RCB vs LSG: కెప్టెన్‍గా కేఎల్ రాహుల్ ఈజ్ బ్యాక్.. చిన్నస్వామిలో విరాట్‍కు వందో మ్యాచ్

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 02, 2024 07:21 PM IST

RCB vs LSG Toss - IPL 2024: ఐపీఎల్ 2024లో బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ మొదలైంది. ఒక మ్యాచ్ గ్యాప్ తర్వాత మళ్లీ లక్నో కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు కేఎల్ రాహుల్. ఈ మ్యాచ్‍లో బెంగళూరు టాస్ గెలిచింది.

RCB vs LSG: కెప్టెన్‍గా కేఎల్ రాహుల్ ఈజ్ బ్యాక్
RCB vs LSG: కెప్టెన్‍గా కేఎల్ రాహుల్ ఈజ్ బ్యాక్ (AFP)

RCB vs LSG IPL 2024: ఇండియన్ ప్రీమియర్ (IPL) 17వ సీజన్‍లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో మ్యాచ్‍కు బరిలోకి దిగింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB). గత మ్యాచ్‍లో ఓడిన ఆర్సీబీ మళ్లీ గాడిలో పడాలని పట్టుదలగా ఉంది. ఐపీఎల్ 2024 సీజన్‍లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నేడు (ఏప్రిల్ 2) ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‍లో టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంపిక చేసుకున్నాడు ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్.

yearly horoscope entry point

కెప్టెన్‍గా రాహులే

పంజాబ్‍తో ఆడిన గత మ్యాచ్‍లో లక్నో సూపర్ జెయింట్స్ రెగ్యులర్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడాడు. దీంతో ఆ మ్యాచ్‍లో లక్నో జట్టుకు నికోలస్ పూరన్ కెప్టెన్సీ చేశాడు. అయితే, బెంగళూరుతో ఈ మ్యాచ్‍లో పూర్తిస్థాయిలో ఆడేందుకు కేఎల్ రాహుల్ డిసైడ్ అయ్యాడు. దీంతో ఓ మ్యాచ్ గ్యాప్ తర్వాత మళ్లీ లక్నో జట్టుకు అతడే సారథ్యం వహిస్తున్నాడు.

గత మ్యాచ్‍తో పోలిస్తే తుది జట్టులో ఓ మార్పు చేసింది బెంగళూరు. పేసర్ అల్జారీ జోసెఫ్ స్థానంలో రీస్ టోప్లేని తీసుకుంది ఆర్సీబీ. లక్నో కూడా ఓ ఛేంజ్ చేసింది. మొహిసిన్ ఖాన్ ప్లేస్‍లో యశ్ ఠాకూర్‌ను తీసుకుంది.

ఈ స్టేడియంలో విరాట్‍కు వందోది

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీకి ఇది 100వ టీ20 మ్యాచ్‍గా ఉంది. ఐపీఎల్ తొలి సీజన్ నుంచి బెంగళూరు జట్టుకే అతడు ఆడుతున్నాడు. ఇప్పటివరకు ఓవరాల్‍గా 240 ఐపీఎల్ మ్యాచ్‍లు ఆడాడు కోహ్లీ.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తుదిజట్టు: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), కామెరూన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, రజత్ పాటిదార్, దినేశ్ కార్తీక్, అనూజ్ రావత్ (వికెట్ కీపర్), మయాంక్ దగర్, రీస్ టోప్లీ, మహమ్మద్ సిరాజ్, యశ్ దయాల్

బెంగళూరు సబ్ ఇంపాక్ట్ ఆప్షన్లు: సుయాశ్ ప్రభుదేశాయ్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, విజయ్ కుమార్ వేశాఖ్, స్వప్నిల్ సింగ్

లక్నో సూపర్ జెయింట్స్ తుదిజట్టు: క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, దేవ్‍దత్ పడిక్కల్, మార్కస్ స్టొయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోనీ, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, నవీనుల్ హక్, మయాంక్ యాదవ్

లక్నో సబ్ ఇంపాక్ట్ ఆప్షన్లు: మణిమరన్ సిద్ధార్థ్, షమార్ జోసెఫ్, దీపక్ హూడా, అమిత్ మిశ్రా, కృష్ణప్ప గౌతమ్

ఈ సీజన్‍లో ఇప్పటి వరకు మూడు మ్యాచ్‍ల్లో రెండు ఓడింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. గత మ్యాచ్‍లో హౌం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో కోల్‍కతా నైట్ రైడర్స్ చేతిలో పరాజయం పాలైంది ఆర్సీబీ. కోల్‍కతా బ్యాటర్లు వీరవిహారం చేసి 183 పరుగుల లక్ష్యాన్ని 16.5 ఓవర్లలోనే ఊదేశారు. బౌలింగ్‍లో పూర్తిగా తేలిపోయింది ఆర్సీబీ. దీంతో లక్నోతో నేటి మ్యాచ్‍లో బౌలింగ్‍లో ఓ మార్పు చేసింది. పేసర్ అల్జారీ జోసెఫ్ స్థానంలో టోప్లేను తుది జట్టులోకి తీసుకుంది. 

లక్నో సూపర్ జెయింట్స్ ఈ సీజన్‍లో ఇప్పటి వరకు రెండు మ్యాచ్‍ల్లో ఒకటి గెలిచింది. గత మ్యాచ్‍లో పంజాబ్‍పై గెలిచి జోష్‍లో ఉంది. బెంగళూరుపై రాణించి దూకుడు కొనసాగించాలని ఆశిస్తోంది. 

Whats_app_banner